| స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) |
| పరిచయం |
భారతదేశంలో చిన్నతరహా పరిశ్రమలకు రుణాలిచ్చే శిఖరాగ్ర సంస్థ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI).
ఇది ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) కి అనుబంధ సంస్థ.
1988లో పార్లమెంట్ ప్రత్యేక చట్టం ద్వారా స్థాపించబడింది.
1990 ఏప్రిల్ 2 నుండి బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
|
| ప్రధాన పాత్ర |
చిన్నతరహా పరిశ్రమలకు ఆర్థిక చేయూత, అభివృద్ధికి ప్రోత్సాహం అందిస్తుంది.
రుణాల రీఫైనాన్స్, మార్కెటింగ్ సహాయం, సాంకేతికత, ఆధునికీకరణ,
ఉపాధి కల్పన మరియు ఇతర ఆర్థిక సేవలను అందిస్తుంది.
|
| లక్ష్యాలు |
- సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) రంగాన్ని ప్రోత్సహించడం
- MSMEలకు సకాలంలో రుణాలు, నిర్వహణ మూలధనం అందించడం
- MSME రంగానికి ప్రధాన ఆర్థిక సంస్థగా వ్యవహరించడం
- వివిధ ఏజెన్సీలను సమన్వయం చేయడం
- సాంకేతికత, నైపుణ్యాలు, నూతన ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడం
- మహిళలు, యువత వ్యవస్థాపకతను ప్రోత్సహించడం
- నోడల్ ఏజెన్సీగా వ్యవహరించడం
|
| వాటా మూలధనం |
- కేంద్ర ప్రభుత్వం – 20.85%
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 15.65%
- ఎల్‌ఐసీ – 13.33%
- నాబార్డ్ – 9.36%
- ఇతర సంస్థలు – 40.81%
|
| విధులు |
- దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో చిన్న పరిశ్రమల ఉత్పత్తుల మార్కెటింగ్‌కు సహాయం
- సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉపాధి ఆధారిత పరిశ్రమల స్థాపన ప్రోత్సాహం
- బ్యాంకులు ఇచ్చే రుణాలకు రీఫైనాన్స్ సదుపాయం
- వర్కింగ్ క్యాపిటల్ మరియు టర్మ్ లోన్స్ అందించడం
- MSME రంగానికి సంబంధించిన సంస్థల కార్యకలాపాల సమన్వయం
- IDBI నిర్వహించిన చిన్న పరిశ్రమల అభివృద్ధి నిధి, జాతీయ ఈక్విటీ నిధుల నిర్వహణ
|
0 Comments