ఢిల్లీ సుల్తానులు | లోడీ వంశం (1451-1526)
Delhi Sultanate : Lodi Dynasty in Telugu | Indian History in Telugu
ఢిల్లీ సుల్తానులు భారతదేశాన్ని 1206 నుండి 1526 సంవత్సరాల వరకు పరిపాలించారు. మహ్మద్‌ఘోరి మరణానంతరం 1206 సంవత్సరంలో కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సుమారు మూడు శతాబ్దాల కాలం పాటు ఢిల్లీ కేంద్రంగా బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి వంశాలు భారతదేశాన్ని పరిపాలించాయి. భారతదేశాన్ని పరిపాలించిన మొదటి ముస్లీం రాజవంశం.
క్రీ.శ.1206 నుండి 1526 వరకు ఢిల్లీని 5 రాజవంశాలు పరిపాలించాయి.
1) బానిస వంశం (1206-1290)
2) ఖిల్జీ వంశం (1290-1320)
3) తుగ్లక్ వంశం (1320-1414)
4) సయ్యద్ వంశం (1414-1451)
5) లోడీ వంశం (1451-1526)
లోడీ వంశం (1451-1526)
సయ్యద్ వంశం తర్వాత ఢిల్లీ సామ్రాజ్యాన్ని లోడివంశం పరిపాలించింది. వీరు 1451 నుండి 1526 వరకు ఢిల్లీ రాజ్యాన్ని పాలించారు. లోడీలు ఢిల్లీని పరిపాలించిన మొదటి అప్ఘన్ వంశస్థులు. లోడీవంశాన్ని బహలాల్ లోడీ స్థాపించాడు.
➠ బహలాల్ లోడి (1451-1489) :
బహలాల్ లోడి లోడీవంశాన్ని స్థాపించాడు. ఢిల్లీ సుల్తాలందరిలోకి ఎక్కువ కాలం పరిపాలించిన రాజు. ఇతను 39 సంవత్సరాలు ఢిల్లీని పరిపాలించాడు. ఇతని తర్వాత సికిందర్ లోడీ అధికారంలోకి వచ్చాడు.
➠ సికిందర్ లోడీ (1489-1517) :
ఇతని అసలు పేరు నిజాంఖాన్. లోడీవంశస్థులందరిలో సమర్థవంతమైన రాజుగా పేరుగాంచాడు. ఇతను 1504లో ఆగ్రా దుర్గాన్ని నిర్మాణం చేశాడు. 1506లో రాజధానిని ఢిల్లీ నుండి ఆగ్రాకు తరలించి పరిపాలన కొనసాగించాడు. ఢిల్లీలో నిర్మించిన ఇతని సమాధి సమాధులలో కెల్లా గొప్పదిగా చెబుతారు.
➠ ఇబ్రహీం లోడి :
లోడీవంశాన్ని చివరగా పరిపాలించిన రాజు ఇబ్రహీం లోడి. యుద్దభూమిలో మరణించిన ఏకైన ఢిల్లీ సుల్తాన్‌గా పేరుగాంచాడు. 1526లో మొదటి పానిపట్లు యుద్దంలో బాబరు ఇబ్రహీం లోడిని అంతం చేసి మొగల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
0 Comments