| అంశం |
వివరాలు |
| రాజ్యాంగ ప్రావధానం |
రాజ్యాంగంలోని 15వ భాగంలో ఆర్టికల్ 324 నుండి 329 వరకు కేంద్ర ఎన్నికల సంఘం గురించి వివరించబడింది. |
| ఆర్టికల్ 324 |
భారతదేశంలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటవుతుంది. |
| ఆర్టికల్ 324(1) |
ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ అధికారాలు ఉన్నాయి.
సాధారణ, మధ్యంతర, ఉపఎన్నికలు నిర్వహిస్తుంది.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తుంది.
రాజకీయ పార్టీల చిహ్నాల వివాదాలు పరిష్కరిస్తుంది.
|
| ఆర్టికల్ 324(2) |
ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఇతర కమీషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. |
| సంఘ నిర్మాణ మార్పులు |
1950–1989: ఏకసభ్య సంఘం
1989–1990: త్రిసభ్య సంఘం
1990–1993: మళ్లీ ఏకసభ్య సంఘం
1993 నుంచి: త్రిసభ్య సంఘం (1 ప్రధాన + 2 ఇతర కమీషనర్లు)
|
| నిర్ణయ విధానం |
భేధాభిప్రాయాల సమయంలో మెజార్టీ ఓటింగ్ ద్వారా నిర్ణయం తీసుకుంటారు. |
| నియామకం |
ప్రధాన మరియు ఇతర ఎన్నికల కమీషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. |
| పదవీకాలం |
6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయస్సు వరకు. |
| రాజీనామా |
రాష్ట్రపతికి రాజీనామా సమర్పించాలి. |
| తొలగింపు విధానం |
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు విధానంలాగే అభిశంసన తీర్మానం ద్వారా తొలగించవచ్చు. |
| జీతభత్యాలు |
పార్లమెంటు నిర్ణయిస్తుంది. కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. |
| అర్థ న్యాయాధికారాలు |
నోటిఫికేషన్లు జారీ చేయడం
ఎన్నికల వ్యయ అఫిడవిట్ పరిశీలన
అనర్హతలపై సలహా ఇవ్వడం
నామినేషన్ల అంగీకారం/తిరస్కారం
ప్రచార సమయం కేటాయింపు
ఎన్నికల వాయిదా నిర్ణయాలు
ప్రవర్తనా నియమావళి అమలు
|
| ఆర్టికల్ 325 |
ఓటు హక్కు విషయంలో కుల, మత, జాతి, లింగ వివక్షణ నిషేధం. |
| ఆర్టికల్ 326 |
18 సంవత్సరాలు నిండిన ప్రతి భారత పౌరుడికి సార్వజనీన వయోజన ఓటు హక్కు. |
| ఆర్టికల్ 327 |
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చట్టాలను పార్లమెంటు రూపొందిస్తుంది. |
| ఆర్టికల్ 329 |
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థాన జోక్యం ఉండదు. |
0 Comments