Free Bus Travel Scheme (Mahalaxmi) For Women Scheme in Telugu || మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకం || Telangana Gk in Telugu

 ‘మహాలక్ష్మి’ మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకం 
Telangana Schemes in Telugu || Gk in Telugu 

     Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk  Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

     తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు ‘మహాలక్ష్మి’ పథకం ప్రారంభించింది. ‘మహాలక్ష్మి’ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌ రెడ్డి గారి చేతులమీదుగా తేది.09-12-2023 రోజున ప్రారంభించడం జరిగింది. ఈ పథకానికి కేవలం మహిళలు మాత్రమే అర్హులు.  ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా తెలంగాణలోని స్థానిక మహిళలు, విద్యార్థినులు మరియు ట్రాన్స్‌జెండర్లు టిఎస్‌ఆర్టీసీ కి చెందిన పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సీటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో ఉచితంగానే ప్రయాణం చేయవచ్చు. ఈ పథకం కింద మహిళలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుండి ఎక్కడికైనా ఉచితంగానే ప్రయాణం చేయవచ్చు. మహిళలు ప్రయాణించే సమయంలో జీరో టికెట్‌ ఇవ్వడం జరుగుతుంది. 


➺ ‘మహాలక్ష్మి’ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యానికి ఎవరు అర్హులు 

తెలంగాణ రాష్ట్రానికి చెందిన 

  • మహిళలు
  • విద్యార్థినులు 
  • ట్రాన్స్‌జెండర్‌లు 


➺ ఏయే బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు :

టిఎస్‌ఆర్టీసీకి చెందిన 

  • పల్లెవెలుగు 
  • ఎక్స్‌ప్రెస్‌ 
  • సిటీ ఆర్డినరీ 
  • సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ 


➺ ఏయే ప్రాంతాలలో ప్రయాణించవచ్చు :

  • తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న ఏ ప్రాంతానికైన ప్రయాణించవచ్చు. 
  • ఒకవేళ ఇంటర్‌ స్టేట్‌ బస్సులో వెళ్లినట్లయితే తెలంగాణ సరిహద్దు దాటిన తర్వాత వెళ్లే ప్రయాణినికి చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. 


➺ ధృవీకరణ పత్రాలు ఏం కావాలి :

  • తెలంగాణ నివాసి అని ధృవీకరించే ఏ ధృవీకరణ పత్రం (ఆధార్‌కార్డు, ఓటరుకార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ మొ॥లగు) అయిన చూపించాలి. 


Also Read :

Post a Comment

0 Comments