Alluri Seetha Rama Raju in Telugu || అల్లూరి సీతారామరాజు || History in Telugu || Biography in Telugu

 అల్లూరి సీతారామరాజు 

     Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk  Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

అల్లూరి సీతారామరాజు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, విశాఖపట్టణం జిల్లా, పండ్రంగి గ్రామంలో 04 జూలై 1897 రోజున వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించాడు. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రామరాజు తండ్రి ఫోటోగ్రాఫర్‌గా పనిచేసేవాడు. సీతారామరాజు పాఠశాలలో చదువుతున్న సమయంలోనే తండ్రి మరణించడంతో మేనమామ రామచంద్రరాజు దగ్గర పెరిగాడు. 

1882 సంవత్సరంలో మద్రాసు అటవీ చట్టం అమలు చేయడంతో ఆ చట్టం గిరిజనులను అడవులలో స్వేచ్ఛగా తిరగటాన్ని నిషేదించింది. అటవీ గిరిజన ప్రజలు సాంప్రదాయంగా పోడు వ్యవసాయం చేసుకుంటూ, అటవీ ఉత్పత్తులను సేకరించి వాటిని అమ్ముకొని జీవించే గిరిజనులపై  బ్రిటీషువారు ఘోరమైన దురాగతాలు చేయడంతో గిరిజనులు దుర్భర జీవితం గడపాల్సి వచ్చింది. తూర్పుగోదావరి, విశాఖపట్టణం జిల్లాల సరిహద్దు ప్రాంతాలలో సీతారామరాజు గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. బెంగాలీ విప్లవకారుల దేశభక్తితో సూర్తిపొంది చింతపల్లి, రంపచోడవరం, దమ్మనపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల, నర్సిపట్నం, అన్నవరం వంటి ప్రాంతాలలో పోలీసుస్టేషన్లపై సీతారామరాజు దాడులు చేసి అనుచరులకు కావాల్సిన తుపాకులు, మందుగుండు సామాగ్రిని సమకూర్చుకునేవాడు. దమ్మనపల్లి ఘాట్‌ వద్ద స్కాట్‌ కవార్డ్‌తో సహ అనేక  బ్రిటిషు సైనికులను తిరుగుబాటుదారులు చంపేశారు.


Also Read :

    1922 లో సాండర్స్‌ నాయకత్వంలో అస్సారైఫిల్స్‌ కంపెనీని బ్రిటిషు ప్రభుత్వం పంపించింది. వీళ్లు పెగడపల్లి వద్ద మకాం వేశారు. అసమయానికి రహస్య జీవితం గడుపుతున్న సీతారామరాజు నాలుగు నెలల తర్వాత మళ్లీ వెలుగులోకి వచ్చాడు. మల్లుదొర, గంటం దొర వంటి గిరిజనుల నాయకత్వంలో గిరిజన దళాలను ఏర్పరచి విల్లు, బాణాలతో పోరాటాన్ని కొనసాగించాడు. 

గిరిజనుల హక్కుల కొరకు బ్రిటిషు ప్రభుత్వంపై సీతారామరాజు చేస్తున్న తిరుగుబాటు చర్యలను అణగదొక్కడానికి సీతారామరాజును వెతకడం ప్రారంభించింది. చివరకు మంప గ్రామం, కొయ్యురు వద్ద  తేది.07-05-1924 రోజున బ్రిటిషు సైన్యం చుట్టుముట్టి తుపాకులతో కాల్చి చంపారు.  కృష్ణదేవిపేటలో సీతారామరాజు సమాధి ఉంది. 

అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని బలంగా నమ్మిన వ్యక్తి. నిరుపేదలు, నిరక్షరాస్యులు, అమాయకులు అయిన అనుచరులతో చాలా తక్కువ యుద్ద పరికరాలతో బిట్రీషు సామ్రాజ్యాన్యాన్ని ఢీకొట్టి ముచ్చెమటలు పట్టించి వీరమరణం పొందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు.

Post a Comment

0 Comments