Thermal, Nuclear, Solar Energy Explained in Telugu | Indian Geography in Telugu

indian geography
 

భారతదేశ శక్తి వనరులు | India Energy Resources in Telugu | Indian Geography in Telugu

శక్తి అనేది ఒక ముఖ్యమైన సహజ వనరు మాత్రమే కాదు, దేశ ఆర్థిక అభివృద్ధిని నిర్ధేశించే ప్రాథమిక కారకం. వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా, సమాచార సాంకేతికత వంటి అన్ని రంగాలు శక్తి వనరులపై ఆధారపడి ఉన్నాయి. అందుకే శక్తి వనరులను దేశ అభివృద్ధికి కీలకమైన సంపదగా పరిగణిస్తారు.ప్రస్తుతం మానవ జీవితం పూర్తిగా శక్తి వనరులపై ఆధారపడి ఉంది. మనం ఉపయోగించే ప్రతి వస్తువు ఉత్పత్తిలోనూ శక్తి ప్రధాన పాత్ర పోషిస్తుంది.

శక్తి వనరుల వర్గీకరణ :

భారతదేశంలో శక్తి వనరులను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరిస్తారు.

1. సాంప్రదాయ (తరిగిపోయే) శక్తి వనరులు

2. సంప్రదాయేతర (తరగిపోని) శక్తి వనరులు

సాంప్రదాయ శక్తి వనరులు (Conventional Energy Resources)

బొగ్గు, చమురు, సహజవాయువు, యురేనియం, థోరియం వంటి ఖనిజాల ఆధారంగా ఉత్పత్తి అయ్యే శక్తిని సాంప్రదాయ శక్తి వనరులుగా పిలుస్తారు. ఇవి ప్రకృతిలో పరిమితంగా మాత్రమే లభ్యమవుతాయి. ఎక్కువగా వినియోగిస్తే ఇవి తరిగిపోతాయి మరియు మానవుడు వీటిని తిరిగి పునరుద్ధరించలేడు.అందుకే భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని వీటిని క్రమబద్ధంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది.

సంప్రదాయేతర శక్తి వనరులు (Non-Conventional Energy Resources)

నీటి శక్తి, సౌర శక్తి, పవన శక్తి, భూతాప శక్తి, సముద్ర తరంగ శక్తి వంటి వనరులు సంప్రదాయేతర శక్తి వనరులుగా పరిగణించబడతాయి. ఇవి ప్రకృతిలో నిరంతరం లభ్యమవుతాయి కాబట్టి తరగిపోవు.అయితే వీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం.

భారతదేశంలో ప్రధాన శక్తి వనరులు :

మనదేశంలో బొగ్గు, చమురు, సహజవాయువు, నీరు ప్రధాన శక్తి వనరులు. సౌరశక్తి మరియు పవనశక్తి వినియోగం ఇటీవల వేగంగా అభివృద్ధి చెందుతోంది. అలాగే అణు విద్యుత్ రంగం కూడా మంచి అభివృద్ధి దశలో ఉంది.

థర్మల్ విద్యుత్ (Thermal Power in India)

బొగ్గు మరియు నీటి ఆవిరి ఆధారంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను థర్మల్ విద్యుత్ అంటారు. భారతదేశ మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సుమారు 73 శాతం థర్మల్ విద్యుత్ నుంచే వస్తోంది. ఎక్కువ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేసే రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్

సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ అంటే ఏమిటి?

  • 1000 మెగావాట్లకు మించిన సామర్థ్యం ఉన్న పవర్ స్టేషన్‌ను సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ అంటారు.
  • 4000 మెగావాట్లకు మించిన సామర్థ్యం ఉంటే వాటిని అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ అని పిలుస్తారు.

భారతదేశంలోని సూపర్ థర్మల్ పవర్ స్టేషన్లు

పవర్ స్టేషన్రాష్ట్రం
సింగ్రౌలిఉత్తరప్రదేశ్
దాద్రిఉత్తరప్రదేశ్
రీహాండ్ఉత్తరప్రదేశ్
వూంచహార్ఉత్తరప్రదేశ్
సింహాద్రిఆంధ్రప్రదేశ్
రామగుండంతెలంగాణ
వింద్యాచల్మధ్యప్రదేశ్
కోర్బాఛత్తీస్‌ఘడ్
కహాల్‌గావ్బీహార్
తాల్చేర్ఒడిశా
కాయంకుళంకేరళ
ఫరక్కాపశ్చిమ బెంగాల్

అణు విద్యుత్ (Nuclear Power in India) :

అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన యురేనియం, థోరియం వంటి ఖనిజాలు భారతదేశంలో సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా కేరళ తీరం వెంట ఉన్న మోనజైట్ ఇసుకల్లో ప్రపంచంలోనే అత్యధికంగా థోరియం నిల్వలు ఉన్నాయి. భారతదేశంలో అణు విద్యుత్ సామర్థ్యం ప్రస్తుతం సుమారు 4780 మెగావాట్లు, ఇది దేశ మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో దాదాపు 3 శాతం.

భారతదేశంలోని ప్రధాన అణు విద్యుత్ కేంద్రాలు

  •  తారాపూర్ – మహారాష్ట్ర
  •  రావత్‌భటా – రాజస్థాన్
  •  కల్పకం – తమిళనాడు
  •  నరోరా – ఉత్తరప్రదేశ్
  •  కాక్రపార – గుజరాత్
  •  కైగా – కర్ణాటక

Post a Comment

0 Comments