ఢిల్లీ సుల్తానులు
Delhi Sultanate : Tughlaq dynasty in Telugu | Indian History in Telugu
ఢిల్లీ సుల్తానులు భారతదేశాన్ని 1206 నుండి 1526 సంవత్సరాల వరకు పరిపాలించారు. మహ్మద్‌ఘోరి మరణానంతరం 1206 సంవత్సరంలో కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సుమారు మూడు శతాబ్దాల కాలం పాటు ఢిల్లీ కేంద్రంగా బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి వంశాలు భారతదేశాన్ని పరిపాలించాయి. భారతదేశాన్ని పరిపాలించిన మొదటి ముస్లీం రాజవంశం.
క్రీ.శ.1206 నుండి 1526 వరకు ఢిల్లీని 5 రాజవంశాలు పరిపాలించాయి.
1) బానిస వంశం (1206-1290)
2) ఖిల్జీ వంశం (1290-1320)
3) తుగ్లక్ వంశం (1320-1414)
4) సయ్యద్ వంశం (1414-1451)
5) లోడీ వంశం (1451-1526)
తుగ్లక్ వంశం (1320-1414)
భారతదేశంలో ఢిల్లీని ఎక్కువ కాలం పరిపాలించిన వంశం తుగ్లక్ వంశం. వీరు 1320 నుండి 1414 వరకు ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. తుగ్లక్ వంశం తురుష్కుల్లో కరోనా అనే తెగకు చెందినవారు.
➠ ఘియాసుద్దీన్ తుగ్లక్ (1320-1325) :
తుగ్లక్ వంశాన్ని స్థాపించిన వాడు ఘియాసుద్దీన్ తుగ్లక్. ఢిల్లీ సమీపంలో తుగ్లకాబాద్ అనే పట్టణాన్ని నిర్మించి రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఇతని కుమారుడైన జునాఖాన్ 1323లో వరంగల్‌పై దాడిచేసి ప్రతాపరుద్రుణ్ని ఓడించాడు. వరంగల్‌ను సుల్తాన్‌పూర్ అనే పేరుపెట్టి దానిని ఢిల్లీ రాజ్యంలో కలిపాడు. క్రి.శ1325లో కుమారుడు మహ్మద్ బిన్ తుగ్లక్ (జునాఖాన్) చేత హత్యగావింపబడ్డాడు.
➠ మహ్మద్‌బీన్ తుగ్లక్ (1325-1351) :
ఇతని అసలు పేరు జునాఖాన్. ఇతడు గొప్ప పండితునిగా పేరుగాంచాడు. ఢిల్లీ సుల్తానుల సార్వభౌమాధికారాన్ని దక్షిణపథంపై నెలకొల్పిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ మహ్మద్ బీన్ తుగ్లక్. మహ్మద్ బీన్ తుగ్లక్ గొప్ప పాండిత్యం సాధించినందువల్ల ఇతన్ని బరౌనీ ‘సృష్టి వైపరిత్యం’ అని శ్లాఘించాడు. 1327లో రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చాడు. దేవగిరికి దౌలతాబాద్ అని పేరు పెట్టాడు. బంగారు, వెండి నాణేల స్థానంలో రాగి నాణేలు ప్రవేశపెట్టాడు. ప్రజల సౌకర్యార్థం చిన్న నాణేలను చలామణిలోకి తెచ్చాడు. దీనార్ అనే కొత్త నాణేన్ని, అదాలీ అనే వెండి నాణేన్ని ప్రవేశపెట్టాడు. దివాన్-ఇ-కోహి అనే వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసి రైతులకు సోన్‌దార్ అను ఋణాలు ఇచ్చాడు. ఇతను తన విరుద్ద పాలన వల్ల ‘పిచ్చి తుగ్లక్’ గా పేరొందాడు. ఇతని కాలంలోనే దక్షిణాన విజయనగర సామ్రాజ్యం(1336) , బహమనీ సామ్రాజ్యం (1347) స్థాపించబడ్డాయి.
➠ ఫిరోజ్ షా తుగ్లక్ (1351-1388) :
మహ్మద్ బిన్ తుగ్లక్ మరణాంతరం అతడి సోదరుడు ఫిరోజ్‌షా తుగ్లక్ పరిపాలించాడు . ఇతనికి నాయక్ --ఇ-అమీర్-ఉల్-ఫిరోజ్ అనే బిరుదు కలదు. ఫతూహత్ -ఇ-ఫిరోజ్‌షాహీ అనే స్వీయచరిత్ర రాసుకున్న మొట్టమొదటి రాజు కీర్తి సాధించాడు. ఇతని కాలంలో పూరిలోని జగన్నాధాలయం, నాగర్‌కోట్‌లోని జ్వాలా ముఖి ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి. జిజియా పన్ను వసూలు చేశాడు. హిందువుల మేళాలపై ఆంక్షలు విధించాడు. విద్యావ్యాప్తి కొరకు మదర్సాలను ఏర్పాటు చేశాడు. ఢిల్లీ చుట్టు 1200 ఉద్యానవనాలు ఏర్పాటు చేశాడు. అందువల్ల ఇతనిని ఉద్యనవనాల రాజు అని పిలుస్తారు. ఇతని కాలంలో ఫిరోజాబాద్, జాన్‌పూర్, హిస్సార్, ఫతేబాద్ నగరాలు నిర్మించబడ్డాయి. తోటల పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చాడు. దివాన్-ఇ-ఖైరాత్ అనే ఒక దానధర్మాల శాఖను ఏర్పాటు చేసి పేదబాలికల వివాహలకు ఆర్థిక సహాయం చేశాడు. ఫిరోజ్‌షా కాలంలో పిడుగుపాటు వల్ల కుతుబ్‌మినార్‌లో 4వ అంతస్తులోని మినార్ ధ్వంసం అయ్యింది. ఇతడు 1388లో మరణించాడు.
➠ నాసిరుద్దీన్ మహ్మద్ (1394-1413) :
ఇతనికి నాసర్‌ఉద్దీన్ మహమూద్ అనే బిరుదు కలదు. ఇతడు తుగ్లక్ వంశంలో చివరిరాజు. తైమూర్ దండయాత్ర ఇతని కాలంలోనే జరిగింది. తైమూర్ దండయాత్ర వల్ల తుగ్లక్ వంశ ప్రతిష్ట అంతరించి ఢిల్లీ సామ్రాజ్య పతనం ప్రారంభమైంది.
0 Comments