Gk in Telugu || General Knowledge in Telugu
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కేంద్ర ప్రభుత్వం భరోసా
ఇవ్వనుంది. ఈ-శ్రమ్ పథకం ద్వారా సమాజిక భద్రత కల్పించనుంది. అనేకమంది
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కూలీలకు ఎలాంటి సామాజిక భద్రత లేకపోవడంతో
చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారికి గుర్తింపు
తీసుకొచ్చి వారి వివరాలను భద్రపర్చడంతో పాటు భీమా సౌకర్యం కల్పించేందుకు
నిర్ణయించింది. దీనికోసం ఈ-శ్రమ్ పథకాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం
12 అంకెల యూనిక్ నంబర్‌ను కేటాయించనుంది. దీనికోసం కామన్ సర్వీసు
కేంద్రాల్లో (సీఎస్‌సి) పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకంలో
చేరడానికి ఆదాయపు పన్ను పరిమితికి లోపు ఉన్న వారే అర్హులు. చేనేత, భవన
నిర్మాణ, ఇటుక బట్టీలు, క్వారీలు, మిల్లులు, ఉపాధి కూలీలు, ఆశా, అంగన్‌వాడీ
వర్కర్‌లు, రిక్షా, వ్యవసాయ కూలీలు, ఆటో డ్రైవర్లు, బీడి కార్మికులు,
కూరగాయాల వ్యాపారులు, పండ్ల విక్రేతలతో పాటు ఇతర రంగాల్లో పనిచేసే దినసరి
కూలీలకు ఈ-శ్రమ్ పథకం వర్తిస్తుంది. నమోదు చేసుకున్న కూలీలు ప్రమాదవశాత్తు
మృతి చెందితే రూ॥2 లక్షలు, అంగవైకల్యం పొందితే రూ॥1 లక్ష భీమా
వర్తిస్తుంది.
1) ఈ-శ్రమ్ పథకంలో చేరే ప్రతి అసంఘటిత కార్మికుడికి 12 అంకెలు గల గుర్తింపు (యు.ఎ.ఎన్) మంజూరు చేస్తారు.
2) ఈ కార్డు ద్వారా అన్ని సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు వర్తింపజేస్తారు.
3) నమోదు చేసుకున్న కార్మికుడికి ఏడాది పాటు ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన ద్వారా రూ॥2 లక్షల ప్రమాద మరణ, అంగవైకల్య భీమా ఉచితంగా కల్పిస్తారు.
4) అసంఘటిత రంగ కార్మికులకు అమలు చేసే పథకాలు, విధానాలను ఈ డేటాబేస్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు.
5) వలస కార్మికులు ఎక్కడ ఉన్నారో గుర్తించి వారికి ఉపాధి కల్పించేందుకు పరిశీలిస్తారు.
1) వ్యవసాయ కూలీలు, అనుబంధ రంగంలో పనిచేయాలి.
2) చిన్న, సన్నకారు రైతులు, ఉమ్మడి వ్యవసాయదారులు, మత్య్సకారులు, ఉద్యానవనాల్లో పనిచేసేవారు.
3) భవన నిర్మాణ, దాని అనుబంధ రంగాల్లో పనిచేసే కూలీలు
4) బావులు తవ్వడం, పూడిక తీసే కూలీలు.
5) వీధి వ్యాపారులు, దుకాణాల్లో పనిచేస్తే గుమాస్తాలు, చిరు తోపుడు బండ్ల వ్యాపారులు, వండ్రంగి, ఎలక్ట్రీషియన్‌లు
- రోజు కూలీ
- వ్యవసాయ కూలీలు
- భవన నిర్మాణం కార్మికులు
- పవర్‌లూం కార్మికులు
- వార్పిన్ కార్మికులు
- వైపనీ కార్మికులు
- తోపుడు బండ్ల వ్యాపారులు
- వండ్రంగి
- ఎలక్ట్రిషియన్
- ఉపాధి హామి కార్మికులు
- టేలర్
- హామాలి కార్మికులు
- ఫోటో గ్రాపర్స్
- మెకానిక్
- ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ కార్మికులు
- బిజినెస్
- పౌల్ట్రి
- బార్బర్
- మేస్త్రీ
- అడ్డాకూలీలు
- వెల్డింగ్
- సైకిల్ టెక్స్
- బంగారం వర్క్స్
- ప్లాస్టిక్ మేకింగ్
- ప్లంబర్
- పేయింటర్స్
- ప్రైవేటు టీచర్స్
- బేకరి వర్కర్స్
- పాల ఉత్పత్తి
- చేనేత వృత్తి
- అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు
- మెడికల్ షాపు
- ఫిజియోథెరపీ అసిస్టెంట్
- ఆటోడ్రైవర్స్
- సేల్స్ పర్సన్స్
- వీధివిక్రయ దారులు
- క్లీనర్స్
- సెక్యూరిటీ గార్డులు
- సోషల్ వర్కర్స్
- లాండ్రీ షాపు
- ట్రావెల్ గైడ్
- వేయిటర్స్
- వడ్రంగి
- లారీ, కారు డ్రైవర్స్
- బ్యూటిషియన్
- కార్‌పేయింటర్స్
- పాలఉత్పత్తిదారులు
- గుమాస్తాలు
- నర్సరీ కార్మికులు
- బండ కొట్టేవారు
- మెకానిక్స్
- బ్యాండ్ వర్కర్స్
- డైయింగ్ కార్మికులు
- రైతులు
- మత్య్స కారులు
- కల్లుగీత కార్మికులు
- వలస కార్మికులు
- రిక్షా కార్మికులు
- స్వయం ఉపాధి కార్మికులు
1) 16 నుండి 59 సంవత్సరాల వయస్సు లోపు ఉండాలి
2) ఆదాయపు పన్ను చెల్లించని వారు.
3) ఈపీఎఫ్, ఈఎస్‌ఐ పరిధిలోకి రానివారు.
4) అసంఘటిత రంగ కార్మిక కేటగిరిలో తప్పనిసరిగా పనిచేయాలి.
0 Comments