
The Onion Story
telugu stories with moral || telugu stories for children
Telugu Stories || Moral Stories in Telugu || Telugu Kathalu || Telugu Stories for Kids
ఉల్లిపాయ, వంకాయ, టమాట ముగ్గురు మంచి మిత్రులుగా ఉండేవారు. ఒక రోజు ముగ్గురు మిత్రులు కలిసి దేవున్ని దర్శించుకుందామని గుడికి బయలుదేరాయి. వారు వెళుతున్న దారిలో ఒక వాహనం వస్తున్న విషయం తెలుసుకోని వంకాయ వాహనం చక్రాల కింద పడి నలిగిపోయింది. ఇది చూసిన వంకాయ మిత్రులు టమాట మరియు ఉల్లిపాయలు వెక్కివెక్కి ఏడ్చాయి. కొంత సమయం గడిచిన తర్వాత ఆ బాదను దిగమింగుకొని ముందుకు వెళ్లాయి. మరికొంత దూరం వెళ్లిన తర్వాత పక్కనున్న కొండపై నుండి ఒక పెద్దరాయి వచ్చి టమాట మీద పడడంతో టమాట నుజ్జునుజ్జు అయిపోతుంది. ఇది చూసిన ఉల్లిపాయ బోరున విలపిస్తుంది. ఇలా తన ఇద్దరు మిత్రులు మరణించడంతో కొంతసేపు బాదపడిన ఉల్లిపాయ ప్రగాడ సానుభూతితో విలపిస్తు దేవాలయానికి చేరుకుంటుంది. దేవాలయానికి వెళ్లిన తర్వాత అక్కడ పరమశివున్ని చూసి ఏడూస్తు సొమ్మసిల్లి పడిపోతుంది. ఇదంతా చూసిన శివుడు ప్రత్యక్షమై ‘‘ఓ ఉల్లిపాయ ! ఎందుకు విలపిస్తున్నావు.. నీ దుఃఖానికి కారణం ఏమిటని ’’ ప్రశ్నించాడు.
శివుడు ప్రత్యక్షం కావడంతో ఉల్లిపాయ లేచి శివునికి నమస్కరించి ఇలా అంది ‘‘నా ప్రాణ మిత్రులైన వంకాయ, టమాటలు నేను చూస్తుండగానే మరణించినారు. వంకాయ మరణించినప్పుడు నేను ,టమాట ఏడ్చాము. టమాట చనిపోయినప్పుడు నేను ఏడ్చాను. కాని నేను చనిపోయినప్పుడు నాకంటూ ఎవరు లేరు, ఏడ్చేవారు అస్సలు లేరు ’’ అని తన బాదను విన్నవించుకుంటుంది. అప్పుడు శివుడు ఇలా అన్నాడు ‘‘ఓ ! బిడ్డా నీవు దుఃఖించకు ఎవరైతే వంట వండటానికి నీన్ను కోస్తారో వారే నీ కొరకు కన్నీటిని రాలుస్తారు ! ఇదే నేను నీకు ఇస్తున్న వరం’’ అని శివుడు అంటాడు. ఇలా ఉల్లిపాయను కోస్తే మనకు కన్నీరు రావడానికి వాడుకలో ఉన్న కథ.
Also Read :
The Clever Sheep : Telugu Stories
0 Comments