
తెలంగాణ శీతోష్ణస్థితి
telangana Climate in telugu,
Gk in Telugu || General Knowledge in Telugu
➢ వాతావరణం :
భూమిని ఆవరించి ఉన్న వాయుపొరను వాతావరణం(అట్మాస్పియర్) అంటారు. ఈ వాయుపొర ఘన, ద్రవ, వాయు పదార్థాల మిశ్రమంతో కలిసి ఉంటుంది. వాతావరణం అనేది ఉష్ణోగ్రత, పీడనం, పవనాలు, అవపాతం వంటి లక్షణాలను కల్గి ఉంటుంది.
భారతదేశం రెండు రకాల శీతోష్ణస్థితి మండలాలను కల్గి ఉంది. 1) సమశీతోష్ణ మండలం 2) ఉష్ణమండలం. తెలంగాణ రాష్ట్రం భారత దక్షిణ ప్రాంతంలో ఉండడం వల్ల ఇక్కడ ఉష్ణమండల/ఆయనరేఖ శీతోష్ణస్థితి ఉంటుంది. తెలంగాణ ప్రాంతం ఉష్టమండలంలో ఉండడం వల్ల ఇక్కడ అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షాపాతాలు ఉండాలి. కానీ పశ్చిమ కనుమల వర్షాచ్చాయ ప్రాంతం, ఖండాతర్గత శీతోష్ణస్థితి, సముద్ర మట్టం నుండి ఎత్తులో ఉండడం వంటి అంశాలు తెలంగాణ శీతోష్ణస్థితిని ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ కనుమలు (వెస్ట్రర్న్ ఘాట్స్) తెలంగాణ శీతోష్ణస్థితిని ప్రభావితం చేస్తాయి. పశ్చిమ కనుమలు నైఋతి ఋతుపవనాలను అడ్డుకోవడం వల్ల ఈ ప్రాంతం వర్షాచ్చాయ ప్రాంతంలో ఉంది. అందువల్ల ఇక్కడ వేడి, తడి గా కాకుండా వేడి, పొడిగా ఉంటుంది. సముద్రం నుండి తెలంగాణ దూరంగా ఉండడం వల్ల ఇక్కడ ఖండాతర్గత శీతోస్థితి కల్గి ఉంటుంది. దీని వల్ల ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ఎండాకాలంలో అధిక వేడి వాతావరణం, చలికాలంలో అత్యంత చలిగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని పశ్చిమ భాగంలో ఉన్న ప్రాంతాలు ఎత్తులో ఉండడం ఇక్కడ వేసవి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతుంటాయి.
➢ థార్న్ వెయిట్ శీతోష్ణస్థితి మండలాలు :
థార్న్ వెయిట్ ప్రకారం తెలంగాణలో రెండు రకాల శీతోష్ణస్థితులు ఉన్నాయి. 1) శుష్క శీతోష్ణస్థితి 2) ఉప శుష్క శీతోష్ణస్థితి
1) శుష్క శీతోష్ణస్థితి
అతి తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాలను శుష్క శీతోష్ణస్థితి అంటారు. ఇక్కడ 30 సెంటీమీటర్ల నుండి 50 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు అవుతుంది. ఈ ప్రాంతాలలో ఎడారి లాంటి వాతావరణం కనిపిస్తుంది.
2) ఉప శుష్క శీతోష్ణస్థితి
దీనినే స్టెప్పి (యురేషియా కనబడే సమశీతోష్ణ గడ్డి మైదానాలు) రకం శీతోష్ణస్థితి అంటారు. దీని వల్ల ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు, అధిక చలి ఉంటుంది. ఇక్కడ కూడా తక్కువ వర్షపాతం ఉంటుంది.
➢ కొప్పెన్ శీతోష్ణస్థితి మండలాలు :
కొప్పెన్ ప్రకారం తెలంగాణ లో రెండు రకాల శీతోష్ణస్థితులు ఉన్నాయి. 1) శుష్క స్టెప్పి శీతోష్ణస్థితి 2) ఉష్ణమండల సవన్నా (ఉష్ణమండల పచ్చిక బయల్లు ఇవి ఎక్కువ ఆఫ్రికాలో కనిపిస్తాయి) శీతోష్ణస్థితి
భారత సగటు ఉష్ణోగ్రత 30 డిగ్రీలు ఉంటుంది. దక్షిణ, తూర్పు తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. ఉత్తర తెలంగాణలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. పశ్చిమ దిశ నుండి తూర్పు దిశకు వెళ్లే కొలది ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే పశ్చిమ ప్రాంతంలో 40 నుండి 50 సెల్సియస్ ఉష్ణోగ్రత తక్కువగా నమోదు అవుతుంది. తెలంగాణలో వేసవి సగటు ఉష్ణోగ్రత 420 సెల్సియస్ గా ఉంది. శీతాకాలంలో 220 సెల్సియస్ నమోదు అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి.
తెలంగాణలో సగటు వర్షాపాతం 90.5 సెంటీమీటర్లు గా ఉంది. ఇందులో 80 శాతం నైఋతి ఋతుపవనాలతో కురుస్తాయి. తెలంగాణలో దక్షిణం నుండి ఉత్తరానికి వెళ్లే కొలది వర్షపాతం ఎక్కువ అవుతుంది. ములుగు జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు అవుతుంది. తర్వాత భద్రాద్రి, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. జోగులాంబ, నాగర్‌కర్నూల్ జిల్లాలలో అత్యల్ప వర్షపాతం నమోదు అవుతుంది.
➢ తెలంగాణలో ఋతుపవనాల కాలం :
1) నైరుతి ఋతుపవనాల కాలం
జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది.
2) ఈశాన్య ఋతుపవనాలు
అక్టోబర్ నుండి నవంబర్ వరకు ఉంటుంది
3) శీతాకాలం
డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. ఈ కాలంలో సంగారెడ్డి, రామగుండంలలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అవుతుంది.
4) వేసవి కాలం
మార్చి నుండి మే వరకు ఉంటుంది. ఈ కాలంలో ఉరుములు, మెరుపులతో కూడిన సంవహన వర్షం పడుతుంది. వీటినే తెలంగాణలో తొలకరి జల్లులు (మ్యాంగో షవర్స్) అని పిలుస్తుంటారు.
0 Comments