Satavahana Dynasty gk questions in telugu || Tspsc Telangana History : Satavahana Dynasty MCQ Questions in telugu || Part - 1

Satavahana Dynasty gk questions in telugu || gk bits in telugu || Satavahana Dynasty  MCQ Questions in telugu || Part - 1
 

Tspsc Telangana History : 

Satavahana Dynasty Gk questions and Answers in telugu Part - 1

1. క్రింది వాటిలో సరికానిది గుర్తించండి ?
ఎ) దక్షిణాపథంలో ప్రధాన భాగమైన తెలంగాణను పాలించిన మొదటి చారిత్రాత్మక వంశం శాతవాహనులు
బి) దక్షిణాపథం అనగా కృష్ణనదికి ఉత్తరంగా వింధ్య పర్వతాలకు దక్షిణంగా ఉన్న పీఠభూమి
సి) పివి పరబ్రహ్మశాస్త్రి ప్రకారం శాతవాహనుల జన్మస్థలం తెలంగాణ
డి) వివి మీరాశి ప్రకారం శాతవాహనుల జన్మస్థలం ఆంధ్ర ప్రాంతం

జవాబు : డి (వివి మీరాశి ప్రకారం శాతవాహనుల జన్మస్థలం ఆంధ్ర ప్రాంతం)

2) ఆంధ్రుల గురించి తొలసారిగా ప్రస్తావించిన పురాతన గ్రంథం ఏది ?
ఎ) మహాభారతం
బి) హర్ష చరిత్ర
సి) బృహత్కథ
డి) ఐతరేయ బ్రాహ్మణం

జవాబు : డి (ఐతరేయ బ్రాహ్మణం

3) క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ?
1) శాతవాహనుల మూలపురుషుడు - శాతవాహనుడు
2) శాతవాహనుల అధికార భాష - ప్రాకృతం
3) శాతవాహనుల రాజలాంచనం ` సూర్యుడు
ఎ) పైవన్నీ
బి) 1 మరియు 2
సి) 2 మరియు 3
డి) 1 మరియు 3

జవాబు : ఎ (పైవన్నీ)

4) శాతవాహనుల చరిత్రకు సంబందించి ఎక్కువ ప్రామాణికమైన పురాణం ఏది ?
ఎ) వాయుపురాణం
బి) మత్య్స పురానం
సి) విష్ణుపురాణం
డి) బ్రహ్మండపురాణం

జవాబు : బి (మత్య్సపురాణం)

5) శాతవాహనుల గురించి తెలియజేసే ఆధారాలలో గల స్వదేశీ రచనలలో లేని వాటిని గుర్తించండి ?
ఎ) పురాణాలు
బి) కామసూత్రాలు
సి) సియుకి
డి) బృహత్కథ

జవాబు : సి (సియుకి)

6) శాతవాహనుల గురించి తెలియజేయు స్వదేశీ రచన హర్ష చరిత్రకు సంబందించి సరికానిది గుర్తించండి ?
ఎ) హర్ష చరిత్రను రచించినది భానుడు
బి) శాతవాహన రాజు యొక్క మిత్రుడు నాగార్జునుడు
సి) ఆంధ్రులు కౌరవ పక్షాన యుద్దం చేశారు
డి) యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రి సముద్ర ఈశ్వరుడని బిరుదు కలదు.

జవాబు : సి (ఆంధ్రులు కౌరవ పక్షాన యుద్దం చేశారు)

7) క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ?
1) బి.ఎస్‌.ఎల్‌ హనుమంతరావు అనే చరిత్రకారుని ప్రకారం శాతవాహనులు ఆర్యులు
2) ఆర్‌.ఎస్‌ శర్మ ప్రకారం శాతవాహనులు ద్రవిడులు
ఎ) పైవన్నీ
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) రెండూ కాదు )

జవాబు : ఎ (పైవన్నీ

8) క్రిందివాటిలో ‘‘గాధాసప్తశతి’’ కి సంబందించి సరైనది గుర్తించండి ?
1) దీనిని రచించినది హలుడు
2) శాతవాహనుల సాంఘిక పరిస్థితులు తెలుసుకొనుటకు ఆధారం
3) నేరస్తులకు చెట్లకు ఉరి తీసేవారు అని పేర్కొన్నది
4) తొలిసారిగా రాధాకృష్ణ ప్రణయగాధను వివరించినది.
ఎ) 1 మరియు 2
బి) 2 మరియు 4
సి) 1 మరియు 2 మరియు 3
డి) పైవన్నీ

జవాబు ః డి (పైవన్నీ)

9) ఈ క్రింది ఏ గ్రంథం పైశాచిక ప్రాకృతంలో రచించబడినది ?
ఎ) హర్ష చరిత్ర
బి) కథ సరిత్సాగరం
సి) గాధాసప్తశతి
డి) బృహత్కథ

జవాబు : డి (బృహత్కథ)
దీనిని గుణాడ్యుడు రచించడం జరిగింది.

10) శాతవాహనులు విదేశీ వాణిజ్యాన్ని చేశారని ఆధారాలు తెలియజేయు ఈ క్రింది గ్రంథాలను గుర్తించండి ?
1) నాచురల్‌ హిస్టరీ
2) పెరిప్లస్‌ ఆఫ్‌ ది ఎడిట్రియస్‌సి
3) ఇండికా
4) సియుకి
ఎ) పైవన్నీ
బి) 1 మరియు 2
సి) 2 మరియు 3
డి) 1 మరియు 3

జవాబు : బి (1 మరియు 2)


Also Read :

11) ఈ క్రింది గ్రంథాలలో శాతవాహనుల కాలం నాటి రేవు పట్టణాల గురించి వర్ణించినది ?
ఎ) పెరీ ప్లస్‌ ఆఫ్‌ ది ఎర్రితియన్‌ సీ
బి) నేచురల్‌ హిస్టరీ
సి) ఇండికా
డి) జాగ్రఫీ

జవాబు : డి (జాగ్రఫీ)

12) ఈ క్రింది వానిలో ఏ గ్రంథం సంస్కృత భాషలో రచించబడని గ్రంథం ఏది ?
ఎ) కామసూత్రాలు
బి) కాతంత్ర వ్యాకరణం
సి) సుహృలేఖ
డి) బృహత్కథ

జవాబు ః డి (బృహత్కథ)
దీనిని పైశాచిక భాషలో రచించినది.

13) ఈ క్రింది ఏ రాజుల మద్య ప్రత్యుత్తరాల సారాంశం సృహు లేఖ ?
ఎ) యజ్ఞశ్రీ శాతకర్ణి - ఆచార్య నాగార్జునుడు
బి) మొదటి శాతకర్ణి - ఆచార్య నాగార్జునుడు
సి) రెండవ పులోమావి - ఆచార్య నాగార్జనుడు
డి) కుంతల శాతకర్ణి - ఆచార్య నాగార్జునుడు

జవాబు : ఎ (యజ్ఞశ్రీ శాతకర్ణి ` ఆచార్య నాగార్జునుడు)

14) నానాఘట్‌ శాసనంకు సంబందించి ఈ క్రింది వాటిలో సరికానిది ఏది ?
ఎ) నానాఘట్‌ శాసనంను జారీ చేసింది - దేవీనాగానిక
బి) ఈ శాసనం శాతవాహనులు, మరాఠాలు మద్యగల వైవాహిక సంబంధాలు గురించి తెలుపుతుంది
సి) ఈ శాసనం మొదటి శాతకర్ణి 2వ అశ్వమేధ యాగాలు చేసినట్లు తెలుపుతుంది
డి) ఈ శాసనం వల్ల మొదటి శాతకర్ణి విజయాలు మరియు అతనికి ఏకబ్రహ్మన అనే బిరుదులు ఉండేవని తెలుస్తుంది

జవాబు : డి (ఈ శాసనం వల్ల మొదటి శాతకర్ణి విజయాలు మరియు అతనికి ఏకబ్రహ్మన అనే బిరుదులు ఉండేవని తెలుస్తుంది)

15) ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించి ?
1) నాసిక్‌ శాసనం జారీ చేసింది - గౌతమి బాలశ్రీ
2) నాసిక్‌ శాసనం గౌతమిపుత్ర శాతకర్ణి చేసిన దండయాత్రలు, సాధించిన విజయాలు గుర్తించి తెలుపుతుంది
3) ఈ శాసనం శాతవాహనుల రాజకీయ చరిత్రకు సంబందించిన వివరాలను తెలుపుతుంది.
ఎ) 1 మరియు 2
బి) 2 మరియు 3
సి) 1 మరియు 3
డి) పైవన్నీ

జవాబు : డి (పైవన్నీ)

16) శాతవాహనుల కాలం నాటి పట్టణ ప్రాంతాల గురించి ఈ క్రింది ఏ శాసనం తెలుపుతుంది ?
ఎ) ఉన్నాగర్‌ శాసనం
బి) భట్టిప్రోలు నిగమసభ
సి) మ్యకధోని శాసనం
డి) హతిగుంపు శాసనం

జవాబు : బి (భట్టిప్రోలు నిగమసభ)
దీనిని కుబేరుడు లిఖించడం జరిగింది.

17) శాతవాహనుల కాలం నాటి టంకశాల ఈ క్రింది ఏది గుర్తింపు పొందింది ?
ఎ) కొండాపూర్‌
బి) కోటిలింగాల
సి) మునులగుట్ట
డి) ధాన్యకటకం

జవాబు : ఎ (కొండాపూర్‌)
ఇది సంగారెడ్డి జిల్లాలో ఉంది. దీనిని సోమశేఖర శర్మ తెలపడం జరిగింది.

18) పెద్దబొంకూర్‌లో ఒక రైతు పొలంలో శాతవాహనుల నాణేలు దొరికాయి అయితే ఈ పెద్దబొంకూర్‌ ఏ జిల్లాలో ఉంది ?
ఎ) జగిత్యాల
బి) సంగారెడ్డి
సి) పెద్దపల్లి
డి) కరీంనగర్‌

జవాబు : సి (పెద్దపల్లి)

19) గౌతమీపుత్రశాతకర్ణీ రుద్రదాముడిని ఓడించినట్లు పేర్కొన్న శాసనం ఏది ?
ఎ) ఎర్రగుడి శాసనం
బి) జూనాగడ్‌ శాసనం
సి) హాతిగుంప శాసనం
డి) భట్టిప్రోలు శాసనం

జవాబు : బి (జూనాగడ్‌ శాసనం)
దీనిని రుద్రదాముడు వేయించడం జరిగింది. ఇది సంస్కృత భాషలో వేసిన మొట్టమొదటి శాసనం

20) ఈ క్రింది వాటిలో సరికానిది ఏది ?
ఎ) తెలంగాణలో లభించిన రాజుల పేర్లు గల తొలినాణాలు - రానోగోభద్ర, రానోసమాగో ?
బి) శాతవాహనుల నాణాలు తొలిసారిగా బయటపడిన ప్రాంతం - కదంబపూర్‌
సి) శాతవాహనుల కాలంలో ముద్రణకు ఉపయోగించిన పరికరాలు నాగార్జున కొండలో లభించాయి
డి) శాతవాహనులు నాణాలపై వాడిన లిపి - బ్రహ్మలిపి

జవాబు : బి (శాతవాహనుల నాణాలు తొలిసారిగా బయటపడిన ప్రాంతం ` కదంబపూర్‌)



Post a Comment

0 Comments