Navodaya Vidyalaya (JNVST) 6th Class Admission
నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న 665 జవహర్ నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా 6వ తరగతి లో సీట్లను భర్తీ చేయనున్నారు. జవహర్ నవోదయ విద్యాలయాలు దేశవ్యాప్తంగా 665 స్కూళ్లు ఉన్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో 15, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 ఉన్నాయి. నవోదయ విద్యాలయాల్లో కో-ఎడ్యుకేషన్ రెసిడెన్షియల్ స్కూళ్లు. కానీ బాలబాలికలకు విడివిడిగా హస్టల్ సదుపాయం ఉంటుంది. ఇందులో అడ్మిషన్ పొందిన వారికి ఉచితంగా వసతి, రుచికరమైన భోజనం, యూనిఫారమ్, పాఠ్యపుస్తకాలు ఇస్తారు. ఒక్కసారి ఇందులో అడ్మిషన్ సాధిస్తే ఇంటర్మిడియట్ వరకు నాణ్యమైన ఉచిత విద్య లభిస్తుంది.
| Navodaya Vidyalaya (JNVST) Class 6 Admission 2027 -28 Notification Details | |
|---|---|
| సంస్థ పేరు | జవహర్ నవోదయ విద్యాలయ సమితి (Navodaya Vidyalaya Samiti) |
| పాఠశాల పేరు | జవహర్ నవోదయ విద్యాలయాలు (JNVs) |
| అడ్మిషన్ | 6వ తరగతి (Class VI) |
| విద్యార్హత | 2026-27 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు |
| వయస్సు | 01-05-2015 నుండి 31-07-2017 మధ్య జన్మించి ఉండాలి. |
| మొత్తం నవోదయ పాఠశాలలు | దేశవ్యాప్తంగా 665 |
| తెలంగాణలో | 15 నవోదయ పాఠశాలలు |
| ఆంధ్రప్రదేశ్‌లో | 15 నవోదయ పాఠశాలలు |
| వసతి సౌకర్యం | పూర్తిగా రెసిడెన్షియల్ స్కూల్, బాలురు మరియు బాలికలకు ప్రత్యేక హాస్టల్ సదుపాయం |
| ఉచిత సౌకర్యాలు | వసతి, భోజనం, యూనిఫారం, పాఠ్యపుస్తకాలు, నాణ్యమైన విద్య |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
| ఎంపిక విధానం | JNV Selection Test (JNVST) |
| పరీక్షా విధానం |
|
| దరఖాస్తుల చివరి తేదీ | 27-07-2026 |
| పరీక్ష తేదీ | 28-11-2026 |
| Online Apply | Click Here |
0 Comments