తెలుగు వ్యాకరణం

 తెలుగు వ్యాకరణం 

ధ్వని అనే మాటకు చప్పుడు, శబ్దం అని అర్థం. భాషా విషయంలో మాత్రం ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థం వస్తుంది. 
భాషాధ్దవనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల లేదా అక్షరమాల అంటారు. 


అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఎ, ఏ, ఐ, ఓ, ఔ, అం, అ: 

అనే అక్షరాలు అచ్చులు అంటారు 

 క, ఖ, గ, ఘ, చ, ఛ, జ, ఝ ఞ, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, ఱ

హల్లులు అంటారు 

అక్షరమాలలో ఎల్లా ఉన్నా హల్లు అనేది పొల్లుగా పలికే ధ్వని. 'మ్‌''' అనే ధ్వనులు కలిసి మ అయింది. మొదటిది హల్లు, రెండోది అచ్చు 
కొన్ని అక్షరాల్లో రెండేసి గాని, మూడేసి గాని హల్లులు కలిసి ఉండవచ్చు. ఇది మూడు రకాలు
 1. ద్విత్వాక్షఱం 2. సంయుక్తాక్షరం 3. సంశ్లేషాక్షరం 
➪ ద్విత్వాక్షరం 
ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని '' ద్విత్వాక్షరం ''అంటారు. 
ఉదా. 'క్క' = క్‌ + ్క (క్‌) + అ = క్క - ఒక్కడ కకారం రెండుసార్లు వచ్చింది. 
➪  సంయుక్తాక్షరం 
ఒక హల్లుకు వేరోక హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని ''సంయుక్తాక్షరం ''అంటారు 
ఉదా. 'న్య' = న్‌ + య్‌ + అ - ఇక్కడ నకార, యకారాలనే రెండు హల్లులు ఉన్నాయి. 
 సంశ్లేషాక్షరం 
ఒక హల్లుకు ఒకటికంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే దాన్ని ''సంశ్లేషాక్షరం'' అంటారు 
ఉదా.' క్ష్మి '= క్‌ + ష్‌ + మ్‌ + ఇ క్కడ కకార, షకార, మకారాలనే హల్లులు మూడు కలిసాయి. 


తెలుగు భాషలో వర్ణాలను మూడు విధాలుగా విభజించడం జరిగింది 

1) అచ్చులు 2) హల్లులు 3) ఉభయాక్షరాలు 

➪ అచ్చులు 

అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ 

ఈ అచ్చులు హ్రస్వాలు, దీర్ఘాలు అని రెండు విధాలుగా ఉంటాయి. 

అ) హ్రస్వాలు
 : 
ఒక మాత్రకాలంలో ఉచ్చరించే అచ్చులను ''హ్రస్వాలు'' అంటారు. 
అవి అ, ఇ, ఉ, ఋ, ఎ, ఒ, 

ఆ) దీర్ఘాలు
 
రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అచ్చులను ''దీర్ఘాలు'' అంటారు

ఆ, ఈ, ఊ, ౠ, ఏ, ఐ, ఓ, ఔ  

 హల్లులు 

క, ఖ, గ, ఘ, చ, ఛ, జ, ఝ, ఞ, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, ఱ
 
ఉచ్చారణ విధానాన్ని బట్టి హల్లులను ఈ కింది రకాలు విభజించారు. 

అ) క, చ, ట, త, ప ⟷ పరుషాలు 

ఆ) గ,జ, డ, ద, బ 
 సరళాలు 
వీటిని అల్పప్రాణాలు అని కూడా అంటారు. 
ఇ) ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ, లు 
 మహా ప్రాణాలు, వర్గయుక్కులు అని అంటారు. 
ఈ) జ, ఞ, ణ, న, మ  అనునాసికాలు 
ఉ) య, ర, ల, వ  అంతస్థాలు 
ఊ) శ, ష, స, హ  ఊష్మాలు 

 ఉభయాక్షరాలు 
మూడు. అవి సున్న '0' (పూర్ణ బిందువు), అరసున్న, విసర్త ':' ఈ మూడింటిని అచ్చులతోను, హల్లులతోను ఉపయోగించడం వల్ల ఉభయాక్షరాలు అని అంటారు. 





Post a Comment

0 Comments