డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు నెలకు 4 వేల స్కాలర్‌షిప్

ONGC Scholarship
ONGC Scholarship 2026: ₹4000 Monthly for Degree & PG Students

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) ఒకటి. చమురు, సహజవాయువుల విభాగంలో ఇది అంతర్జాతీయ గుర్తింపు కల్గి ఉంది. ఈ సంస్థ ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ,జనరల్ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్పులు అందిస్తుంది. 

సంస్థ : 

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC)

విద్యార్హత : 

  • డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులు 
  • ఏదైనా విద్యా సంస్థలో పుల్‌టైమ్ కోర్సు రెగ్యులర్ విధానంలో చదువుతున్నవారై ఉండాలి. 
  • బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఇంజనీరింగ్ (బీఈ/బీటెక్), ఎంబీబీఎస్ లేదా పీజీ స్థాయిలో జీయాలజీ / జియోఫిజిక్స్ / ఎంబీఏ  వీటిలో ఏ కోర్సులోనైనా 2025-26 విద్యా సంవత్సరంలో చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే ధరఖాస్తు చేసుకోవాలి 
  • ఇంజీనిరింగ్, ఎంబీబీఎస్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి 
  • ఎమ్మెస్సీ జియాలజీ / జియోఫిజిక్స్ లేదా ఎంబీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులు డిగ్రీలో 60 శాతం ఉండాలి. 
  • వార్షికాదాయం 2 లక్షలకు మించరాదు. 

వయస్సు : 

  • 01 జనవరి 2025 నాటికి 30 సంవత్సరాల లోపు ఉండాలి 

స్కాలర్‌షిప్ మొత్తం

  • ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరినవారికి నాలుగేళ్ల పాటు రూ॥4000/- చొప్పున చెల్లిస్తారు.
  • ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్ కోర్సుల్లో చేరినవాళ్లకు రెండేళ్లపాటు నెలకు రూ॥4000/- చొప్పున చెల్లిస్తారు. 

ఎంపిక విధానం :

  • ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులకు ఇంటర్‌లో ప్రతిభ ఆధారంగా 
  • ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్ కోర్సులకు డిగ్రీలో ప్రతిభ ఆధారంగా 

కావాల్సిన ధవీకరణ పత్రాలు : 

  • కులం సర్టిఫికేట్ 
  • 10వ తరగతి మెమో 
  • ఇంటర్ / డిగ్రీ మెమో 
  • ఆదాయం సర్టిఫికేట్ 
  • బ్యాంక్ ఖాతా 
  • పాన్‌కార్డు 
  • ఆధార్ కార్డు 


ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 15 మే 2026


For Online Apply

Click here


Post a Comment

0 Comments