
IDBI Bank Recruitment 2023 – Apply Online for 600 Jr Asst Manager Grade O Posts in Telugu
Jobs in Telugu || Latest Jobs in Telugu
ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడిబీఐ) ఖాళీగా ఉన్న మేనేజర్ గ్రేడ్ O (జూనియర్ అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐడీబీఐ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 600 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు సంవత్సర కాలవ్యవధితో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీబీఎఫ్) కోర్సు పూర్తి చేయాలి. అందులో విజయవంతమైన వారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఈ పీజీబీఎఫ్ కోర్సు కాలవ్యవధిలో అభ్యర్థులకు స్టైఫండ్ కూడా ఇస్తారు. ఉద్యోగం చేరిన వారికి సంవత్సరానికి 6.5 లక్షల వేతనం అందుకునే అవకాశం ఉంది.
IDBI Jr Assistant Manager Jobs : బ్యాంకింగ్ రంగంలో పీవో ఉద్యోగాలను అధిక శాతం ఐబీపీఎస్ ద్వారానే భర్తీ చేస్తారు. కానీ వివిధ బ్యాంకులలో కొన్ని ప్రత్యేకమైన సేవలు అందించడానికి సాధారణ డిగ్రీ అభ్యర్థుల సామర్థ్యం చాలదు. అటువంటి సమయంలో ఏడాది కోర్సు శిక్షణతో కూడిన ఉద్యోగాలకు విడివిడిగా నోటిఫికేషన్‌లు విడుదల చేస్తాయి. కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఆన్‌లైన్ పరీక్షలో సెక్షన్లవారీగా కనీస మార్కులు సాధించాలి. తర్వాత ఇంటర్యూకి ఎంపిక చేస్తారు. ఈ సంఖ్యను ఐడీబీఐ నిర్ణయిస్తుంది. ఇంటర్యూకి 100 మార్కులు ఉంటాయి. ఇందులో కనీసం 50 మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు అయితే 45 సాధిస్తే సరిపోతుంది. పరీక్షలో సాధించిన మార్కులకు 3/4, ఇంటర్యూలో సాధించిన మార్కులకు 1/4 ప్రకారం కలిపి మెరిట్ లిస్టు రూపొందిస్తారు.
ఏదేని డిగ్రీ పూర్తిచేసిన వారు 30 సెప్టెంబర్ 2023 లోగా ఆన్‌లైన్‌లో 200 / 1000 రూపాయలు ఫీజు చెల్లించి ధరఖాస్తు చేసుకోవాలి. వయోపరిమితి 20 నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి. రిజర్వేషన్ల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. మొత్తం 600 పీవో పోస్టులను భర్తీ చేయనుండగా ఇందులో ఓబీసీలకు 162, ఎస్సీలకు 90, ఎస్టీలకు 45, ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 60, అన్‌రిజర్వ్‌డ్ వారికి 243 పోస్టులున్నాయి. తెలుగు రాష్ట్రాలలో పరీక్ష కేంద్రాలు పరిశీలించగా తెలంగాణలో హైద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం మరియు వరంగల్ అలాగే ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, చిత్తూర్, ఏలూర్, గుంటూర్, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఓంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాలలో ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయి.
ఐడీబీఐ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక్క మార్కు చొపున 200 మార్కులుంటాయి. ఈ పరీక్షను 2 గంటల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. నెగిటివ్‌మార్కింగ్ విధానం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి పావుమార్కు తగ్గిస్తారు. లాజికల్ రీజనింగ్, డేటాఅనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రేటేషన్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, జనరల్ / ఎకానమీ /బ్యాంకింగ్ అవేర్‌నెస్ సబ్జెక్టుల నుండి ప్రశ్నలు అడుగుతారు. సెక్షన్ ప్రకారం సమయ నిబంధన లేదు.
Also Read : Gk Questions in Telugu
➳ IDBI మొత్తం పోస్టులు :
600 మేనేజర్ గ్రేడ్ O (జూనియర్ అసిస్టెంట్ మేనేజర్)
- అన్‌రిజర్వ్‌డ్ (243)
- ఓబీసీ (162)
- ఎస్సీ (90)
- ఎస్టీ(45)
- ఈడబ్ల్యూఎస్ (60)
➳ IDBI పరీక్ష ఫీజు :
- 1000/- జనరల్ / ఓబిసి అభ్యర్థులకు
- 200/- ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు
➳ IDBI ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలి.
➳ IDBI పరీక్షా సెంటర్‌లు :
తెలంగాణలో
- హైద్రాబాద్
- కరీంనగర్
- ఖమ్మం
- వరంగల్
ఆంధ్రప్రదేశ్‌లో
- చీరాల
- చిత్తూర్
- ఏలూర్
- గుంటూర్
- కడప
- కాకినాడ
- కర్నూలు
- నెల్లూరు
- ఓంగోలు
- రాజమహేంద్రవరం
- శ్రీకాకుళం
- తిరుపతి
- విజయవాడ
- విశాఖపట్నం
- విజయనగరం
➳ వయోపరిమితి :
- అగస్టు 31, 2023 నాటికి 20 నుండి 25 సంవత్సరాల మద్యలో ఉండాలి.
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, వికలాంగులకు 10 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు మూడేళ్లు చొప్పున గరిష్ట వయోపరిమితిలో సడలింపు.
Also Read : Telugu Stories
➳ ఎంపిక ప్రక్రియ :
కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఆన్‌లైన్ పరీక్షలో సెక్షన్లవారీగా కనీస మార్కులు సాధించాలి. తర్వాత ఇంటర్యూకి ఎంపిక చేస్తారు. ఈ సంఖ్యను ఐడీబీఐ నిర్ణయిస్తుంది. ఇంటర్యూకి 100 మార్కులు ఉంటాయి. ఇందులో కనీసం 50 మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు అయితే 45 సాధిస్తే సరిపోతుంది. పరీక్షలో సాధించిన మార్కులకు 3/4, ఇంటర్యూలో సాధించిన మార్కులకు 1/4 ప్రకారం కలిపి మెరిట్ లిస్టు రూపొందిస్తారు.
➳ IDBI పరీక్షా విధానం :
ఐడీబీఐ పరీక్షను అబ్జెక్టీవ్ విధానంలో నిర్వహిస్తారు. ఐడీబీఐ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక్క మార్కు చొప్పున 200 మార్కులుంటాయి. ఈ పరీక్షను 2 గంటల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. నెగిటివ్‌మార్కింగ్ విధానం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి పావుమార్కు తగ్గిస్తారు. సెక్షన్ ప్రకారం సమయ నిబంధన లేదు.
➳ సబ్జెక్టులు :
- లాజికల్ రీజనింగ్
- డేటాఅనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రేటేషన్
- ఇంగ్లిష్ లాంగ్వేజ్
- క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్
- జనరల్ / ఎకానమీ /బ్యాంకింగ్ అవేర్‌నెస్
➳ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు అంటే ఏమిటీ ?
మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్, బెంగళూర్‌లో పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడిబీఎఫ్) కోర్సు పూర్తి చేయాలి. ఏడాది కోర్సు ఉన్న దీనిలో 6 నెలల తరగతి గది శిక్షణ, 2 నెలల ఇంటర్న్‌షిప్, 4 నెలల ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటాయి. చదువు, వసతి, భోజనం అన్నీ కలిపి మొత్తం ఫీజు 3 లక్షలు, దీనికి జీఎస్‌టీ అదనం. అవసరమైన అభ్యర్థులకు ఐడీబీఐ రుణం మంజూరు చేస్తుంది. విధుల్లో చేరిన తర్వాత నెలసరి వాయిదాల్లో చెల్లించుకోవచ్చు. మూడేళ్ల సర్సీన పూర్తి చేసుకొని విధుల్లో కొనసాగితే అప్పటి నుండి వరుసగా ఐదేళ్లపాటు సమాన మొత్తంలో ఫీజు వెనక్కీ ఇచ్చేస్తారు. ఉద్యోగంలో చేరిన వారు మూడేళ్లపాటు కొనసాగడం తప్పనిసరి. ఇందుకోంస ఒప్పంద పత్రాన్ని సమర్పించాలి. ఈ వ్యవధిలోపు వైదొలిగితే 2 లక్షలతో పాటు రుణం తీసుకుంటే అప్పటికి చెల్లించాల్సిన కోర్సు ఫీజు మొత్తాన్ని వడ్డీతో సహా కలిపి చెల్లించాల్సి ఉంటుంది.
➳ ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తు చివరి తేది.30 సెప్టెంబర్ 2023
- పరీక్ష తేది. 20 అక్టోబర్ 2023
➳ ఆన్‌లైన్ ధరఖాస్తు చేసుకోవడం ఎలా ?
అర్హులైన అభ్యర్థులు ఐడీబీఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ధరఖాస్తులు సమర్పించాలి. పరీక్ష ఫీజు కూడా ఆన్‌లైన్‌లో చెల్లించాలి. అభ్యర్థులు ఫోన్ నెంబర్ మరియు ఈ మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రర్ చేసుకున్న తర్వాత మీకు ఒక ప్రత్యేకమైన లాగిన్ ఐడి మరియు పాస్‌వర్డ్ అందించబడతాయి. అభ్యర్థులు ఐడీబీఐ అధికాక వెబ్‌సైట్‌లోకి వెళ్లికుండా ఇక్కడ మేము ధరఖాస్తు లింకు అందించాము. ఐడీబీఐ 2023 కోసం ధరఖాస్తు చేసుకోవడానికి క్రింది లింక్‌పై క్లిక్ చేయండి. ఆన్‌లైన్ చేసే సమయంలో పాస్‌పోర్టు సైజు ఫోటో, సంతకం, ఎడమ బొటనవ్రేలి ముద్ర, చేతివ్రాత డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది.
కెటగిరి | జాబ్స్ |
నిర్వహించు సంస్థ | ఐడీబీఐ |
పోస్టు పేరు | జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ |
దేశం | ఇండియా |
మొత్తం ఉద్యోగాలు | 600 |
ఎక్కడ | దేశవ్యాప్తంగా |
ధరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
పరీక్ష విధానం | ఆన్‌లైన్ |
ఎంపిక ప్రక్రియ | పరీక్ష మరియు ఇంటర్యూ |
విద్యార్హత | ఏదేని డిగ్రీ |
వయోపరిమితి | 20 నుండి 25 సంవత్సరాలు |
ఆన్‌లైన్ ధరఖాస్తు ముగింపు | 30 సెప్టెంబర్ 2023 |
పరీక్ష తేది | 20 అక్టోబర్ 2023 |
పూర్తి సమాచారం కొరకు | Click Here |
ఆన్‌లైన్ ధరఖాస్తుల కొరకు | Click Here |
Related Posts
1) Nabard Assistant Manager Jobs
3) SBI PO jobs
0 Comments