
నోబెల్ బహుమతులు - 2023
Who are the 2023 Nobel Prize winners ?
Gk in Telugu || General Knowledge in Telugu
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk in Telugu (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే ప్రశ్నలు పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
నోబెల్ బహుమతి ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా విశేష కృషి కనబర్చిన వారికి అందించే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం. ఇది ప్రపంచంలో అందించే అత్యుత్తమ పురస్కారం. ఈ నోబెల్ బహుమతిని 1901 సంవత్సరం నుండి ఆల్ప్రేడ్ బెర్నార్డ్ నోబెల్ జ్ఞాపకార్థం ఇస్తున్నారు. ఈ అవార్డును ప్రతి సంవత్సరం నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10న నార్వే రాజధాని ఓస్లోలో ప్రధానం చేస్తారు. ఈ నోబెల్ అవార్డును 1) సాహిత్యం 2) శాంతి 3) రసాయన శాస్త్రం 4) వైద్య శాస్త్రం 5) భౌతిక 6) ఆర్థిక శాస్త్రం వంటి 6 రంగాలలో విశేష ప్రతిభ కనబర్చిన వారికి బహుకరిస్తారు.
Also Read : Gk Questions in Telugu
2023 సంవత్సరానికి గాను ప్రకటించిన సాహిత్యం, శాంతి, రసాయన శాస్త్రం, వైద్యం శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రాలలో మొత్తం 11 మంది అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. ఇందులో అమెరికాకు చెందిన 6 మంది వ్యక్తులు అవార్డుకు ఎంపికయ్యారు. మొత్తం 6 రంగాలలో ఇచ్చే ఈ అవార్డుకు హంగేరీ, అమెరికా, జర్మనీ, స్వీడన్, నార్వే, ఇరాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఎంపికయ్యారు. వైద్య శాస్త్రంలో ఇద్దరికి, భౌతిక, రసాయన శాస్త్రాలలో ముగ్గురికి, సాహిత్యం, శాంతి, ఆర్థిక శాస్త్రాలలో ఒక్కొక్కరి చొప్పున అవార్డు లభించింది. వీరందరికి డిసెంబర్ 10వ తేదీన జరిగే కార్యక్రమంలో అవార్డు ప్రధానం చేస్తారు. ఈ అవార్డు ఎంపికైన వారు నోబెల్ పురస్కారంతో పాటు 11 మిలియన్ల క్రోనర్లు బహుమతిగా స్వీకరిస్తారు.
➠ నోబెల్ బహుమతి అందించే 6 రంగాలు
- వైద్యశాస్త్రం
- భౌతిక శాస్త్రం
- రసాయన శాస్త్రం
- సాహిత్యం
- శాంతి
- ఆర్థిక శాస్త్రం
నోబెల్ ప్రైజ్ - 2023 విన్నర్స్
➺ వైద్య శాస్త్రం :
1) కాటరిన్ కరికో (హంగేరి)
2) డ్రూ వీజ్‌మన్ (అమెరికా)
వీరిద్దరు న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లలో చేసిన కృషికి మరియు కోవిడ్ మహమ్మారి ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ల తయారిలో విశేష ప్రతిభ కనబర్చినందుకు వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. వీరు కోవిడ్ -19 నియంత్రణ కోసం ఎంఆర్‌ఎన్‌ఏ (మెసెంజర్ రైబోన్యూక్లియిక్ యాసిడ్) వ్యాక్సిన్ల అభివృద్దికి కృషి చేశారు. వీరిద్దరు చేసిన నూతన ఆవిష్కరణలు ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల అభివృద్దికి దోహదపడ్డాయి.
➺ భౌతిక శాస్త్రం :
1) పియరీ అగోస్తిని (అమెరికా)
2) ఫెరెన్స్ క్రౌజ్ (జర్మనీ)
3) అన్నె ఎల్ హ్యూలియర్ (స్వీడన్)
అనే ముగ్గురికి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. ఈ ముగ్గురు పదార్థంలోని ఎలక్ట్రాన్ డైనమిక్స్‌లను అధ్యయనం చేసేందుకు ఆటో సెకెండ్ పల్స్‌ను ఉత్పత్తి చేసే ప్రయోగాలను చేసినందుకు గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డు లభించింది. వీరు ముగ్గురు అణువులు, పరమాణువుల్లో ఎలక్ట్రాన్ల డైనమిక్స్‌ను అధ్యయనం చేయడంతో పాటు కాంతికి సంబంధించిన అట్టోసెకను పల్స్‌లను గుర్తించే విధానాలను అభివృద్ది చేసినందుకు గాను ఈ అవార్డు లభించింది. నోబెల్ బహుమతి పొందిన 5వ మహిళగా అన్నె ఎల్ హ్యూలియర్ పేరుగాంచింది.
➺ రసాయన శాస్త్రం:
1) మౌంగి జి.బావెండి (అమెరికా)
2) లూయిస్ బ్రూస్ (అమెరికా)
3) అలెక్సీ ఐ.ఎకిమోవ్ (అమెరికా)
అనే ముగ్గురు వ్యక్తులకు రసాయన శాస్త్రంలో అవార్డు అందుకున్నారు. వీరు నానోటెక్నాలజీకి సంబందించిన క్వాంటమ్ డాట్స్ లో చేసిన పరిశోధనలకు గాను రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. వీరు క్వాంటమ్ డాట్స్ విశ్లేషణ, ఆవిష్కరణలో, నానో పార్టికల్స్ అభివృద్దిలో ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కీలకపాత్ర పోషించారు.
➺ సాహిత్యం :
జాన్ ఫోసె (నార్వే) కు సాహిత్యంలో నోబెల్ బహుమతి వరించింది. ఇతను మాటల్లో చెప్పలేని ఎన్నో అంశాలను వినూత్న నాటకాలు, గద్యాల ద్వారా తెలియజేసినందుకు గాను సాహిత్యంలో అవార్డు లభించింది. బయటకు చెప్పుకోలేని ఎన్నో అంశాలకు తన నవలలు, నాటకాలు, చిన్న పిల్లల పుస్తకాల ద్వారా గళంగా నిలించినందుకు గాను ఈ పురస్కారం లభించింది.
➺ శాంతి :
నర్గిస్ మొహమ్మది (ఇరాన్) అనే మహిళకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇరాన్ దేశంలోని మహిళల యొక్క హక్కులు, వారి స్వేచ్ఛపై చేసిన పోరాటానికి గాను నోబెల్ శాంతి బహుమతి లభించింది. నర్గిస్ మొహమ్మది ఇరాన్‌లోని మహిళల అణచివేత, మానవహక్కులపై అవగాహన, అందరికి స్వేచ్ఛ, మరణ శిక్ష రద్దు కోసం అలుపెరగని పోరాటం చేసినందుకు గాను ఈ పురస్కారం లభించింది.
➺ ఆర్థిక శాస్త్రం :
క్లాడియా గోల్డిన్ (అమెరికా) కు ఆర్థిక శాస్త్రం నోబెల్ బహుమతి లభించింది. లేబర్ మార్కెట్‌లో మహిళలు ప్రాతినిద్య వహించడం వల్ల కలిగే ఫలితాలపై అధ్యయం చేసినందుకు గాను క్లాడియా గోల్డిన్‌కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది. శ్రామిక రంగంలో లైంగిక అంతరాలపై అవగాహన మరింతగాపెంచే దిశగా చేసిన సమగ్ర అధ్యయనాలకు గాను ఈ పురస్కారం లభించింది. అర్థశాస్త్రంలో ఇప్పటిదాకా నోబెల్ అందుకున్న 93 మందిలో క్లాడియా గోల్డిన్ 3వ మహిళగా గుర్తింపు సాధించింది.
నోబెల్ అవార్డు 2023 పొందిన వారు | |
---|---|
వైద్య శాస్త్రం | 1) కాటరిన్ కరికో (హంగేరి) 2) డ్రూ వీజ్‌మన్ (అమెరికా) |
భౌతిక శాస్త్రం | 1) పియరీ అగోస్తిని (అమెరికా) 2) ఫెరెన్స్ క్రౌజ్ (జర్మనీ) 3) అన్నె ఎల్ హ్యూలియర్ (స్వీడన్) |
రసాయన శాస్త్రం | 1) మౌంగి జి.బావెండి (అమెరికా) 2) లూయిస్ బ్రూస్ (అమెరికా) 3) అలెక్సీ ఐ.ఎకిమోవ్ (అమెరికా |
సాహిత్యం | జాన్ ఫోసె (నార్వే) |
శాంతి | నర్గిస్ మొహమ్మది (ఇరాన్) |
ఆర్థిక శాస్త్రం | క్లాడియా గోల్డిన్ (అమెరికా) |
జవాబు : మొత్తం 6 రంగాలలో నోబెల్ బహుమతి అందజేస్తారు.
జవాబు : పియరీ అగోస్తిని (అమెరికా), ఫెరెన్స్ క్రౌజ్ (జర్మనీ), అన్నె ఎల్ హ్యూలియర్ (స్వీడన్) ముగ్గురు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు.
జవాబు : ఆల్ప్రేడ్ బెర్నార్డ్ నోబెల్ జ్ఞాపకార్థం
జవాబు : జవాబు : 11 మిలియన్ల క్రోనర్లు-
జవాబు : నర్గిస్ మొహమ్మది (ఇరాన్)
0 Comments