
భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ
India Polity Gk in Telugu || Election in India Telugu
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
ప్రపంచంలో అత్యధిక జనాభా కల్గిన దేశం భారతదేశం. భారతదేశంలో సుమారు 140 కోట్లకు పైగా జనాభా నివసిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికలను నిర్వహించడం కత్తిమీద సాము లాంటింది. ఇలాంటి అత్యధిక ఓటర్లు కల్గిన భారతదేశంలో ఎన్నికలను నిర్వహించడానికి భారత ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. భారత ఎన్నికల సంఘాన్ని 25 జనవరి 1950న ఏర్పాటు చేశారు. ఇది ఒక స్వయంప్రతిపత్తి కల్గిన రాజ్యాంగ సంస్థ. ఇది భారతదేశంలో ఎన్నికలను నిర్వహిస్తుంది. భారత ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల కోసం ‘ఎన్నికల నియామవళి’ ని రూపొందిస్తుంది. ఎన్నికలు నిర్వహించి ఫలితాలను ప్రకటించి కేంద్ర / రాష్ట్రాలకు అప్పగిస్తుంది. ఈ విధానం ద్వారా కేంద్ర / రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
భారత ఎన్నికల సంఘం దేశంలోని ఓటర్ల జాబితాను రూపొందించి లోక్‌సభ, రాజ్యసభ, అసెంబ్లీ, రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికలను నిర్వహిస్తుంది. కేంద్ర ఎన్నిల సంఘ నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బంది లేరు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(6) ప్రకారం కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల నిర్వహణ కోసం ఉపయోగించుకుంటుంది.
5 సంవత్సరాలకు ఒకసారి దేశం లేదా రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్నికలను ‘సాధారణ ఎన్నికలు’ అంటారు. ఒకటి లేదా కొన్ని ఖాళీలకు నిర్వహించే ఎన్నికలను ‘ఉప ఎన్నికలు’ అంటారు. 5 సంవత్సరాల పూర్తి కాలం గడవకముందే అసెంబ్లీ / పార్లమెంట్‌కు ఎన్నికలు నిర్వహిస్తే ‘మధ్యంతర ఎన్నికలు’ అంటారు.
➺ ప్రధాన ఎన్నికల అధికారి :
ప్రధాన ఎన్నికల అధికారి భారత ఎన్నికల సంఘానికి అధిపతిగా వ్యవహరిస్తారు. కేంద్ర, రాష్ట్రాలలో ఎన్నికలను సజావుగా, నిస్పక్షపాతంగా నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటాడు. ప్రధాన ఎన్నికల అధికారి యొక్క పదవి కాలం 6 సంవత్సరాలు ఉంటుంది. 65 సంవత్సరాలు వచ్చేంత వరకు పదవిలో కొనసాగుతాడు. రాజ్యాంగంలోని 15వ భాగంలోని ఆర్టికల్ 324 నుండి 329 వరకు ఎన్నికల సంఘం యొక్క నిర్మాణం, అధికార విధులు నిర్వహించబడ్డాయి.
➺ ప్రధాన ఎన్నికల అధికారి విధులు :
- ఓటర్ల జాబితాను రూపొందించడం
- నియోజకవర్గ భౌగోళిక పరిధిని నిర్ణయించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం
- ఎన్నికల నోటిఫికేషన్‌తో పాటు నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పోలింగ్ తేదీలు ఖరారు, పర్యవేక్షణ, రాజకీయ పార్టీల గుర్తింపు, గుర్తులను కేటాయింపు, ఎన్నికల నియమావళి రూపొందించడం
➺ ఓటు హక్కు :
ఎన్నికల కమీషన్ నియమావళి ప్రకారం ఎన్నికలు జరిగే సంవత్సరంలో జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన కుల, జాతి, మత, లింగ, భాషా పరమైన భేదాలు లేకుండా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. దీనినే ‘సార్వజనీన ఓటు హక్కు’ అంటారు. ఓటర్లందరిని కలిపి ‘ఎలక్టోరేట్’ అని పిలుస్తారు.
➺ రాజకీయ పార్టీలు :
భారతదేశంలో ఎన్నికల కమీషన్‌లో రిజిస్ట్రర్ చేయిస్తే ఓ రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తుంది. ఎన్నికలలో పొందిన ఓట్ల శాతాన్ని బట్టి ప్రాంతీయ, జాతీయ పార్టీలుగా గుర్తింపునిస్తుంది. ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో 3శాతం ఓట్లు లేదా 3 శాసనసభ స్థానాలు పొందితే ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తుంది. అలాగే సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాలలో పోలైన ఓట్లలో 6% పొందిన ఓట్లు లేదా 4 వేర్వేరు రాష్ట్రాలలో 11 లోక్‌సభ సీట్లు సాధిస్తే అది జాతీయ పార్టీగా గుర్తింపు సాధిస్తుంది.
Also Read :
➺ ఎన్నికల ప్రవర్తనా నియమావళి - అంశాలు :
- పార్టీలు, అభ్యర్థులు, జాతీ, కుల, మత, ప్రాంతీయ పరమైన విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయరాదు.
- ప్రార్థనా స్థలాలలో ప్రచారం నిర్వహించరాదు
- ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలు చేపట్టవద్దు
- ఒకరికి బదులు మరొకరు ఓటు వేయరాదు
- పోలింగ్ స్టేషన్‌కు 100 మీటర్ల పరిధిలో ప్రచారం చేయరాదు.
- ఓటర్లను పోలీస్‌స్టేషన్‌కు తీసుకురావడం, తీసుకెళ్లడం నిషిద్దం.
- అనుమతి లేకుండా బ్యానర్లు, జెండాలు, పోస్టుర్లు అతికించరాదు.
➺ ఎన్నికల సమయంలో అధికార పార్టీకి ఏయే అధికారాలు ఉంటాయి ?
అధికారంలో ఉన్న పార్టీ తమ యొక్క అధికారాన్ని వినియోగించుకొని ఓటర్లను ప్రభావితం చేయవచ్చు అనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం కొన్ని నియమాలను విధించింది. అవి..- అధికార పార్టీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడరాదు. పార్టీ పనులకు పాలనయంత్రాంగాన్ని వాడరాదు.
- అధికార పర్యటనలు, పార్టీ ప్రచార పర్యటనలు రెండు ఒకే సమయంలో చేయరాదు.
- ప్రభుత్వ వాహనాలు వినియోగించరాదు.
- సెక్యూరిటి వాహనాలు మూడు కంటే ఎక్కువగా ఉండేవాటిని ఎన్నికల ఖర్చు కింద జమకట్టాలి.
- ప్రభుత్వ సంబంధిత కార్యాలయాలను ప్రచారానికి వినియోగించరాదు.
- పత్రికల్లో, టీవీల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి ప్రకటనలు ఇవ్వరాదు.
- ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఎటువంటి గ్రాంట్లు, చెల్లింపులు చేయరాదు. కొత్త పథకాలు, శంకుస్థాపనలు చేయరాదు, హామి ఇవ్వరాదు.
➺ ఎన్నికల నిర్వహణ :
భారత ఎన్నికల అధికారికి సహయం చేయడానికి రాష్ట్ర ఎన్నికల అధికారి ఉంటారు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి రాష్ట్ర ఎన్నికల అధికారిని నియమిస్తుంది. ఈ పదవికి రాజ్యాంగ ప్రతిపత్తి లేదు. రాష్ట్రంలో జరిగే పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల అధికారి పర్యవేక్షణలో జరుగుతాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్ ముఖ్య ఎన్నికల అధికారి బాద్యతలు స్వీకరిస్తారు.
➺ రిటర్నింగ్ అధికారి :
ప్రతి నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించడానికి, పర్యవేక్షించడానికి ఒక అధికారిని నియమిస్తారు. ఈ అధికారనే ‘రిటర్నింగ్ అధికారి’ అంటారు. ఓటర్ల జాబితాలో పేరు కల్గి ఉండి ఎన్నిక కావడానికి తగిన అర్హలున్న అభ్యర్థులు ‘‘నామ ప్రతిపాదన పత్రాలను’’ (నామినేషన్ పేపర్స్) ‘రిటర్నింగ్’ అధికారికి సమర్పిస్తారు. ఈ ఎన్నికల పత్రాలపై వారి అభ్యర్థిత్వాన్ని ఓటర్ల జాబితాలో పేరున్న వ్యక్తులు ప్రతిపాదిస్తూ, బలపరుస్తూ సంతకాలు చేయాలి. గుర్తింపు పొందిన పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులను ఆయా పార్టీల అభ్యర్థులంటారు. మిగతా వారిని స్వతంత్ర అభ్యర్థులని పిలుస్తారు.
➺ రిటర్నింగ్ అధికారి విధులు :
- నామినేషన్ పత్రాల పరిశీలన
- ఉపసంహరించుకునే అవకాశం కల్పించడం
- పోటీచేసే అభ్యర్థుల తుదిజాబితా ప్రకటించడం
- స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను కేటాయించడం
- ఈ.వి.యం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్) లను సిద్దం చేయడం
➺ ఓటింగ్ విధానం :
జిల్లా ఎన్నికల అధికారులు పోలీస్‌స్టేషన్‌లను ఏర్పాటు చేసి అందులో విధులు నిర్వహించడానికి ‘ప్రిసైడిరగ్ అధికారి’ ని నియమిస్తారు. ఇతనికి సహాయంగా మరికొంతమందిని నియమిస్తారు. ఓటుహక్కు వినియోగించుకునేవారు ఎడమచేతి చూపుడు వేలిపై చెరిగిపోని (ఇండెలిబుల్) సిరాగుర్తు పెడతారు. ఈ.వి.యంలు కాకుండా బ్యాలెట్ డబ్బాలను వాడితే స్వస్తిక్ గుర్తువేసి మడిచి బ్యాలేట్ బ్యాక్స్‌లో వేస్తారు. పోలీంగ్ పూర్తి అయిన తర్వాత ఈవియం/బ్యాలెట్ పెట్టేలకు సీలు వేసి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలిస్తారు. అక్కడ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు. వారికి ఎన్నికల సంఘం ధృవీకరణ పత్రం అందజేస్తుంది.
➺ తిరస్కరించే ఓటు (నోటా) :
పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లివర్టీస్ కేసు 2013 లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా నోటాను ఆచరణలోకి తీసుకొనివచ్చారు. నోటా అనేది కేవలం ఓటరుకున్న ఐచ్చిక ఓటు మాత్రమే. ఇది అభ్యర్థి యొక్క గెలుపు/ఓటములను ప్రభావితం చేయదు. ఒకవేళ నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే తర్వాత అధికంగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటిస్తారు.
➺ పోస్టల్ బ్యాలెట్ :
ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు ఎక్కడెక్కడో విధులు నిర్వహిస్తుంటారు కాబట్టి వారు తాము ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండదు. అటువంటి సందర్భంలో ఎన్నికల్లో పాల్గోనే అధికారులు ‘పోస్టల్ బ్యాలెట్’ ద్వారా ఓటు వేసే అవకాశం ఉంది. దీనిని ఎన్నికల తేది కంటే ముందే వినియోగిస్తారు.
0 Comments