
భారత పార్లమెంట్ కొత్త భవనం విశేషాల గురించి మీకు తెలుసా .. ?
New Parliament Building Details in telugu
భారత పార్లమెంట్ కొత్త భవనం విశేషాల గురించి మీకు తెలుసా .. ?
ఇంద్రభవనాన్ని తలపించే నూతన పార్లమెంట్
Gk in Telugu || General Knowledge in Telugu
పార్లమెంట్ కొత్త భవనం ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనం పక్కనే ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని అత్యాధునిక హంగులతో నిర్మించారు. ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని 16 ఎకరాల స్థలంలో 65,000 చ.మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ భవనాన్ని కేవలం రెండు సంవత్సరాల 6 నెలల కాలంలోనే నిర్మించారు. పార్లమెంట్ పాత భవనంలోని లోక్‌సభలో గరిష్టంగా 552 మంది సభ్యులు, రాజ్యసభలో 245 మంది సభ్యులు మాత్రమే కూర్చునే వీలుంటుంది. కానీ కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో 888 మంది లోక్‌సభ సభ్యులు, 384 మంది రాజ్యసభ సభ్యులు ఒకేసారి కూర్చోవడానికి వీలుగా నిర్మించారు. లోక్‌సభ మరియు రాజ్యసభ ఉభయ సభలు సమావేశం అయినప్పుడు మొత్తం 1272 మంది సభ్యులు సమావేశమయ్యే వీలుంది. ప్రతి సభ్యుడు కూర్చునే సీట్లకు డిజిటల్ అనువాద పరికరాలు అనుసంధానం చేసి ఉంటుంది. ప్రతి సీటు దగ్గర మల్టిమీడియా డిస్‌ప్లే ఉంటుంది. వీటితో పాటు సువిశాలమైన కమిటీ హాల్స్ ఉంటాయి. ఇందులో అత్యాధునిక ఆడియోవీడియో విజువల్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దివ్యాంగులు తమంతట తామే తిరిగేటట్లు తగిన ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ పార్లమెంట్ భవనం నిర్మించేందుకు 26,000 మెట్రిక్ టన్నుల ఇనుము, 63,807 మెట్రిక్ టన్నుల సిమెంట్ ఉపయోగించి నిర్మించారు. ఈ కొత్త పార్లమెంట్ భవనం జోన్ 5 భూకంపాలను కూడా తట్టుకునేలా రూపోందించారు. కొత్త పార్లమెంట్ భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వచ్చేందుకు వీలుగా నోయిడా, రాజస్థాన్ రాజ్ నగర్ నుండి జాలీల రాయిని తెప్పించి వేయించారు. లోక్ సభ చాంబర్‌లలో అశోక చక్రం డిజైన్ ఆకృతి అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. మహరాష్ట్రలోని ఔరంగాబాద్, రాజస్థాన్, జైపూర్ నుండి ఈ డిజైన్ రూపొందించడానికి కావాల్సిన సమాగ్రిని తీసుకువచ్చారు. శిల్ప కళాకృతుల్ని ఉదయ్‌పూర్ శిల్పులు రూపొందించారు. అహ్మదాబాద్‌కు చెందిన ఇత్తడిని వాడారు. త్రిపుర రాష్ట్ర వెదురుతో తయారు చేసిన ప్లోరింగ్, యూపిలోని మిర్జాపూర్‌లో తయారు చేసిన కార్పెట్లును వాడారు.
ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని అహ్మదాబాద్‌కు చెందిన హెచ్‌సీపీ డిజైన్ ఆధునికంగా రూపొందించింది. ప్రముఖ ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్ దీనిని రూపోందించాడు. ఈ భవనం మొత్తం 4 అంతస్తులతో కూడుకొని ఉంది. ఈ కొత్త పార్లమెంట్ భననాన్ని తేది.28-05-2023 రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. .
0 Comments