Talikota Battle 1565 in Telugu | తళ్లికోట యుద్ధం (1565)

talikota war
 తళ్లికోట యుద్ధం (1565) – విజయనగర సామ్రాజ్య పతనం

➺ తళ్లికోట యుద్ధం (1565)  :

దక్కన్‌ సుల్తాన్‌లు అయిన అలీ ఆదిల్‌షా, హుస్సెన్‌ నిజాంషా,  ఇబ్రహీం కుతుబ్‌షా, అలీ బరీద్‌లు కూటమిగా ఏర్పడి క్రీ.శ 1565లో విజయనగర సామ్రాజ్యంపై దండెత్తారు. దీనికి తళ్లికోట లేదా రాక్షస తంగడి యుద్దం అని పేరు వచ్చింది. ఇందులో దక్కన్‌ సుల్తాన్‌ల చేతిలో విజయనగర రాజులు ఓటమిపాలయ్యారు. ఈ తళ్లికోట  యుద్దంలో రామరాయలు సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించాడు. ఎడమవైపున తిరుమల రాయలు, అలీ ఆదిల్‌ షాను ఎదుర్కొనేలా, మధ్యన రామరాయలు హుస్సెన్‌ నిజజాంషాతో పోరాడేలా, కుడివైపున వెంకటాద్రిరాయలు ఇబ్రహీం కుతుబ్‌షా, అలీ బరీద్‌లను ఎదుర్కొనే విధంగా యుద్దవ్యూహరచ చేశాడు. కానీ దక్కన్‌ సుల్తానులు ఆధునిక ఫిరంగులను ఉపయోగించడంతో విజయనగర సైనికులు వీటిని తట్టుకోలేకపోయారు. హుస్సెన్‌ నిజాం షా సైన్యం రామరాయలను బంధించి హుస్సెన్‌ నిజాం షా అతన్ని వధించాడు. దీంతో విజయనగర రాజ్యం చిన్నాభిన్నమైంది. ఈ యుద్దంలో వెంకటాద్రి రాయలు కూడా మరణించాడు. తిరుమల రాయలు, సదాశివ రాయలు యుద్దభూమి నుండి పారిపోయారు. 

Post a Comment

0 Comments