Udyogini Yojana scheme in Telugu || పీ.ఎం ఉద్యోగిని పథకం || 3 లక్షల వరకు బ్యాంకు ఋణం || Gk in Telugu

Udyogini Yojana scheme in Telugu Udyogini Scheme details in Telugu Udyogini Yojana scheme apply online

 పీ.ఎం ఉద్యోగిని పథకం 
మహిళా పారిశ్రామికవేత్తలకు వరం 
3 లక్షల వరకు బ్యాంకు ఋణం 
Udyogini Scheme details in Telugu

Gk in telugu : Udyogini Yojana scheme

Gk in Telugu || General Knowledge in Telugu


భారతదేశంలోని మహిళా పారిశ్రామికవేత్తల కొరకు కేంద్ర ప్రభుత్వం ‘‘ఉద్యోగిని యోజన పథకం’’ ప్రవేశపెట్టింది. దేశంలో మహిళల అభివృద్ది మరియు సంక్షేమం కొరకు ఉద్యోగిని యోజన పథకం ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా దేశంలోని మహిళలు నూతన వ్యాపారాన్ని స్థాపించడం కోసం లేదా ఇదివరకే కొనసాగిస్తున్న వ్యాపారాన్ని అభివృద్ది చేసుకోవడం కోసం ఎటుంటి పూచీకత్తు లేకుండా 3 లక్షల వరకు బ్యాంక్‌ ఋణం అందించడం జరుగుతుంది. దీనిద్వారా మహిళలకు ఆర్థిక చేయూత అందించి వారి సంక్షేమానికి తోడ్పడడం జరుగుతుంది. అంతేకాకుండా వితంతు/వికలాంగులకు తీసుకున్న ఋణంలో 30 శాతం వరకు సబ్సిడీ ఉంటుంది. దళితులకైతే 50 శాతం సబ్సిడీ ఉంటుంది.  

భారతదేశంలో అనేక మంది మహిళలు వ్యాపారం ప్రారంభించడం కోసం వడ్డీవ్యాపారుల వద్ద, ఇతర సంస్థల వద్ద అప్పులు తీసుకువచ్చి అధిక వడ్డీ చెల్లిస్తూ ఆర్థికంగా చితికిపోతుంటారు. దీనిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ‘‘ఉద్యోగిని యోజన’’ పథకం ప్రవేశపెట్టడం జరిగింది. 

వెనుబడిన మహిళలకు ఆర్థిక చేయూతను అందించి వారి అభివృద్ది కోసం ఈ ఋణాన్ని అందించే లక్ష్యంతో ఈ పథకం ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కొరకు కేవలం మహిళలు మాత్రమే ధరఖాస్తులు చేసుకోవచ్చు. దేశంలోని 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు ఉండి, వార్షికాదాయం 1.5 లక్షల మించకుండా ఉన్న మహిళలు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా దళితులకు వడ్డీలేని ఋణాన్ని అందిస్తారు. 

88 రకాల వ్యాపారాలో ఏదో ఒక వ్యాపారం చేసుకోవడానికి ఋణాన్ని అందిస్తారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను అధిక ప్రాధాన్యత ఉంటుంది. వైకల్యం, వితంతు మహిళలకు ఋణ పరిమితి లేదు. అంతేకాకుండా వైకల్యం / వితంతు / దళిత మహిళలకు వడ్డీ లేని ఋణం అందిస్తారు. మిగిలిన మహిళలకు 10 నుండి 12 శాతం వడ్డీపై ఋణం అందిస్తారు. ఈ వడ్డీరేటు అనేది తీసుకునే బ్యాంకును బట్టి, కుటుంబ వార్షికాదాయం బట్టి మారుతుంది. ఈ పథకానికి ధరఖాస్తు చేసుకునే మహిళలు తమ క్రెడిట్‌ స్కోర్‌ / సిబిల్‌ స్కోర్‌ బాగుండేలా చూసుకోవాలి. గతంలో ప్రభుత్వం నుండి లోన్‌ తీసుకొని చెల్లించని వారికి లోన్‌ ఇవ్వరు. 

ఉద్యోగిని యోజన పథకానికి ధరఖాస్తు చేయడానికి ధరఖాస్తు ఫారంతో పాటు అభ్యర్థి పాస్‌పోర్టు సైజు ఫోటోలు, ఆధార్‌కార్డు, బర్త్‌ సర్టిఫికేట్‌, కులం, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు, రేషన్‌ కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌ వంటి ధృవీకరణ పత్రాలు జతచేయాలి. అర్హులైన మహిళలు బ్యాంక్‌లో ధరఖాస్తు చేసుకోవాలి. 


స్కీమ్‌ పేరు

‘‘ఉద్యోగిని యోజన (Udyogini Yojana) ’’ పథకం

ఉద్యోగిని యోజన (Udyogini Yojana) పథకంకు ఎవరు అర్హులు ?
  • మహిళలై ఉండాలి.
  • వార్షికాదాయం 1.5 లక్షలకు మించరాదు.
  • 18 నుండి 55 సంవత్సరాల లోపు ఉండాలి
ఉద్యోగిని యోజన (Udyogini Yojana) పథకం ద్వారా ఎంత వరకు ఋణం ఇస్తారు ?

3 లక్షల వరకు ఋణం అందిస్తారు.

ఉద్యోగిని యోజన (Udyogini Yojana) పథకం ఋణం ఇచ్చు సంస్థలు

దేశంలోని అన్ని ప్రధాన బ్యాంకులు

ఉద్యోగిని యోజన (Udyogini Yojana) పథకం సబ్సిడీ
  • వైకల్యం / వితంతు / దళిత మహిళలకు వడ్డీ ఉండదు
  • ఇతరులు 10 నుండి 12 శాతం వడ్డీ చెల్లించాలి
  • వితంతు / వికలాంగులకు 30 శాతం సబ్సిడీ ఉంటుంది
  • దళిత మహిళలకు 50 శాతం సబ్సిడీ ఉంటుంది.
ఉద్యోగిని యోజన (Udyogini Yojana) పథకంకు కావాల్సిన ధృవీకరణ పత్రాలు
  • పాస్‌పోర్టు సైజు ఫోటో
  • ఆధార్‌ కార్డు
  • బర్త్‌ సర్టిఫికేట్‌
  • కులం సర్టిఫికేట్‌
  • ఆదాయం సర్టిఫికేట్‌
  • నివాసం సర్టిఫికేట్
  • రేషన్‌ కార్డు
  • బ్యాంక్‌ ఖాతా

స్కీమ్‌ పేరు ఉద్యోగిని యోజన (Udyogini Yojana)
దేశం ఇండియా
ఎవరు అర్హులు మహిళలు
ఋణం 3 లక్షల వరకు
వయస్సు 18 - 55 సంవత్సరాలు
సబ్సిడీ 50 శాతం వరకు
వడ్డీ రేటు 10 నుండి 12 శాతం
ధరఖాస్తు విధానం ఆఫ్‌లైన్‌
ధరఖాస్తు ప్రదేశం బ్యాంకులు
ప్రశ్న 1 : నా యొక్క వయస్సు 56 సంవత్సరాలు ఉంటుంది. నేను ఉద్యోగిని యోజన (Udyogini Yojana) పథకం కొరకు ధరఖాస్తు చేసుకోవచ్చా ?

జవాబు : లేదు. 18 నుండి 55 సంవత్సరాలు ఉన్నవారు మాత్రమే ధరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రశ్న 2 : నా యొక్క వార్షికాదాయం 8 లక్షల వరకు ఉంటుంది. నేను ఉద్యోగిని యోజన (Udyogini Yojana) పథకం కొరకు ధరఖాస్తు చేసుకోవచ్చా ?

జవాబు : లేదు, వార్షికాదాయం 1.5 లక్షల లోపు వారు మాత్రమే ధరఖాస్తు చేసుకోవచ్చు

ప్రశ్న 3 : ఉద్యోగిని యోజన (Udyogini Yojana) పథకం ద్వారా ఎంతవరకు ఋణం అందిస్తారు ?

జవాబు : 3 లక్షల వరకు ఋణం అందిస్తారు.‌

ప్రశ్న 4 : బ్యాంకు ద్వారా ఋణం తీసుకున్న తర్వాత వడ్డీ చెల్లించవల్సి ఉంటుందా  ?

జవాబు : అవును, వైకల్యం / వితంతు / దళిత మహిళలకు వడ్డీ ఉండదు. కానీ మిగతా వారు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రశ్న 5 : ఉద్యోగిని యోజన (Udyogini Yojana) పథకం ద్వారా తీసుకున్న ఋణానికి ఎంతవరకు సబ్సిడీ ఉంటుంది ?

జవాబు : వితంతు / వికలాంగులకు 30 శాతం, దళితులకు 50 శాతం సబ్సిడీ ఉంటుంది. మిగతా వారికి సబ్సిడీ ఉండదు.

ప్రశ్న 6 : ఉద్యోగిని యోజన (Udyogini Yojana) పథకం కొరకు నేను ఎక్కడ ధరఖాస్తు చేసుకోవాలి ?

జవాబు : సమీపంలోని బ్యాంకుల ద్వారా

ప్రశ్న 7 : బ్యాంకులో ఏయే ధృవపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది ?

జవాబు : పాస్‌పోర్టు సైజు ఫోటోలు, ఆధార్‌కార్డు, బర్త్‌ సర్టిఫికేట్‌, కులం, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు, రేషన్‌ కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌

ప్రశ్న 8 : ఉద్యోగిని యోజన (Udyogini Yojana) పథకం ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది ?

జవాబు : గ్రామీణ ప్రాంత మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది.

Post a Comment

0 Comments