TS RGUKT IIIT Basara Notification 2026-2027 for B.Tech admisions apply online at rgukt.ac.in
ఎస్.ఎస్.సి (10వ తరగతి) లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నిర్మల్ జిల్లా బాసరలోని Rajiv Gandhi University of Knowledge Technologies-Basar (RGUKT) లో బిటెక్‌లో ప్రవేశం పొందడానికి అవకాశం కల్పిస్తుంది. చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు బాసరలోని ట్రిపుల్ ఐటిలో అడ్మిషన్ ఎలా పొందాలో తెలియక సీటు దక్కించుకోలేకపోతారు. ఈ నేపథ్యంలో బాసర ట్రిపుల్‌ఐటీ ప్రవేశాల ధరఖాస్తు విధానం, ఫీజు వివరాలు, ఆన్‌లైన్ ప్రక్రియ, ముఖ్యమైన తేదీల గురించి వివరంగా కింద ఇవ్వడం జరిగింది.
రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) బాసర ట్రిపుల్‌ఐటీలో 6 సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సు ఉంటుంది. ఇందులో ప్రవేశం పొందే విద్యార్థులు ఎస్.ఎస్.సి(10వ తరగతి) రెగ్యులర్ విధానంలో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
మహబూబ్‌నగర్‌లో కొత్త RGUKT IIIT క్యాంపస్‌కు అనుమతి లభించింది. కొత్త క్యాంపస్‌లో మూడు కొత్త కోర్సులు అందుబాటులో తీసుకురానున్నారు. CSC, AI & ML, DATA SCIENCE కోర్సులు ప్రారంభం కానున్నాయి. RGUKT బాసర ఆధ్వర్యంలోనే మహబూబ్‌నగర్ క్యాంపస్ నడవనుంది.
➠ విద్యార్హత :
మొదటి ప్రయత్నంలో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి
➠ క్యాంపస్ లు :
- బాసర
- మహబూబ్ నగర్
➠ ఎంపిక పద్దతి :
- 10వ తరగతిలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వారి జీపీఏకు 0.4 డిప్రెవేషన్ స్కోర్‌ను అదనంగా కలుపుతారు.
- 85 శాతం సీట్లను స్థానికంగా, మిగిలిన 15 శాతం సీట్లను మెరిట్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు కేటాయించారు.
- ప్రత్యేక సీట్ల కింద వికలాంగులకు 3 శాతం, సైనికోద్యోగుల పిల్లలకు 2 శాతం, ఎన్‌సీసీ విద్యార్థులకు 1 శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.5 శాతం సీట్లను ఎంపిక చేస్తారు.
- 33.33 శాతం సీట్లను సమాంతరంగా బాలికలకు కేటాయిస్తారు.
- తెలుగు రాష్ట్రాల విద్యార్థులే కాకుండా వేరే రాష్ట్రాల వారికి, అంతర్జాతీయ విద్యార్థులకు, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వారి పిల్లలకు అదనపు సీట్లు కేటాయిస్తారు.
Also Read :
➠ విద్యా సౌకర్యాలు :
విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం, యూనిఫారం, షూస్, ల్యాప్‌టాప్ వంటి సౌకర్యాలు ఉంటాయి.
➠ ధరఖాస్తు ఫీజు :
- ఓసీ, బీసీ అభ్యర్థులకు 500/- రూపాయలు
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 450/- రూపాయలు
➠ ధరఖాస్తు విధానం :
- ధరఖాస్తులు ఆన్‌లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది.
➠ ఫీజు వివరాలు :
- సెమిస్టర్ కలుపుకొని సంవత్సర ఫీజు 36,000 రూపాయలు చెల్లించాలి (ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉన్నవారు చెల్లించాల్సిన అవసరం లేదు)
- తెలంగాణకు సంబందించిన ఎన్నారైల పిల్లలు 1,36,000 రూపాయలు చెల్లించాలి
- మిగతా ఎన్నారైలు అయితే 3,00,000 రూపాయలు చెల్లించాలి.
- ప్రవేశ సమయంలో ఆరోగ్యభీమా ఇతరాలకు 3,500 రూపాయలు (ఎస్సీ/ఎస్టీలు అయితే 3వేలు) చెల్లించాలి.
➠ కోర్సు కాలపరిమితి :
ఇది 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు. 6 సంవత్సరాల కోర్సును 2 రకాలుగా విభజిస్తారు
1) ప్రీ యూనివర్సీటి కోర్సు (2 సంవత్సరాలు)
- గణితం
- భౌతిక శాస్త్రం
- కెమిస్ట్రీ
- ఇంగ్లీష్
- తెలుగు/సంస్కృతం (తెలుగు భాషగా సెకండ్ లాంగ్వేజ్‌ని అభ్యసించని తెలుగుయేతర విద్యార్థులకు సంస్కృతం అందించబడుతుంది)
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
- పర్యావరణ శాస్త్రం
2) బీ.టెక్ (4 సంవత్సరాలు)
- కెమికల్ ఇంజనీరింగ్
- సివిల్ ఇంజనీరింగ్
- కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
- ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
- మెకానికల్ ఇంజనీరింగ్
- మెటలర్జికల్ మరియు మెటీరియల్స్ ఇంజనీరింగ్

0 Comments