Telangana History : Asaf jahi dynasty in telugu || అసఫ్ జాహీ వంశం || Tspsc Telangana history in Telugu

Telangana History : Asaf jahi dynasty in telugu ||  అసఫ్ జాహీ వంశం || Telangana history in Telugu

అసఫ్‌ జాహీలు సామ్రాజ్యం
Tspsc Telangana History:

 Asaf jahi dynasty in telugu

Asaf jahi dynasty rulers

Gk in Telugu || General Knowledge in Telugu

Tspsc Telangana History : అసఫ్‌ జాహీలు 1724 నుండి 1948 వరకు పరిపాలన కొనసాగించారు. అసఫ్‌ జాహీ సామ్రాజ్యం ఔరంగబాద్‌ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. వీరు టర్కీ (సౌదీ అరేబియా) లోని తురానీ తెగకు చెందినవారు. మొదట వీరు ఔరంగబాద్‌ రాజధానిగా చేసుకొని పరిపాలించగా 1763 లో నిజాం అలిఖాన్‌ ఔరంగాబాద్‌ నుండి హైద్రాబాద్‌ రాజధానిని మార్చి పరిపాలన కొనసాగించారు. వీరి యొక్క రాజచిహ్నం ‘‘కుల్చా (రొట్టెముక్క)’’. వీరి కాలంలో చలామణిలో ఉన్న అధికారిక నాణెం ‘‘హలిసిక్క’’.
నిజాం సామ్రాజ్యం రాజుల వరుస క్రమం 
1) నిజాం ఉల్‌ముల్క్‌ (1724 - 1748)
ఎ) నాజర్‌జంగ్‌ (1748-1750)
బి) ముజఫర్‌ జంగ్‌ (1750-1751)
సి) సలాబత్‌ జంగ్‌ (1751-1761)
ఈ ముగ్గురిని మొగలాయులు నిజాములుగా గుర్తించలేదు. 
2) నిజాం అలిఖాన్‌ (1761-1803)
3) సికిందర్‌ జా (1803-1829)
4) నసిరుద్దలా (1829-1857)
5) అఫ్జల్‌ ఉద్దలా (1857-1869)
6) మీర్‌ మెహబుబ్‌ అలిఖాన్‌ (1869-1911)
7) మీర్‌ ఉస్మాన్‌ అలిఖాన్‌ (1911-1948)
  • 1వ సాలర్‌జంగ్‌ (అసలు పేరు - మీర్‌ తురబ్‌ అలిఖాన్‌) 1853-1883
  • 2వ సాలర్‌జంగ్‌ (అసలు పేరు - మీర్‌ లాయక్‌ అలి) 1883 - 1887
  • 3వ సాలర్‌జంగ్‌ (అసలు పేరు - యూసఫ్‌ అలిఖాన్‌) 1911 - 1914
(హైద్రాబాద్‌లోని సాలర్‌జంగ్‌ మ్యూజియం 3వ సాలర్‌జంగ్‌ స్మారకంగా ఏర్పాటు చేయడం జరిగింది) 

1) నిజాం ఉల్‌ముల్క్‌ (1724 - 1748)
  • ఇతని అసలు పేరు మీర్‌ ఖమ్రుద్దీన్‌. ఇతను అసఫ్‌ జాహీ వంశ స్థాపకుడిగా కీర్తి సాధించాడు. ఇతనికి చిన్‌ కిలిచ్‌ఖాన్‌, నిజాముల్‌ ముల్క్‌, ఫతే జంగ్‌, అసఫ్‌ జా అనే బిరుదులున్నాయి. 
  • ఇతను 1724 లో శక్కర్‌ ఖేదా యుద్దంలో ముబారిజ్‌ఖాన్‌ను ఓడించి అసఫ్‌ జాహీ రాజ్యంను స్థాపించాడు. ఇతను ఔరంగాబాద్‌ను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. 
  • 1739 లో కర్నాల్‌ యుద్దంలో పర్షియా రాజు నాదిర్షా మొఘల్‌ సైనాన్ని ఓదించగా నాదిర్‌షాకు, మొఘలులకు మద్య శాంతి ఒప్పందం కుదుర్చడంలో నిజాం ఉల్‌ముల్క్‌ ముఖ్య పాత్ర వహించాడు. 
  • 1748 లో ఆప్ఘన్‌ దండ యాత్రికుడు అహ్మద్‌షా అబ్దాలీ మొదటిసారిగా భారతదేశంపై దాడి చేశాడు. అప్పటి మొఘల్‌ చక్రవర్తి మహ్మద్‌ షా రంగీలాకు సహాయం చేయుటకు నిజాముల్‌ దక్కన్‌ నుండి ఢల్లీికి బయలుదేరాడు. మార్గమద్యలో మహరాష్ట్రలోని బుర్హన్‌పూర్‌లో నిజాం ఉల్ ముల్క్‌ అస్వస్తతకు గురై మరణించినాడు. ఇతనికి ఆరుగురు కుమారులున్నారు. నిజాం ఉల్‌ముల్క్‌ యొక్క కలం పేరు "షాకిర్‌". 

2) నిజాం అలిఖాన్‌ (1761-1803)
  • ఇతన్ని 2వ అసఫ్‌జా అని కూడా అంటారు. ఇతని కాలం నుండే అసఫ్‌జాహీ పాలకులు నిజాంలుగా పిలువబడ్డారు. నిజాం అలీ 1770-72 లో రాజధానిని ఔరంగాబాద్‌ నుండి హైద్రాబాద్‌కు మార్చాడు. 
  • నిజాం అలీ 1798 లో లార్డ్‌ వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైనిక సహకార ఒప్పందంలో మొట్టమొదటిగా చేరాడు. దీనిలో జేమ్స్‌ / కిర్క్‌ ప్యాట్రిక్‌ కీలకపాత్ర పోషించాడు. 
  • జేమ్స్‌ ప్యాట్రిక్‌ హైద్రాబాద్‌లో బ్రిటీష్‌ రెసిడెన్సీ భవనాన్ని ఖైరున్నీసా కొరకు నిర్మించాడు. దీని ప్రధాన ఆర్కిటెక్‌ శామ్యుల్‌ పేరుగాంచాడు. 
  • నిజాం అలీ కాలంలో ఫ్రెంచ్‌ అధికారి రేమండ్‌ ముసారాముడిగా పిలువబడ్డాడు. ఇతని పేరుమీదుగానే ముసారామ్‌బాగ్‌ ఏర్పడినది. నిజాం అలీ సహాయంతో రేమండ్‌ గన్‌ఫౌండరీని ఏర్పాటు చేశాడు. రేమండ్‌ టిప్పుసుల్తాన్‌ మరియు బుస్సీల వద్ద పనిచేయడం జరిగింది. 
  • నిజాం అలీ సేనాని అయిన మీర్‌ ఆలం తన పేరుమీదుగా "మీరాలం" చెరువును తవ్వించాడు. 
  • నిజాం అలీ ఆస్థాన చిత్రకారునిగా వెంకటాచలం ఉన్నాడు. 
  • నిజాం అలీపై అతని కుమారుడు అక్భర్‌ అలీ తిరుగుబాటు చేయడం జరిగింది. 
  • రక్షాభవన్‌, కుర్దాయుద్దంలో మహరాష్ట్ర పాలకుల చేతిలో ఓడిపోవడం జరిగింది. 
➙ సైన్య సహకార పద్దతి :
సైన్య సహకార పద్దతిని లార్డ్‌ వెల్లస్లీ 1798 లో ప్రవేశపెట్టడం జరిగింది. నిజాం ఆలీఖాన్‌ కుమారుడు మరణించడంతో నిజాం ఆలీఖాన్‌ అనారోగ్యపాలైన సమయంలో అతని దివాన్‌గా పనిచేస్తున్న అజ్‌ఉల్‌ఉమ్రా అధికారం చేపట్టే పరిస్థితి ఉన్న సమయంలో ఈ సైన్య సహకార పద్దతిపై మొట్టమొదటి సారిగా నిజాం ఆలీఖాన్‌ సంతకం చేసినాడు. ఈ సైన్య సహకార పద్దతి ప్రకారం బ్రిటిష్‌ వారి అనుమతి లేకుండా ఇతర దేశాలతో యుద్దాలు చేయడానికి వీలులేదు.  సైన్య సహకార పద్దతి ద్వారా బ్రిటిష్‌ వారి సైన్యానికి చెల్లించే డబ్బులు ఇవ్వకలేకపోవడంతో దత్త మండలాలు 1) అనంతపురం, 2) కర్నూలు, 3) కడప, 4) బళ్లారిలను బ్రిటిష్‌ వారికి ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది నిజాం అలీఖాన్‌. అంతేకాకుండా రెసిడెన్సీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ దత్తమండలాలకు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన దానికి గుర్తుగా ‘‘రాయలసీమ’’ అని గాడిచర్ల హరిసర్వోత్తమరావు పేరు పెట్టడం జరిగింది. ఇలా 1800 సంవత్సరంలో ఆంధ్రా ప్రాంతం మొత్తం బ్రిటిష్‌ వారు, తెలంగాణ ప్రాంతాన్ని నిజాం ఆలీఖాన్‌ వేరు చేసి పరిపాలించడం జరిగింది. 

Tspsc Telangana History :

సైన్య సహకార ఒప్పందం ప్రకారం  మొట్టమొదటి రెసిడెన్సీగా జేమ్స్‌ ప్యాట్రిక్‌ను నియమించడం జరిగింది. హైద్రాబాద్‌ సంస్థానంలో మొట్టమొదటి రెసిడెన్సీగా జే.హలండ్‌ నియమించబడ్డాడు. చివరి రెసిడెన్సీగా చార్లెస్‌ గోర్డాన్‌ ఉన్నాడు. హైద్రాబాద్‌లో 64 ఎకరాల విస్తీర్ణంలో రెసిడెన్సీ భవనం నిర్మించడం జరిగింది. దీనికి ఆర్కిటెక్చర్‌గా శ్యాముల్‌ ఉన్నాడు. జేమ్స్‌ప్యాట్రిక్‌ ఖైరున్నీసాబేగంను వివాహం చేసుకోవడం జరిగింది. ఈమె కోసం రంగామహల్‌ నిర్మించడం జరిగింది. జేమ్స్‌ ప్యాట్రిక్‌కు ‘‘అస్మత్‌ జంగ్‌’’ అనే బిరుదును సికిందర్‌ జా ఇవ్వడం జరిగింది.  
నిజాం అలీఖాన్‌ కాలంలో మోతీమహల్‌, గుల్షన్‌మహాల్‌, రోషన్‌ మహల్‌ వంటి నిర్మాణాలు చేపట్టడం జరిగింది. 

3) సికిందర్‌ జా (1803-1829)
  • ఇతను నిజాం అలీఖాన్‌ యొక్క చిన్న కుమారుడు. ఇతని అసలు పేరు మీర్‌ అక్భర్‌ అలీఖాన్‌. 
  • ఇతని పేరుమీదుగానే సికింద్రాబాద్‌ (1806) అనే పట్టణం నిర్మించబడింది. 
  • ఇతని కాలంలో పేష్కర్‌గా పనిచేసిన చందులాల్‌ కమీషన్లకు ఆశపడి నిజాంల ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం జరిగింది. 
  • ఇతని కాలంలో మీర్‌ అలాం దివాన్‌గా పనిచేసినాడు. మీర్‌అలాం పేరుమీదుగానే మీరాలం చెరువు నిర్మించారు. 
  • ఇతని కాలంలో హైద్రాబాద్‌ రక్షణ కోసం రస్సెల్స్‌ బిగ్రేడ్‌ సైన్యం (తర్వాతి కాలంలో దీనిని హైద్రాబాద్‌ కంటిన్‌జెంట్‌ ఫోర్స్‌గా పిలిచారు) ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేవి. అదే సమయంలో విలియమ్‌ పామర్‌ కంపనీ (1814) ఏర్పాటు చేయడం జరిగింది. (హైద్రాబాద్‌ సంస్థానంలో బ్యాంకింగ్‌ కార్యకలాపాలు విలియమ్‌ పామర్‌ కంపెనీ ద్వారా జరిగాయి.) రస్సెల్‌ సైన్యం ఖర్చుల కోసం విలియం పామర్‌ కంపనీ సికిందర్‌జాకు వడ్డీకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ వడ్డీ డబ్బులు కట్టలేని పరిస్థితులలో సికిందర్‌జా విలియం పామర్‌ కంపనీకి బీరార్‌ అనే ప్రాంతాన్ని తాత్కాలికంగా అప్పగించడం జరిగింది. మొత్తంగా నిజాం ప్రభుత్వం విలియం పామర్‌ కంపనీకి 64 లక్షలు బాకీ చెల్లించాల్సి ఉండేది. దీంతో చార్లెస్‌ మెట్‌కాఫ్‌ సహకారంతో బ్రిటిషువారు సికిందర్‌జాకు 60 లక్షల రూపాయలు ఋణం ఇవ్వడం జరిగింది. ఇలా బ్రిటిషు వారి వద్ద తీసుకున్న ఋణాన్ని విలియం పామర్‌ కంపనీకి చెల్లించడం జరిగింది. 
  • ఇతని కాలంలోనే ఉత్తర ప్రాంతాలు కోల్పొవడం జరిగింది. 


4) నసిరుద్దలా (1829-1857) 
  • సికిందర్‌జా మరణం ద్వారా అతని కుమారుడు నసిరుద్దలా అధికారంలోకి వచ్చాడు. 
  • ఇతని కాలంలో హైద్రాబాద్‌లో మొట్టమొదటి పాఠశాల సెయింట్‌ జార్జ్‌ గ్రామర్‌ హైస్కూల్‌ (1834) ఏర్పాటు చేయడం జరిగింది.
  • ఇతని కాలంలో చాదర్‌ఘాట్‌ వంతెన నిర్మించారు. 
  • ఇతని కాలంలో 1854 లో కింగ్‌ ఎడ్వర్డ్‌ మెమోరియల్‌ హస్పిటల్‌ నిర్మించబడిరది. ఇదే తర్వాత కాలంలో గాంధీ హాస్పిటల్‌గా మారింది. 
➙ వాహబి ఉద్యమం (1839) 
  • అంగ్లేయులకు, సిక్కులకు వ్యతిరేకంగా ముస్లీంలు చేపట్టిన ఉద్యమం. దీనిని సయ్యద్‌ అహ్మద్‌ బరేలి ప్రారంభించాడు. ముబారిజ్‌ ఉద్దలా ఈ ఉద్యమానికి నాయకునిగా వ్యవహరించాడు. ముబారిజ్‌ ఉద్దలాకు రయిస్‌-ఉల్‌-ముస్లిమన్‌, ఉమర్‌బిన్‌-అబ్దుల్‌ రజిజ్‌ అనే బిరుదులున్నాయి. ఈ ఉద్యమాన్ని జనరల్‌ ప్రేజర్‌ అనే బ్రిటిషు రెసిడెన్సీ అణగదొక్కడం జరిగింది. 
➙ బిరారు ఒప్పందం (1853) :
బిరారు ప్రాంతం మహారాష్ట్రలో ఉంది. గతంలో బ్రిటిషు వారికి సహకరించినందున ఈ ప్రాంతాన్ని తిరిగి నిజాంలకు అప్పగించడం జరిగింది. బ్రిటిషువారికి చెల్లించాల్సిన అప్పు కిందికి బిరారు ప్రాంతాన్ని బ్రిటిషు ప్రాంతానికి అప్పగించేందుకు ఒప్పందం జరిగింది. దీనినే బిరారు ఒప్పందం అని పిలుస్తారు. బిరారు ప్రాంతంలో పాటు ఉస్మానాబాద్‌, రాయచూర్‌ ప్రాంతాలను అప్పగించడం జరిగింది. ఈ ఒప్పందం పై హైద్రాబాద్‌ దివాన్‌ సిరాజ్‌ ఉల్‌ముల్క్‌ సంతకం చేసినాడు. సిరాజ్‌ ఉల్‌ముల్క్‌ మరణం తర్వాత అతని అల్లుడు మొదటి సాలార్‌జంగ్‌ (మీర్‌ తురబ్‌ అలీఖాన్‌) హైద్రాబాద్‌ దివాన్‌గా బాద్యతలు స్వీకరించాడు. మొదటి సాలార్‌జంగ్‌ ఉస్మాన్‌పూర్‌ మరియు రాయచూర్‌ ప్రాంతాలను తిరిగి బ్రిటిషు వారి వద్ద నుండి తీసుకోవడం జరిగింది. 
5) అఫ్జల్‌ ఉద్దలా (1857-1869)
➙ 1857 సిపాయిల తిరుగుబాటు :
  • 1857 జూలై 17న సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. ఆవుకొవ్వు, పందికొవ్వు పూసిన తుటాలను బలవంతంగా వాడాలని నిర్ణయించడం, భారత సైనికులకు, బ్రిటిషు సైనికుల మద్య విచక్షణ చూపించడం వంటి తక్షణ కారణాల వల్ల సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఈ సిపాయిల తిరుబాటులో మొట్టమొదటి సారిగా అమరుడైనవాడు మంగల్‌పాండే. 
  • అప్జల్‌ ఉద్దలా మరియు ఇతని ప్రధాని సాలార్జంగ్‌ 1857 తిరుగుబాటు కాలంలో బ్రిటీషు వారికి మద్దతు పలికారు. 
  • తిరుగుబాటు అణచివేసిన తర్వాత బ్రిటీషు వారు ఇతనికి స్టార్‌ ఆఫ్‌ ఇండియా అనే బిరుదునిచ్చారు. 
  • అప్జల్‌ ఉద్దలా మరణించిన తర్వాత అతని 2 సంవత్సరాల కుమారుడు మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ అధికారంలోకి వచ్చాడు. ఈ చిన్నబాలుడికి సాలార్‌జంగ్‌ నేతృత్వం వహించి కమిటీ సంరక్షకులుగా ఉన్నారు. 
  • చౌమహల్లా ప్యాలెస్‌ నిర్మాణం నసీరుద్దలా ప్రారంభించగా అప్జల్‌ ఉద్దలా పూర్తి చేశాడు. 
6) మీర్‌ మెహబుబ్‌ అలిఖాన్‌ (1869-1911)
  • అప్జల్‌ ఉద్దలా మరణించిన తర్వాత అతని 2 సంవత్సరాల కుమారుడు మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ అధికారంలోకి వచ్చాడు. ఈ చిన్నబాలుడికి సాలార్‌జంగ్‌ నేతృత్వం వహించి కమిటీ సంరక్షకులుగా ఉన్నారు. 
  • మహబూబ్‌ అలీఖాన్‌కు 18 సంవత్సరాలు పూర్తి అయినందున 1884 లో లార్డ్‌రిప్పన్‌ స్వయంగా హైద్రాబాద్‌ వచ్చి మహబూబ్‌ అలీఖాన్‌కు అధికారాలు అప్పగించాడు. 
  • హైద్రాబాద్‌ సంస్థానంను సందర్శించిన మొట్టమొదటి వైస్రాయి లార్డ్‌రిప్పన్‌. 
  • ఇతని కాలంలో సొంత నాణేలు ‘‘హలిసిక్క’’ లు వాడడం మొదలుపెట్టారు. 
  • ఇతని కాలంలో రెండవ సాలర్‌జంగ్‌ రాజభాషగా పర్షియన్‌ భాష స్థానంలో ఉర్దూభాషను ప్రవేశపెట్టాడు. 
  • ఇతని కాలంలో హైద్రాబాద్‌ అన్నిరంగాలలో ముందుకు సాగింది. 
  • ఇతని కాలంలోనే సాలార్‌జంగ్‌ -1, సాలార్‌జంగ్‌-2, అస్మాన్‌ జా, వికార్‌-ఉల్‌-ఉమా (వికారుద్దీన్‌ ), కిషన్‌లు ప్రధానులు (దివాన్‌) గా పనిచేశారు. ఇతని ప్రధాని వికారుద్దీన్‌ ఫలక్‌నామాప్యాలేస్‌ను నిర్మించాడు. 
  • 1888 లో తెలంగాణలోని ప్రజలు మొదటిగా ముల్కీ హక్కులను డిమాండ్‌ చేశారు. 
  • ఇతను "జాకబ్‌ డైమండ్‌" ను పేపర్‌వేయిట్‌గా ఉపయోగించారు. 
  • 1908 లో మూసీనదికి వరదలు వచ్చాయి. ఈ వరదలు మళ్లీ రాకుండా ఇంజనీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో ఆనకట్టల నిర్మాణానికి అనుమతి ఇచ్చినారు. 
  • విక్టోరియా మహరాణి మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌కు గ్రాండ్‌ కమాండర్‌ స్టార్‌ ఆఫ్‌ ఇండియా అనే బిరుదును ఇచ్చింది. అందువల్ల 1905 లో విక్టోరియా మెమోరియల్‌ అనాథ శరణాలయాన్ని నిర్మించాడు. 
  • వేల్స్‌ రాకుమారుడు హైద్రాబాద్‌ రాజ్యాన్ని సందర్శించిన సమయంలో మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ విక్టోరియా హస్పిటల్‌ ను కట్టించాడు. 
  • ఇతని కాలంలో ఫలక్‌నామా ఫ్యాలేస్‌, మొదటి బాలికల పాఠశాల, నిజాం కళాశాల, చెంచల్‌గూడ జైలు, బాగ్‌-ఏ-ఆలం (పబ్లిక్‌ గార్డెన్‌), టెలిఫోన్‌ వ్యవస్థ, నిజామియా అబ్జర్వేటరీ, టౌన్‌ హాల్‌ నిర్మాణాలు చేపట్టినారు. 
  • ఇతని కాలంలోనే ఖ్వానుంచా-ఇ-ముబారఖ్‌ అనే రాజపత్రం ద్వారా రాజ్యాంగ పరమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడు. 
  • ఇతని కాలంలోనే చందా రైల్వే సంఘటన జరిగింది. 
  • ఇతని కాలంలోనే చాదర్‌ఘాట్‌లో థియోసోఫికల్‌ (దివ్యజ్ఞాన సంఘం) స్థాపించబడిరది. 

Tspsc Telangana History :


7) మీర్‌ ఉస్మాన్‌ అలిఖాన్‌ (1911-1948)
  • ఇతని పూర్తిపేరు నవాబ్‌ మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ బహద్దుర్‌. 
  • ఇతను 1886 ఏప్రిల్‌ 6 న జన్మించాడు. 1967 ఫిబ్రవరి 24న మరణించాడు. 
  • ఇతను 7వ అసప్‌ జా  బిరుదుతో నిజాం పదవిని పొందాడు. 
  • ఇతను హైద్రాబాద్‌ సంస్థానంలో శాసనవ్యవస్థ నుండి న్యాయవ్యవస్థను వేరుచేసినాడు. 
  • హైద్రాబాద్‌ సంస్థానంలో సంస్థానం(రాజ్యం)- నిజాం, సుభా-సుభేదారి, జిల్లా-కలెక్టర్‌, తాలూకా-తహశీల్దార్‌, గ్రామం-పటేల్‌, పట్వారి, గ్రామసేవకుల వంటి పరిపాలన వ్యవస్థ ఉండేది. 
  • ఇతని కాలంలో భద్రాచలం, తిరుపతి దేవాలయాలకు వార్షిక నిధులు కేటాయించడం జరిగింది. 
  • మొదటి, రెండవ ప్రపంచ యుద్దాలలో బ్రిటిష్‌వారికి సహకారం అందించినందుకు "HEH" అనే బిరుదు ఇవ్వడం జరిగింది. 
  • ఇతని కాలంలో దేశంలోనే మొట్టమొదటి అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటు చేశారు. 
  • ఇతను ఏర్పాటు చేసిన రోడ్డు రవాణా సంస్థను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించినప్పుడు బస్సుల నంబరులో తన తల్లి పేరులోని మొదటి అక్షరమైన ‘‘Z’’ ఉంచాలని షరతు విధించాడు. 
  • మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ వజ్రాల వ్యాపారం చేసేవాడు. అప్పటి ప్రపంచ మార్కెట్‌లో 70 శాతం పైన వజ్రాలను ఇతనే సరఫరా చేసేవాడు. 
  • 1937 ఫిబ్రవరి 22న టైమ్‌ మ్యాగజైన్‌ ప్రచురించిన ప్రపంచ అత్యంత ధనికుల జాబితాలో మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ అత్యంత ధనికుడిగా చోటు సంపాదించాడు. 
  • 10వేల కోట్ల విలువైన జాకబ్‌ డైమండ్‌ను పేపర్‌ వేయిట్‌గా ఉపయోగించాడు. 
  • 2008 లో విడుదల చేసిన వరల్డ్‌ ఆల్‌టైమ్‌ రిచ్చెస్ట్‌ పర్సన్స్‌ జాబితాలో మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 5వ స్థానంలో ఉన్నాడు. భారతదేశంలో ఆల్‌టైమ్‌ రిచ్చెస్ట్‌ పర్సన్స్‌ జాబితాలో మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ప్రథమ స్థానంలో ఉన్నాడు. 
  • ఇతని కాలంలో ఉస్మాన్‌సాగర్‌(గండిపేట((1920), నిజాంసాగర్‌, హిమాయత్‌సాగర్‌, అలీసాగర్‌, రాయపల్లి చెరువులు నిర్మించారు. 
ఇతని కాలంలో స్థాపించిన పరిశ్రమలు 
1) సోడా ఫ్యాక్టరీ (1910)
2) ఐరన్‌ ప్యాక్టరీ (1910)
3) దక్కన్‌ బటన్‌ ఫ్యాక్టరీ (1916)
4) సింగరేణి కాలరీస్‌ (1920)
5) కెమికల్‌ లేబోరేటరీ (1921)
6) దక్కన్‌ గ్లాస్‌ ఫ్యాక్టరీ (1927)
7) డిబిఆర్‌ మిల్స్‌ (1929) 
8) విఎస్‌టి ఫ్యాక్టరీ (1930)
9) నిజాం స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్‌ (1932)
10) ఆజంజాహి మిల్స్‌ (1934)
11) నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ (1937)
12) సిర్పూర్‌ పేపర్‌ మిల్‌ (1939)
13) గోల్కొండ సిగరేట్‌ ఫ్యాక్టరీ (1941)
14) హైద్రాబాద్‌ ఆల్విన్‌ మెటల్స్‌ (1942)
15) ప్రాగా టూల్స్‌ (1943)
16) హైద్రాబాద్‌ ఆస్బెస్టాస్‌ (1946)
17) హైద్రాబాద్‌ లామినేషన్‌ ప్రొడక్ట్స్‌ (1947) 
  • అప్పటి బ్రిటిష్‌ భారతదేశంలో సొంత కరెన్సీ కల్గిన ఏకైక సంస్థానం హైద్రాబాద్‌.
  • ఉస్మాన్‌ అలీఖాన్‌ హైద్రాబాద్‌ రూపీ, ఉస్మానియా సిక్కా అనే పేరుతో సొంత కరెన్సీని ముద్రించాడు. ఇతని కాలంలో 100, 1000 నోట్లు ఉండేవి. 
  • మీర్‌ అక్బర్‌ అలీ నాయకత్వంలోని విద్యా సదస్సు సూచన మేరకు 1918 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడిరది. ఆర్ట్స్‌ కళాశాలను నిర్మించి నవాబ్‌ అలీజంగ్‌ ఇతని పేరుమీదుగా నేను జులై 11న రాష్ట్ర ఇంజనీర్స్‌ డే గా నిర్వహిస్తుంది. 
  • 1948 సెప్టెంబర్‌ 13-17 మద్య జరిగిన ‘‘ఆపరేషన్‌ పోలో ’’ కారణంగా హైద్రాబాద్‌లో విలీనమైంది. దీంతో అసఫ్‌జాహీల పాలన అంతమైంది. 
సాలర్‌జంగ్‌ - 1 సంస్కరణలు 

Tspsc Telangana History : 

ఇతని అసలు పేరు మీర్‌ తురబ్‌ అలీఖాన్‌. ఇతను లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్‌ పట్టాను పొందాడు. ఇతను లండన్‌ డైటన్‌ అనే అధికారి నుండి పరిపాలన విధానాలు తెలుసుకున్నాడు. ఇతను నసీరుద్దలా, అప్జల్‌ ఉద్దలా, మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ పాలనలో ప్రధానిగా పనిచేశాడు. 1857 లో సిపాయిల తిరుగుబాటు కాలంలో బ్రిటీష్‌ వారికి మద్దతు ప్రకటించి రాయచూర్‌, ఉస్మానాబాద్‌ ప్రాంతాలను తిరిగి పొందాడు. బ్రిటీష్‌ వారికి చెల్లించాల్సిన 50 లక్షల రూపాయలను రద్దు చేయించాడు. ఇతను రెవెన్యూ విధానంలో తీసుకొచ్చిన సంస్కరణలను జిల్లా బంధీ విధానం అంటారు. ఈ విధానం 1865లో అమలులోకి వచ్చింది. దీని ప్రకారం మొత్తం రాజ్యం 5 రెవెన్యూ మండలాలుగా విభజించబడిరది. ప్రతి రెవెన్యూ మండలానికి ఒక రెవెన్యూ సుబేదార్‌ ఉండేవాడు. ఇతను మొత్తం రాజ్యాన్ని 5 సుభాలు, 17 జిల్లాలుగా విభజించాడు. జిల్లాలను తాలూకాలుగా మరియు తాలుకాలను గ్రామాలుగా విభజించాడు. సుభాకు అధిపతి సుబేధార్‌, జిల్లాకు అధిపతి కలెక్టర్‌, తాలూకాకు అధిపతి తహశీల్దార్‌. ఇతను మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేసినాడు. ఇతను తన రాజ్యంలోని వివిధ ప్రాంతాలలో 14 ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసి పరిపాలనలో ప్రభుత్వ నియంత్రణ తీసుకొచ్చాడు. ఇతని వ్యక్తిగత కార్యదర్శి సయ్యద్‌ హుస్సేన్‌ బిల్‌గ్రామీ. 1865 నాటికి ప్రతి జిల్లాకు ఒక ఎస్పీని నియమించాడు. 1867 లో పోలీసు, రెవెన్యూ శాఖను వేరు చేశాడు. 

Also Read : 

Post a Comment

0 Comments