
Goods and Services Tax (GST) What is GST in India ?
- జీఎస్టీ అంటే ఏమిటీ ?
- జీఎస్టీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటీ
- జీఎస్టీలో ఎన్ని స్లాబ్‌లు ఉంటాయి
- Goods and Services Tax (GST)
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk in Telugu (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే ప్రశ్నలు పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
GST in Telugu : భారతదేశంలో పన్నుల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొని వస్తూ ఒకే దేశం - ఒకే పన్ను విధానంతో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) తీసుకొచ్చారు. ఈ జీఎస్టీ దేశంలో 01 జూలై 2017 న అమలులోకి వచ్చింది. అప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న పన్నులకు బదులు దేశం మొత్తం ఒకే విధంగా జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఈ జీఎస్టీని దేశీయంగా వినియోగమయ్యే వస్తుసేవల అంతిమ విలువపై విదిస్తారు. దీనిని వినియోగదారుడు భరిస్తాడు. వ్యాపారులు మాత్రం ప్రభుత్వానికి చెల్లిస్తారు. నూతనంగా ప్రవేశపెట్టిన ఈ జీఎస్టీ పద్దతి ద్వారా వస్తువుల రవాణా వ్యయంలో తగ్గుదల వచ్చి వ్యాపార లావాదేవీలు సాఫిగా సాగుతాయి. జీఎస్టీపై 2002 సంవత్సరంలో విజయ్‌కేల్కర్ కమిటీని వేయడం జరిగింది.
➼ GST యొక్క లక్ష్యాలు :
- ఒక పన్నుపై మరొక పన్ను విధించడం వల్ల ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థపై దుష్ఫ్రభావాలను తగ్గించడం
- నాణ్యమైన వస్తువుల తయారీ మరియు పోటీతత్వం పెంచడం కోసం
- రకరకాల పన్నులను తగ్గించడం
- ఆర్థికాభివృద్దికి సహకరించడం
➼ GST యొక్క లాభాలు :
- ఒక పన్నుపై మరొక పన్ను విధించడం ఆగిపోతుంది.
- ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది.
- ఎటువంటి ఆటంకం లేకుండా సక్రమంగా పన్నులు వసూలు చేయచ్చు
- పన్నుల చెల్లించకుండా ప్రభుత్వానికి నష్టం చేకూర్చే వారిని నివారించవచ్చు
- ప్రపంచంతో పోటీ పడవచ్చు
➼ GST వీలినమైన వివిధ రకాల పన్నులు :
ఎ) కేంద్రం
- కేంద్ర ఎక్సైజ్ సుంకాలు
- అదనపు ఎక్సైజ్ సుంకాలు
- అదనపు ఆదాయపు పన్ను సుంకాలు
- ప్రత్యేక అదనపు కస్టమ్స్ సుంకాలు
- సేవా పన్ను
- సెస్‌లు, సర్ చార్జీలు
- రాష్ట్ర అమ్మకం పన్ను
- కేంద్ర అమ్మకం పన్ను
- వినోదపు పన్ను
- ప్రవేశ పన్ను
- లగ్జరీ పన్ను
- కొనుగోలు పన్ను
- లాటరీ, పందెం, జూదంపై పన్నులు
- వ్యాపార ప్రకటనలపై పన్నులు
- రాష్ట్ర సెస్, సర్‌చార్జీలు
➼ GSTలో విలినం కానీ పన్నులు :
- ప్రాథమిక కస్టమ్స్ సుంకాలు
- కస్టమ్స్‌పై ఉన్న సర్‌చార్జీలు
- కస్టమ్ సెస్‌లు
- పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలు
- గ్యాస్, పొగాకుపై ఉన్న కేంద్ర ఎక్సైజ్ సుంకాలు
- మోటారు వాహనాలపై పన్ను
- మద్యంపై ఉన్న రాష్ట్ర ఎక్సైజ్
- పెట్రోల్ ఉత్పత్తులపై ఉన్న వ్యాట్
0 Comments