డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ అడ్మిషన్స్
కోర్సు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం లభించాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం కానీ కొన్ని కోర్సులు చేస్తే మాత్రం ఉద్యోగం ఖాయం అవుతుంది. అందులో ప్లాస్టిక్ డిప్లొమాలు ఒకటి. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెలకొల్పిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) వీటిని అందిస్తుంది. ఈ సంస్థ మైదరాబాద్, విజయవాడ సహ దేశవ్యాప్తంగా 29 కేంద్రాల్లో డిప్లొమా, పీజీ డిప్లొమా, పోస్టు డిప్లొమా కోర్సులు నడుపుతుంది. వీటిలో అడ్మిషన్‌ల కొరకు నోటిఫికేషన్ విడుదలైంది.
కోర్సు
డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ)
డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ (డీపీటీ)
వ్యవధి :
- 3 సంవత్సరాలు (6 సెమిస్టర్లు)
విద్యార్హత :
- 10వ తరగతి ఉత్తీర్ణత
- ప్రస్తుతం చదువుతున్నవారూ అర్హులే.
పరీక్ష విధానం :
- జనరల్ నాలెడ్జ్ - 25
- సైన్స్ - 20
- ఇంగ్లిష్ - 05
కోర్సు
పోస్టు డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ డిజైన్ విత్ క్యాడ్ / క్యామ్ (పీడీపీఎండీ)
వ్యవధి :
- 18 నెలలు (3 సెమిస్టర్లు)
విద్యార్హత :
మెకానికల్ / ప్లాస్టిక్ టెక్నాజీ / టూల్ ప్రొడక్షన్ / ఆటోమొబైల్ / మెకట్రానిక్స్ / టూల్ డై అండ్ మేకింగ్ / సిపెట్ నుండి డిపీఎంటీ / డీపీటీ వీటిలో ఎందులోనైనా 3 సంవత్సరాల డిప్లొమా ఉండాలి.
కోర్సు
పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ (పీజీడీపీపీటీ)
వ్యవధి :
- 2 సంవత్సరాలు (4 సెమిస్టర్లు)
విద్యార్హత :
- ఏదైనా సైన్స్ డిగ్రీ ఉన్నవారు ధరఖాస్తు చేసుకోవచ్చు.
- చివరి ఏడాది విద్యార్థులూ అర్హులే
అన్ని కోర్సులకు ధరఖాస్తు విధానం
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 28 మే 2026
పైన తెలిపిన కోర్సులన్నీ హైదరాబాద్ క్యాంపస్‌లో అందిస్తున్నారు. పీడీ`పీఎండీ తప్ప మిగతా మూడూ విజయవాడ క్యాంపస్‌లో ఉన్నాయి. అన్ని కోర్సులకూ ఏ వయస్సు వారైనా ధరఖాస్తు చేసుకోవచ్చు.
For Online Apply

0 Comments