AICTE-Saksham Scholarship Scheme in Telugu || దివ్యాంగులకు ఏఐసీటీఈ సాక్షమ్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ || Scholarships in Telugu

AICTE-Saksham Scholarship Scheme in Telugu

దివ్యాంగులకు ఏఐసీటీఈ సాక్షమ్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌
Scholarships in Telugu 

AICTE-Saksham Scholarship Scheme

ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యూకేషన్‌ (ఏఐసీటిఈ) సాక్షమ్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ ద్వారా దివ్యాంగ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ అందించేందుకు ప్రకటన విడుదల చేసింది. దివ్యాంగులకు టెక్నికల్‌ ఎడ్యూకేషన్‌పై ఆసక్తిని కల్గించి వారిని ఉన్నత విద్యలో ప్రోత్సహించేందుకు ఈ స్కీమ్‌ను ఉద్దేశించారు. దీని ద్వారా కనీసం 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు డిప్లొమా, డిగ్రీ కేటగిరీల్లో స్కాలర్‌షిప్‌లు ఇస్తారు. అభ్యర్థులు 10వ / ఇంటర్‌ పూర్తి చేసిన రెండేళ్లలోపు ఏఐసిటీఈ గుర్తింపు పొందిన సంస్థలలో డిప్లొమా / డిగ్రీ లో ప్రవేశం కల్గి ఉండాలి. కుటుంబ వార్షికాదాయం 8 లక్షలకు మించరాదు. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 


➺ అర్హత :

డిప్లొమా కేటగిరీకి ధరఖాస్తు చేసుకోవాలంటే 

  • గుర్తింపు పొందిన పాఠశాల నుండి 10వ / ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించాలి. 
  • ఈ విద్యా సంవత్సరానికి 3 సంవత్సరాలు గల టెక్నికల్‌ డిప్లొమా లెవెల్‌ కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. 
  • ఐటీఐ కోర్సు పూర్తి చేసి లేటరల్‌ ఎంట్రీ ద్వారా డిప్లొమా ద్వితీయ సంవత్సరంలో చేరిన వారు కూడా అర్హులు. 


డిగ్రీ  కేటగిరీకి ధరఖాస్తు చేసుకోవాలంటే 

  • గుర్తింపు పొందిన బోర్డు  నుండి ఇంటర్‌ / 12వ / తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. 
  • 4 సంవత్సరాల టెక్నికల్‌ డిగ్రీ కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. 
  • డిప్లొమా పూర్తిచేసి లేటరల్‌ ఎంట్రీ ద్వారా డిగ్రీ రెండో సంవత్సరంలో ప్రవేశ పొందిన వారు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు 


➺ ఎవరు అర్హులు కాదు :

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఇతర మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు పొందుతున్నవారు 
  • పీఎంఎస్‌ఎస్‌ఎస్‌ స్కీం ద్వారా చదువుతున్నవారు 
  • నాన్‌ టెక్నికల్‌ కోర్సులలో చేరినవారు 
  • డ్యూయెల్‌ డిగ్రీ / పీజీ కోర్సులలో ప్రవేశం పొందిన వారు 
  • ఇతరత్రా స్లయిఫండ్‌ ఆదాయం పొందుతున్నవారు ధరఖాస్తు చేసుకోవడానికి వీలులేదు. 


➺ స్కాలర్‌షిప్‌ మొత్తం :

  • ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి రూ॥50,000/- చెల్లిస్తారు. 
  • డిప్లొమా అభ్యర్థులకు 3 సంవత్సరాలు, డిగ్రీ అభ్యర్థులకు 4 సంవత్సరాలు స్కాలర్‌షిప్‌ అందజేస్తారు. 
  • లేటరల్‌ ఎంట్రీకైతే డిప్లొమా అభ్యర్థులకు 2 సంవత్సరాలు, డిగ్రీ అభ్యర్థులకు 3 సంవత్సరాల పాటు స్కాలర్‌షిప్‌ అందజేస్తారు. 


➺ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 


➺ ఆన్‌లైన్‌ ధరఖాస్తుకు చివరి తేది :

  • 31 డిసెంబర్‌ 2023


➺ ధరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన ధృవీకరణ పత్రాలు :

  • ఐటీఐ / పదో తరగతి / ఇంటర్‌ / డిప్లొమా సర్టిఫికేట్‌లు, మార్కుల పత్రాలు, స్టడీ / బోనఫైడ్‌ సర్టిఫికేట్‌ 
  • ఆదాయ ధృవీకరణ పత్రం, రెన్యూవల్‌కు అయితే ప్రమోషన్‌ సర్టిఫికేట్‌ 


➺ ఆన్‌లైన్‌ ధరఖాస్తుల కొరకు :

Click Here


Related Posts : 

1) PM Scholarship Scheme



Post a Comment

0 Comments