ఢిల్లీ సుల్తానులు
Delhi Sultanate : Sayyid Dynasty in Telugu | Indian History in Telugu
ఢిల్లీ సుల్తానులు భారతదేశాన్ని 1206 నుండి 1526 సంవత్సరాల వరకు పరిపాలించారు. మహ్మద్‌ఘోరి మరణానంతరం 1206 సంవత్సరంలో కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సుమారు మూడు శతాబ్దాల కాలం పాటు ఢిల్లీ కేంద్రంగా బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి వంశాలు భారతదేశాన్ని పరిపాలించాయి. భారతదేశాన్ని పరిపాలించిన మొదటి ముస్లీం రాజవంశం.
క్రీ.శ.1206 నుండి 1526 వరకు ఢిల్లీని 5 రాజవంశాలు పరిపాలించాయి.
1) బానిస వంశం (1206-1290)
2) ఖిల్జీ వంశం (1290-1320)
3) తుగ్లక్ వంశం (1320-1414)
4) సయ్యద్ వంశం (1414-1451)
5) లోడీ వంశం (1451-1526)
సయ్యద్ వంశం (1414-1451)
తుగ్లక్ వంశం తర్వాత భారతదేశాన్ని సయ్యద్ వంశం పరిపాలించింది. వీరు 1414 నుండి 1451 వరకు సుల్తానత్ రాజ్యాన్ని పరిపాలించారు. సయ్యద్ వంశాన్ని ఖిజర్‌ఖాన్ స్థాపించాడు.
➠ ఖిజర్ ఖాన్ (1414-1421) :
ఖిజర్ ఖాన్ సయ్యద్ వంశాన్ని స్థాపించాడు. తాను ఢిల్లీని పరిపాలించినంత కాలం సుల్తాన్ అనే బిరుదు ధరించక, తైమూర్‌కు డబ్బు కానుకలను పంపాడు. ఖిజర్‌ఖాన్ అనంతరం అతని కుమారుడు ముబారక్ షా అధికారంలోకి వచ్చాడు. ఇతని కాలంలోనే గుజరాత్, మాళ్వా, జాన్‌పూర్ రాజ్యాలు స్వాతంత్రం ప్రకటించుకున్నాయి. ముబారక్ షా కులీనుల చేతిలో హత్యకు గురయ్యాడు.
➠ అల్లాఉద్దీన్ ఆలమ్‌షా :
ఇతను సయ్యద్ వంశాన్ని చివరగా పరిపాలించాడు. బహులాల్ లోడి ఇతడిని తొలగించి లోడీ వంశాన్ని స్థాపించాడు.
0 Comments