Tspsc Telangana History : Satavahana Dynasty in Telugu || శాతవాహన సామ్రాజ్యం || gk in telugu

Telangana History : Satavahana Dynasty in Telugu ||  శాతవాహన సామ్రాజ్యం

Satavahana dynasty kings in Telugu
Satavahana Dynasty - History, Major Rulers, Economy and in Telugu

Gk in Telugu || General Knowledge in Telugu

Tspsc Telangana History in Telugu

శాతవాహన సామ్రాజ్యం

Tspsc Telangana History in telugu : దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సామ్రజ్యం శాతవాహుల సామ్రాజ్యం. అలాగే భారతదేశంలో మొట్టమొదటి సామ్రాజ్యం మగధ సామ్రాజ్యం.  మౌర్య సామ్రాజ్యం పతనం తర్వాత దక్షిణ భారతదేశంలో గోదావరి, కృష్ణ నదుల మద్య శాతవాహనులు సువిశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని దాదాపు 30 మంది రాజులతో సుమారు 456 సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించినారు. శాతవహన సామ్రాజ్యం క్రీ.పూ 231 నుండి క్రీ.శ 225 వరకు కొనసాగినట్లు చరిత్రకారులు చెబుతారు. శాతవాహన సామ్రాజ్యం గోదావరి, కృష్ణ నదులు  పరివాహక ప్రాంతాలలో అత్యధికంగా విస్తరించి ఉంది. శాతవాహనుల మూల పురుషుడు శాతవాహనుడు. శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు. శ్రీముఖుడు దక్కన్‌ ప్రాంతంలో శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. శ్రీముఖుడు శాతవాహన రాజ్యస్థాపకుడు అని మత్య్స పురాణం ద్వారా తెలుస్తుంది. ఆర్‌.జి భండర్కర్‌ అనే చరిత్రకారుడు శాతవాహనులు మౌర్యులకు సామంతులని పేర్కొనడం జరిగింది. మెగస్తనీస్‌ ఇండికా గ్రంథంలో ఆంధ్రులకు 30 దుర్గాలు వంటి బలమైన శక్తివంతమైన సైన్యం ఉందని తెలియజేయడం జరిగింది. ఇదే విషయాన్ని ‘‘ ప్లిని ’’ పేర్కొన్నాడు. శాతవాహనుల చివరి రాజు 3వ పులోమావి. ఇతని గురించి మ్యాకదోని అనే శాసనంలో పేర్కొనడం జరిగింది. 

శాతవాహనుల పరిపాలించిన కాలాన్ని రెండు విధాలుగా పిలుస్తారు. 

1) తొలి శాతవాహనులు 

1వ రాజు నుండి 23వ రాజు (గౌతమి పుత్ర శాతకర్ణి) పరిపాలించిన వారిని తొలి శాతవాహనులు అని పిలుస్తారు. 

2) మలి శాతవాహనులు 

24వ రాజు (2వ పులోమావి) నుండి 30వ రాజు పరిపాలించిన వారిని మలి శాతవాహనులు అని పిలుస్తారు. 

➦ శాతవాహన సామ్రాజ్యం సరిహద్దులు :

శాతవాహన సామ్రాజ్యం ఉత్తరాన మద్యప్రదేశ్‌లోని సాంచి నుండి దక్షిణాన కర్ణాటక లోని బళ్లారి వరకు విస్తరించి ఉండేది. తూర్పున ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు లోని ధాన్యకటకం(అమరావతి) నుండి పశ్చిమాన మహరాష్ట్రలోని కనిహేరి వరకు విస్తరించి ఉండేది. 

➦ దేశీయ రచనలు :

వాయుపురాణం, భాగవత పురాణం, విష్ణు పురాణాలు శాతవాహనులతో నివసించిన వంశాల/జాతులు గురించి తెలియజేస్తుంది. శాతవాహనులతో పుండ్ర, పులింద, శబరి, గుహది వంటి జాతులు సమకాలీలుగా పేర్కొనడం జరిగింది. వీరు తూర్పు భాగంలో నివసించినారు. 

➦ శాతవాహన రాజధానులు :

శాతవాహనుల రాజదానులపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శాతవాహనులు 3 ప్రాంతాలను రాజధానులుగా చేసుకొని పరిపాలించారు. శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల (మునులగుట్ట) (తెలంగాణలోని పాత కరీంనగర్‌, ప్రస్తుత జగిత్యాల జిల్లాలో ఉంది) తర్వాత మహారాష్ట్ర లోని ప్రతిష్టానపురం (ప్రస్తుతం పైథాన్‌) రాజధాని చేసుకొని ఎక్కువ కాలం పాలించారు. ఆ తర్వాత ధాన్యకటకం/ధరణికోట (ప్రస్తుతం అమరావతి) కి మార్చినట్లు చరిత్రకారులు చెబుతారు. కోటిలింగాల మరియు ప్రతిష్టానపురం రాజధానులు గోదావరి నదీ పరివాహక ప్రాంతాలలో ఉండేవి. ధాన్యకటకం కృష్ణనది తీరాన ఉండేది. 

➦ రాజధానులపై భిన్నాభిప్రాయాలు :

వి.వి మిరాశి (వాసుదేవ్‌ విష్ణు మిరాశి), పి.టి శ్రీనివాస అయ్యంగార్‌, డి.పి రాయ్‌ చౌందర్‌ అను పండితులు శాతవాహనుల తొలిరాజధాని ప్రతిష్టానుపురం అని తర్వాత ధాన్యకటకానికి మార్చడం జరిగిందని అభిప్రాయపడ్డారు.  

➦ శాతవాహనుల ముఖ్య శాసనాలు :

➙ నానాఘట్‌ శాసనం  -

ఇందులో శాతవాహన రాజ్యం యొక్క సామాజిక పరిస్థితులు, 1వ శాతకర్ణి యుద్దవిద్యలు, బిరుదులు, రాజ్యస్థాపన గురించి తెలియజేస్తుంది. 

➙ నాసిక్‌ శాసనం -

దీనిని గౌతమి భారతి ప్రాకృతం భాషలో లిఖించడం జరిగింది. ఇందులో గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క వ్యక్తిగత సమాచారం, అతని బిరుదులు, యుద్దాలు, రాజ్యవ్యాప్తి గురించి తెలియజేస్తుంది. 

➙ గాధ సప్తశతి శాసనం -

దీనికి హలుడు (17వ రాజు) లిఖించడం జరిగింది. ఇందులో 700 కథల రూపంలో సామాజిక పరిస్థితులు, వర్తకం, దేవుళ్ల గురించి తెలియజేయడం జరిగింది. 

Tspsc Telangana History :

➠ శ్రీముఖుడు :-

శ్రీముఖుడు శాతవాహన వంశస్థాపకుడు. ఇతను మౌర్యులకు సామంతులుగా చెప్పుకున్నాడు. ఇతను ధనకాడ / ధరణికోట / అమరావతిని నిర్మించాడు. నానాఘడ్‌ శాసనంలో శ్రీముఖిని చిత్రం కనిపిస్తుంది. ఇతని నాణేలు కరీంనగర్‌ (ప్రస్తుతం జగిత్యాల) లోని కోటి లింగాలలో లభించాయి. ఈ నాణేలపై శ్రీముఖుని పేరు చిముఖగా లిఖించడం జరిగింది. శ్రీముఖుని తర్వాత అతని సోదరుడు కన్హుడు/కృష్ణుడు పరిపాలించాడు. 

➠ కన్హుడు / కృష్ణుడు :-

కృష్ణుడు తొలిసారిగా శాసనాలు ముద్రించాడు. నాసిక్‌ గుహ శాసనం బౌద్ధ బిక్షువుల కోసం అంకితం చేశాడు. ఇతను మహమాత్రను నాసిక్‌ ప్రాంతానికి అధికారిగా నియమించాడు. కృష్ణుడు తర్వాత మొదటి శాతకర్ణి శాతవాహన రాజ్యాన్ని పరిపాలించాడు. 

➠ 1వ శాతకర్ణి :-

1వ శాతకర్ణి విజయాలు ఇతని భార్య నాగనిక వేయించిన నానాఘట్‌ శాసనాలలో పేర్కొనబడినవి. ఇతను దక్షిణ భారతదేశం జయించి అశ్వమేధయాగం, రాజసూయ యాగాన్ని జరిపి సామ్రాట్‌ దక్షిణాధిపతి అనే బిరుదులు పొందాడు. ఇతని కాలంలో యజ్ఞ్‌కర్మలు, వైదిక ధర్మాలు, గోదానాలు తిరిగి ప్రారంభమైనాయి. ఇతని నాణేలు మద్యప్రదేశ్‌, మహరాష్ట్ర తెలంగాణాలలో లభించాయి. 

➠ 2వ శాతకర్ణి :-

2వ శాతకర్ణి 56 సంవత్సరాల పాటు పరిపాలించడం జరిగింది. శాతవాహన రాజులలో అత్యధిక కాలం పరిపాలించిన వ్యక్తిగా ఇతను గుర్తింపు పొందాడు. 2వ శాతకర్ణి ఉత్తర భారతదేశంపై దాడి చేసిన మొదటి శాతవాహన / దక్షిణ రాజుగా చరిత్రలో నిలిచాడు. 2వ శాతకర్ణి ఉత్తర భారతదేశంపై దాడి చేసినట్లు బిల్సా శాసనం ద్వారా తెలుస్తుంది. ఈ బిల్సా శాసన ద్వారా శుంగరాజ్యంపై దాడి చేసి శకులు రాజును ఓడించి  విదిశ ప్రాంతాన్ని ఆక్రమించినట్లు తెలుస్తుంది. 2వ శాతకర్ణి యొక్క నాణేలు మహారాష్ట్ర, మాళ్వ ప్రాంతంలో లభ్యమైనాయి. భారతదేశంలో అతిపెద్ద బౌద్దమత స్థూపమైన సాంచీ స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించాడు. ఈ విషయం 2వ శాతకర్ణి ఆస్థాన ఉద్యోగి / కళాకారుడు అయిన ఆనందవర్ధనడు లిఖించిన శాసనం ద్వారా తెలుస్తుంది. ఇతను పుశ్యమిత్ర శుంగుడికి, కళింగ రాజు ఖారవేలునికి, గ్రీక్‌ బాక్రియస్‌ రాజు డెమిట్రీయస్‌కు సమకాలికుడు. 

రెండవ శాతకర్ణి తర్వాత శాతవాహన రాజ్యాన్ని లంబోధరుడు, అపిలకుడు, మేఘస్వాతి, మృగేంద్రుడు అనే రాజులు పరిపాలించారు. ఇందులో మృగేంద్రుడిని యేసుక్రీస్తు సమకాలీనుడిగా పేర్కొంటారు. 

Tspsc Telangana History : 

➠ కుంతల శాతకర్ణి :-

కుంతల శాతకర్ణి శాతవాహన రాజులలో 13వ రాజు.  ఇతనికి మేఘస్వామి, స్వాతి, కందస్వామి, మృగేంద్ర వంటి మరికొన్ని బిరుదులు ఉన్నాయి. రాజశేఖరుడు రచించిన కావ్యమీమాంస ఇతని గురించి తెలియజేస్తుంది. వాత్సాయనుడి రచించిన కామసూత్ర కుంతల శాతకర్ణిని అత్యంత విరాస పురుషుడిగా పేర్కొంటున్నది. కామసూత్ర కుంతల శాతకర్ణి కఠిర్త అనే ప్రత్యేక కామసంబంధ ప్రక్రియ ద్వారా తన భార్య మలయవతి మరణానికి కారకుడయ్యాడంటూ పేర్కొంది.

కుంతల శాతకర్ణి శాతవాహనుల రాజులలో విశేష కీర్తి చూరగొన్నాడు. ఇతనికి విక్రమార్క అనే బిరుదు కలదు. ఇతని రాజ్యంలో గుణాడ్యుడు, శర్వవర్మ అనే ఇద్దరు ఆస్తాన కవులు ఉండేవారు. శర్వవర్మ ‘‘కాతంత్ర వ్యాకరణం ’’ అనే గ్రంథం రచించినాడు. ఇది సులభంగా సాంసృత భాషను నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది.  ఇతని కాలంలో సాంసృత భాష సాహిత్య అభివృద్ది చెందింది. అందువల్ల  ఇతని కాలాన్ని సంసృతానికి స్వర్ణయుగంగా పేర్కొంటారు. గుణాడ్యుడు బృహత్కథ / హస్యకథల సంపుటి అనే పుస్తకాన్ని పైశాచిక భాషలో రచించాడు. ఈ పుస్తకంలో తొలిసారిగా తెలంగాణ మాండలికం ఉపయోగించినారు. అందువల్ల గుణాడ్యుడు తొలి తెలంగాణ కవిగా పేరుగాంచారు. ఈ పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని పంచతంత్ర కథలు (రచయిత-విష్ణుశర్మ), బృహత్కథ మంజరి (రచయిత-క్షేమేంద్రుడు), బుద్దకథాశ్లోకం (రచయిత-బుద్దస్వామి) రచించారు.  కుంతల శాతకర్ణి పరిపాలించిన కాలాన్ని స్వర్ణయుగంగా అభివర్ణిస్తారు. ఇతని కాలంలో సాంస్కృత భాష అభివృద్ది చెందింది. కుంతల శాతకర్ణి తర్వాత శాతవాహనుల రాజ్యాన్ని స్వాతికర్ణి పరిపాలించినాడు.

➠ 1వ పులోమావి :-

1వ పులోమావి శాతవాహనుల 17వ రాజు. ఇతడు కన్వ వంశానికి చెందిన రాజు. ఈ విషయం వాయుపురాణం ద్వారా తెలుస్తుంది. ఇతను సుశర్మ ను ఓడించి మగధ అనే రాజ్యాన్ని ఆక్రమించుకుని 10 సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించినాడు. ఇతని యొక్క నాణేలు పాటలీపుత్రం(పాటలీపుత్ర నగర నిర్మాతగా అజాత శత్రువుగా పేర్కొనడం జరుగుతుంది. ఇది సోన్‌ నది ఒడ్డున కలదు)  దగ్గరలోని కుహరమ అనే ప్రాంతం వద్ద లభ్యమైనాయి. 1వ పులోమావి తర్వాత హలుడు శాతవాహన రాజ్యాన్ని పరిపాలించినాడు. 

హలుడు :-

హలుగు శాతవాహన రాజ్యాన్ని పరిపాలించిన 17వ రాజుగా గుర్తింపు పొందాడు. ఇతనికి కవిరాజు, కవి వత్సలుడు అనే బిరుదులు కలవు. ఇతను శప్తాసి, అభిదానచింతామణి, గాదాసప్తశతి అనే రచనలు చేసినాడు. ఈ పుస్తకంలో తెలుగు మాండలికాలు ఉపయోగించబడ్దాయి. గాథాసప్తశతి 700 కథల రూపంలో సామాజిక పరిస్థితులు, వర్తకం, దేవుళ్ల గురించి మిళితమై ఉంది. ఇది జయవల్లభుడు రచించిన జైన గ్రంథము వజ్జలగ్గను పోలి ఉండేదని పేర్కొంటారు. ఇతని కాలంలో ప్రాకృత భాష సాహిత్యం విసృతంగా అభివృద్ది చెందింది. ప్రాకృత భాష అభివృద్ది చెందినందున ఇతని కాలాన్ని స్వర్ణ యుగంగా పేర్కొంటారు. సేనాని అయిన విజయనాథుడు గాథాసప్తశతిలో హలుని యొక్క విజయాలను అభివర్ణించాడు.

Tspsc Telangana History :

➠ శివస్వాతి :-

శివస్వాతి కాలంలో శైవమతం వెలుగులోకి వచ్చింది. శైవమతం యొక్క స్థాపకుడు లకులీశుడు. శైవమతం క్రీ.పూ 2 వ శతాబ్దంలో గుజరాత్‌ రాష్ట్రంలో అభివర్ణించారు. శివస్వాతి యొక్క కుమారుడు గౌతమిపుత్ర శాతకర్ణి. 

➠ గౌతమీపుత్ర శాతకర్ణి :-

గౌతమీపుత్ర శాతకర్ణి శాతవాహనుల రాజ్యాన్ని పరిపాలించిన 23వ రాజు. శివస్వాతి - గౌతమి బాలశ్రీ ఇతని తల్లిదండ్రులు. గౌతమి బాలశ్రీ నాసిక్‌ శాసనాన్ని లిఖించడం జరిగింది. ఈ శాసనంలో గౌతమి బాలశ్రీ యొక్క బిరుదు రాజర్షివధు అని పేర్కొనడం జరిగింది. ఇతను 24 సంవత్సరాలు పరిపాలన కొనసాగించినాడు. గౌతమీపుత్ర శాతకర్ణికి క్షత్రియ దర్పమాన వర్ధన, వర్ణసౌంకర్య నిరోధక, ఆగమనిలయ, విధివర్తిత, ధనుర్ధాయ, త్రిసముద్రత్రోయ సీతవాహన, శకయవన పహ్లావంశ నిరవశేషకర, చేనాటకస్వామి, క్షాత్రప / క్షహరాట వంశ నిర్మూలక, ద్విజకులవర్ధన, ఏకశూర, ఏకబ్రహ్మణ అనే బిరుదుల ఉన్నాయి. గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క సేనాని శివసేనుడు. ఇతని సమకాలీనుడుగా విదేశీ యాత్రికుడు టాలమి గుర్తింపు పొందాడు. క్రీ.శ 78 సంవత్సరంలో శకయుగమును ప్రారంభించినాడు. దీనినే శాలివాహన యుగంగా పేర్కొంటారు. దీనిని 1957 సంవత్సరంలో భారతదేశం గుర్తించింది. గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో ఉత్తరాన రాజస్థాన్‌లోని పుష్కర్‌ వరకు, దక్షిణాన తమిళనాడులోని బనవాసి, పశ్చిమాన ఆరేబియా/వైజయంతి, తూర్పున కళింగ / బంగాళఖాతం వరకు విస్తరించింది. 

గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో జోగల్‌తంబి / గోవర్దనహర యుద్దం జరిగింది. ఇది గౌతమీపుత్ర శాతకర్ణి మరియు నహపాణుడు మద్య జరిగింది. ఇట్టి యుద్దంలో నహపాణుడు ఓడిపోవడం జరిగింది.  యుద్దం తర్వాత నహపాణుడు వద్ద నుండి 13,200 జోగల్‌ తండి నాణేలు అనే పేరు గల వెండి నాణేలు పొంది శాతకర్ణి పేరుమీద పునర్‌ముద్రితం చేసుకున్నాడు. ఈ విషయాన్ని జునాఘడ్‌ శాసనంలో పేర్కొనడం జరిగింది.   గౌతమీపుత్ర శాతకర్ణి అశ్రుక, నీలగిరి, అపరాంతం, బనరాసి, సౌరాష్ట్ర, ములక, అనూప, విదర్భ అనే ప్రాంతాలను జయించాడు. గౌతమీ పుత్ర శాతకర్ణి కుమారుడు 2వ పులోమావి. 

➠ 2వ పులోమావి :-

2వ పులోమావి గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క కుమారుడు. ఇతనికి నవనగరస్వామి, దక్షిణ పదేశ్వర అనే బిరుదులు కలదు. ప్రతిష్టానుపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన కొనసాగించాడు. శకరుద్రదామనుడు 2వ పులోమావి పై దాడిచేసి విజయాన్ని సాధించాడు. ఈ విషయం భారతదేశంలో లభ్యమైన తొలి సంస్కృతిక శాసనం అయిన జూనాఘడ్‌ శాసనం ద్వారా తెలుస్తుంది. ఓటమి తర్వాత 2వ పులోమావి అమరావతికి చేరుకొని అక్కడనుండి పరిపాలన కొనసాగించాడు. బౌద్దమతానికి సంబందించిన అమరావతి స్థూపాన్ని స్థానిక రాజు అయిన వీలుడు / నాగరాజు నిర్మించాడు. ఇతడు చినగంజాం శాసనాన్ని చెక్కించాడు. 

శివశ్రీశాతకర్ణి :-

ఇతను గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క రెండవ కుమారుడు. 2వ పులోమావి తర్వాత అతని సోదరుడు అయిన శివశ్రీశాతకర్ణి సింహసనాన్ని అధిష్టించి పరిపాలన కొనసాగించాడు. ఇతని కాలంలో తమిళ, ప్రాకృత భాషలలో ద్విభాష నాణేలు ముద్రించడం జరిగింది. ఇతనికి క్షత్రప బిరుదు కలదు. ఇతను రుద్రదమనుడు యొక్క కుమార్తె అయిన రుద్రదమనికను వివాహం చేసుకున్నాడు. 

➠ యజ్ఞశ్రీ శాతకర్ణి :-

యజ్ఞశ్రీ శాతకర్ణి మలిశాతవాహనులలో గొప్పవాడిగా పిలుస్తారు. ఇతడు శాతవాహనులలో 27వ రాజు. ఇతనికి త్రిసముద్రాధిపతి బిరుదు కలదు. ఇతని గురించి ఇలంగోఅడిగల్‌ రచించిన శిలప్పాధికారం పుస్తకంలో పేర్కొనడం జరిగింది. ఈ పుస్తకంలో ఇతనని పాసండి, సత్తి అని ప్రస్తావించడం జరిగింది. ఇతను అత్యధిక సంఖ్యలో ఓడలు/నౌక/తెరచాపల నౌకల రూపంలో నాణేలు ముద్రించడం జరిగింది. దీనిని బట్టి రోమ్‌ దేశంతో వర్తకవ్యాపారాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇతను అచార్య నాగర్జునుడు పేరుమీద నాగర్జున కొండ మీద 1500 గదులతో మహవిరామం/పారవత విహారం నిర్మించి బౌద్దసన్యాసులకు దానంగా ఇచ్చినాడు. ఇతని కాలంలోనే మత్య్సపురాణం సంకలనం చేయబడిరది. ఇతని సేనానిగా విజయోగపుడు వ్యవహరించాడు. ఇతని తర్వాత విజయశ్రీ శాతకర్ణి పరిపాలించాడు. 

➠ విజయశ్రీశాతకర్ణి :-

విజయశ్రీశాతకర్ణి నాగర్జున కొండమీద విజయపురి పట్టణాన్ని నెలకొల్పి పరిపాలన కొనసాగించినాడు. ఈ విజయపురి ఇక్ష్వాకుల యొక్క రాజధాని అని పిలుస్తారు. ఇతను నాగార్జున కొండ అనే శాసనాన్ని చెక్కించడం జరిగింది. ఇతని తర్వాత చందుశ్రీ శాతకర్ణి పరిపాలించాడు. 

ముఖ్యమైన అంశాలు 

  • శాతవాహనులకు పశ్చిన తీరంలో బారుగజ / బ్రోచ్‌ / భరకచ్ఛం (నేటి గుజరాత్‌ లోని సూరత్‌), సోపారా, కళ్యాణి ఓడరేవులు కలవు. 
  • శాతవాహనులకు తూర్పు తీరంలో కంఠకశాల, కొండాయిరా లేదా గూడూరు, ఆల్లోసిన్‌, మసోలియా(మచిలీపట్నం / బందర్‌) ఓడరేవులు కలవు. 
  • సీసం, తగరం, రాగి, వెండితో నాణాలను తయారుచేసేవారు. ఎక్కువగా ఉపయోగించబడ్డ నాణేం కర్షాపణ. 
  • హలుని గాథాసప్తపతి అమరావతి స్థూపాల్లోని శిల్పాలను బట్టి శాతవాహనుల సామాజిక పద్దతులను తెలుసుకోవచ్చు. 
  • శాతవాహనులు బ్రహ్మణులు సనాతన హిందూ ధర్మాన్ని గౌరవించేవారు. బౌద్దమతానికి ఆర్థిక తోడ్పాటు అందించారు. 
  • శాతవాహనుల పరిపాలన మరియు మంత్రిమండలిని ఉన్నాఘర్‌ శాసనంలో ప్రస్తావించారు. 
  • శాతవాహనుల కాలంలో ప్రముఖ బౌద్దమత వేదాంతి ఆచార్య నాగర్జునుడు. ఆచార్య నాగర్జునుడిని రెండవ గౌతమబుద్దుడు, ఇండియన్‌ ఐన్‌స్టీన్‌ అని పిలుస్తారు. నాగర్జునుడు తుహ్రులేఖ, ఆరోగ్య మంజరి, రతరత్నాకరము, రత్నావళి అనే గ్రంథాలను రచించారు.
  • శాతవాహనుల కాలంలో అమరావతి, భట్టిప్రోలు, వడ్లమాను, నాగార్జునకొండ, కొండాపూర్‌, ఫణిగిరి, పెద్దబంకూర్‌, ధూళికట్ట, రామతీర్థం, సాలిహుడం మొదలైన చోట్ల స్థూపాలు, ఆరామాలు నిర్మించారు.  
  • శాతవాహనుల కాలంలో నాసిక్‌, కార్లే, కన్హేరి, బాజా ప్రాంతాలలో గుహారామాలు, చైత్యాలు (బౌద్దమత దేవాలయాలు) నిర్మించారు. 
  • అశోకుని యొక్క శాసనాలు ధాన్యకటకం, రాజుల మందగిరి, ఎర్రగుడి, భట్టిప్రోలు ప్రాంతాలలో ఉన్నాయి. ఇవి ప్రాకృత భాషలో ఉన్నాయి. 
  • శాతవాహనుల కాలంలో బుద్దఘోషుడు అనే కవి ‘విసుది మగ్గ ’ గ్రంథం ప్రాకృత భాషలో రాశాడు. 
  • శాతవాహనుల కాలంలో ప్రముఖ జైన కవి సోమదేవసూరి ‘‘ కథాసరిత సాగరం ’’ రచించినాడు. 
  • శర్వవర్మ ‘‘కాతంత్ర వ్యాకరణం ’’ అనే గ్రంథం రచించినాడు. ఇది సులభంగా సాంసృత భాషను నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. 
  • శాతవాహనులు బ్రహ్మణ మతానికి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాష రాజస్థానంలో ప్రాచుర్యం పొందింది. 
  • తెలంగాణలోని బౌద్ద స్థూపాలన్ని సాంచి స్తూపానికి నమూనాలే. 
  • జాతక కథలు అంటే బుద్దుని పూర్వజన్మ వృత్తాంతాలు తెలియజేస్తుంది. 
  • అంతరంగిక తగాదాలు, గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత రాజ్యానికి వచ్చిన రాజులు అసమర్థులు, విదేశీదాడులు శాతవాహనుల పతనానికి ముఖ్య కారణాలు. 
  • శాతవాహనుల వంశవృక్షం గురించి మత్య్స పురాణం తెలియజేస్తుంది. 
  • 1 నుండి 23 వరకు పరిపాలించిన శాతవాహనుల కాలాన్ని తొలిశాతవాహనం రాజ్యం, 24 నుండి 30వ రాజు పరిపాలించిన శాతవాహన కాలాన్ని మలిశాతవాహన కాలం అంటారు. 
  • శాతవాహన రాజులలో తొలి రాజు శ్రీముఖుడు. 23వ శాతవాహనం రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. మలిశాతవాహనులలో మొదటి వాడు అనగా 24వ రాజు 2వ పులోమావి రాజు. శాతవాహన రాజ్యంలో చివరి రాజు 3వ పులోమావి పరిపాలించాడు. 
  • పుండ్ర, పులింద, శబరి, గుహది అనే జాతులు శాతవాహనుల సమకాలీనులుగా పేర్కొంటారు. 
  • హలుడు సింహళ రాజ్యం అధిపతి సింహరాజు కూతురు లీలావతిని వివాహం చేసుకున్నాడు. 
  • లీలావతి పరిణయం పుస్తకాన్ని కుతుహలుడు రచించాడు. ఈ లీలావతి పరిణయం పుస్తకం హలుని యొక్క వివాహం గురించి ప్రస్తావించింది. 
  • కథాసరిత్సాగరం అనే పుస్తకాన్ని సోమదేవుడు రచించాడు. ఈ పుస్తకం శాతవాహనుల యొక్క వంశనామం గురించి ప్రస్తావించింది. 
  • శాతవాహనుల కాలంలో వాణిజ్య అభివృద్దికి సహకరించిన సంఘాలను శ్రేణులు అని పిలిచేవారు. 
  • శాతవాహనుల కాలంలోని తాత్కాలిక సైనిక శిబిరాన్ని స్కంధవరమని మరియు శాశ్వత మిలిటరీని కటక అని పిలిచేవారు. 
  • వశిష్టిపుత్ర శాతకర్ణి మరియు రుద్రదమన్‌ కుమార్తె వివాహం గురించి కన్హేరి శాసనం తెలియజేస్తుంది.
  • శాతవాహనులకు సంబందించి మొత్తం 24 శాసనాలు లభ్యమయ్యాయి. ఇవి ప్రాకృత భాషలో బ్రహ్మి లిపిలో కలవు.   హిరహడగల్లి, మ్యాకధోని శాసనాలు కర్ణాటకలోని బళ్లారిలో దొరికాయి. 

Tspsc Telangana History :


>
శాతవాహన సామ్రాజ్యం
రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు
మూలపురుషుడు శాతవాహనుడు
గొప్పవాడు గౌతమి పుత్రశాతకర్ణి
మలి గొప్పవాడు యజ్ఞశ్రీ
ఎక్కువకాలం పరిపాలించిన వారు 2వ శాతకర్ణి (56 సం॥లు)
చివరివాడు 3వ పులోమావి
రాజధానులు ప్రతిష్టానుపురం, కోటిలింగాల, అమరావతి
రాజమతం వైదికం
రాజభాష ప్రాకృతం
రాజలిపి బ్రహ్మి
రాజలాంచనం సూర్యుడు
ప్రధాన వృత్తి వ్యవసాయం
ముఖ్య ఆదాయం భూమి శిస్తు (1/6 వంతు)


శాతవాహనుల కాలంలో వాడిన పదాలు
కులరికలు కుండలు తయారు చేసేవారు
ఓదయాత్రికులు నీటిని తోడు ఇంజన్‌లు
తిలపిసక నూనె తయారు చేసేవారు
దమ్నికులు ధాన్యం వర్తకులు
కొలికలు నేతపనివారు
హలికులు వ్యవసాయదారులు
సెరిలు వ్యాపారాలు
గధికులు సుగంధ తైలం తయారు చేసేవారు
వధకులు వడ్రంగులు
వసకరులు వెదురు బుట్టలు తయారు చేసేవారు
వర్తక సంఘాలు శ్రేణులు / గిల్డులు (బ్యాంకులవలె పనిచేస్తాయి
ఓడరేవులు బారుగజ /బ్రోచ్‌ / భరుకచ్ఛం
విశ్వ అమాత్య రాజు అంతరంగిక సలహాదారు
రాజ అమాత్య రాజు ఆజ్ఞలను అమలు పరిచేవాడు
రణ గారిక యుద్ద వ్యవహరాలశాఖ
రాజకంకేటా రాజుల ప్రత్యక్ష ఆదీనంలో ఉన్న భూమి
కరుకర చేతివృత్తులపై పన్ను
ఆపనేస సైనికుల ఖర్చుల కోసం పన్ను
అలోన ఖండక ఉప్పుపై పన్ను
అక్షయనివి శాశ్వత పన్ను
గుహపతి / కుటుంబిన్‌ జమీందారులు
తడగ చెరువు
ఉపాదన బావి
ఉదక యంత్రం భూమిని దున్నేది
గాంధికులు సుగంధ నూనెలు చేసేవారు
వస్సకార వెదురు వస్తువులు తయారు చేసేవారు
సౌధింక కల్లుగీత పనివారు
కులారిక కుమ్మరి
నపిత మంగలి
వధిక వడ్రంగి
ధస్సక చేపలు పట్టేవారు
శ్రామణులు విద్యావంతులు


ఇది కూడా చదవండి - ఇక్ష్వాకుల సామ్రాజ్యం - తెలంగాణ హిస్టరీ

Also Read :

Telangana History : Qutub Shahi Dynasty in telugu

Telangana History : Kakatiya Dynasty in telugu

Telangana History : Ikshavku Dynasty in telugu

Post a Comment

0 Comments