Antoine Lavoisier Biongraphy in Telugu | ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు - ఆంటోనీ లారెంట్ డి లెవోయిజర్

Antoine Lavoisier
 
ఆంటోనీ లెవోయిజర్ (Antoine Lavoisier) 

వ్యక్తిగత వివరాలు :

  •  ఫ్రాన్స్‌కు చెందిన ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త.
  •  పూర్తి పేరు: ఆంటోనీ లారెంట్ డి లెవోయిజర్
  •  జననం: 26 ఆగస్టు 1743, పారిస్, ఫ్రాన్స్.
  •  ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడిగా ప్రసిద్ధి. 

ముఖ్య కృషి :

  •  దహన (Combustion) చర్యలపై విస్తృత పరిశోధనలు చేశారు.
  •  మూలకానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు.
  •  ద్రవ్యనిత్యత్వ నియమం (Law of Conservation of Mass) ను ప్రతిపాదించారు.
  •  దహన మరియు శ్వాసక్రియలో ఆక్సిజన్ పాత్రను కనుగొన్నారు.
  •  1777లో “ఆక్సిజన్” అనే పేరు పెట్టారు.
  •  1783లో “హైడ్రోజన్” అనే పదాన్ని ప్రవేశపెట్టారు.
  •  నీరు ఒక మూలకం కాదని, అది ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ సమ్మేళనం అని నిరూపించారు.
  •  సల్ఫర్, హైడ్రోజన్‌ను మూలకాలుగా గుర్తించారు.
  •  55 మూలకాల తొలి సమగ్ర జాబితాను రూపొందించారు.
  •  రసాయన పదార్థాలకు హేతుబద్ధమైన (బైనరీ) నామకరణ వ్యవస్థను ప్రవేశపెట్టారు.
  •  పదార్థం స్థితి లేదా ఆకారం మారినా ద్రవ్యరాశి మారదని నిరూపించారు.

విద్యాభ్యాసం :

  •  1754లో పారిస్‌లోని కాలేజ్ డెస్ క్వాట్రే నేషన్స్ లో చదువుకున్నారు.
  •  అబ్బే నికోలస్ లూయిస్ డి లాకైల్ మార్గదర్శకత్వంలో సహజ తత్వశాస్త్రం, గణితం, రసాయన శాస్త్రం, ఖగోళ శాస్త్రం అభ్యసించారు.
  •  1761లో తండ్రి కోరిక మేరకు పారిస్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివారు.
  •  1763లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు.
  •  1764లో లాయర్‌గా ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ పొందారు.
  •  1768లో ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో తాత్కాలిక సభ్యుడయ్యారు.
  •  అదే సంవత్సరం “ఫెర్మ్ జనరల్” అనే పన్నుల వసూలు సంస్థలో భాగస్వామిగా చేరారు.

ఆవిష్కరణలు :

  •  దహన, శ్వాసక్రియ, కాల్సినేషన్ ప్రక్రియల్లో ఆక్సిజన్ పాత్రను నిర్ధారించారు.
  •  రసాయన ప్రతిచర్యల సమయంలో ద్రవ్యరాశి సృష్టి లేదా నాశనం జరగదని నిరూపించారు.
  •  నీరు, గాలి, భూమి వేర్వేరు మూలకాల సమ్మేళనాలు అని వివరించారు.

మరణం : 

  •  1789లో ఫ్రాన్స్‌లో ఫ్రెంచ్ విప్లవం ప్రారంభమైంది.
  •  1792లో ఫ్రాన్స్ గణతంత్ర రాజ్యంగా మారింది.
  •  “ఫెర్మ్ జనరల్” సంస్థలో భాగస్వామిగా ఉన్నందుకు విప్లవకారుల వ్యతిరేకత ఎదురైంది.
  •   రైతుల వద్ద అక్రమంగా పన్ను వసూలు చేశారనే ఆరోపణలతో
  •  8 మే 1784న ఉరితీయబడ్డారు.
  •  అనంతరం ప్రభుత్వం ఆయనను నిర్దోషిగా ప్రకటించింది.

Post a Comment

0 Comments