
హోంరూల్ ఉద్యమం Indian History in Telugu
వందేమాతర ఉద్యమం తర్వాత భారత జాతీయోధ్యమానికి నూతనోత్తేజం కల్గించిన ఉద్యమాలలో హోంరూల్ ఉద్యమం కీలకమైనది. దీనిని జాతీయ వాదమైన ‘‘స్వరాజ్ ’’ హోంరూల్ లక్ష్యంగా ప్రకటించడం జరిగింది. బ్రిటిష్ పాలన నుండి విముక్తి కోసం, స్వపరిపాలన సాధించడం కోసం ప్రారంభించిన గొప్ప ఉద్యమం హోంరూల్ ఉద్యమం. హోంరూల్ అంటే స్వయంపాలన అని అర్థం. బెంగాల్ విభజన అనంతరం దానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించిన అణచివేత, అకృత్యాలు విప్లవానికి దారితీసాయి. ఈ విప్లవానికి యుగాంతర్, సంధ్య, కాల్, వందేమాతరం, మరాఠీ, కేసరి అనే పత్రికలు మద్దతు ప్రకటించాయి.
బాలగంగాధర తిలక్ హోంరూల్ ఉద్యమం
హోరూంల్ ఉద్యమాన్ని మొదటగా బాల గంగాధర తిలక్ ప్రారంభించాడు. 1914 సంవత్సరంలో బాలగంగాధర తిలక్ జైలు నుండి విముక్తి లభించిన తర్వాత స్వయం స్వపరిపాలన సాధించాలని కోరుకున్నాడు. దీంతో 28 ఏప్రిల్ 1916న మహరాష్ట్రలోని పూణాలో హోంరూల్ లీగ్ ను ప్రారంభించాడు. ఈ హోంరూల్ ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా స్వీయ పరిపాలన కోసం ప్రజలను ఉత్తేజపరిచింది. తిలక్ ప్రారంభించిన హోంరూల్ ఉద్యమం బొంబాయి, సెంట్రల్ ప్రావిన్స్, కర్ణాటకలలో విస్తరించింది. ‘ స్వాతంత్రం (స్వరాజ్యం) నా జన్మహక్కు, దానిని నేను పొందుతాను ’ అని బాలగంగాధర తిలక్ ఈ ఉద్యమ సమయంలో నినాదంగా పలికాడు. ఈ ఉద్యమ కాలంలోనే బాలగంగాధర తిలక్‌కు ‘లోకమాన్య’ బిరుదు లభించింది.
Also Read :
అనిబిసెంట్ హోంరూల్ ఉద్యమం
అనిబిసెంట్ మదనపల్లిలో జాతీయ కళాశాలను, బెనారస్‌లో హిందూ పాఠశాలను స్థాపించింది. తర్వాత కాలంలో ఈ పాఠశాలను బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా మార్చడం జరిగింది. అనిబిసెంట్ యొక్క దత్తత కుమారుడు జిడ్డు కృష్ణ మూర్తి ‘గురువు లేకుండా సత్యము సాధించడం’ అనే సిద్దాంతాన్ని నమ్మేవాడు. కృష్ణమూర్తి 'ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్' అనే పుస్తకాన్ని రచించాడు.
సెప్టెంబర్ 1916లో మద్రాస్ ప్రాంతంలో అనిబిసెంట్ హోంరూల్ లీగ్ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థకు అనిబిసెంట్ అధ్యక్షురాలిగా, రామస్వామి అయ్యర్ జనరల్ సెక్రటరీగా, బిపి వాడి కోశాధికారి నియమితులయ్యారు. 1918లో వాడియా మద్రాసు లేబర్ యూనియన్‌ను స్థాపించాడు. ఇది దేశంలో మొదటి ట్రేడ్ యూనియన్. ఈ ఉద్యమం బొంబాయి, కర్ణాటక, సెంట్రల్ ప్రావిన్సులలో విస్తరించింది. ఆంధ్రాలో జరిగిన హోంరూల్ ఉద్యమానికి గాడిచర్ల హరసర్వోత్తమరావు నాయకత్వం వహించాడు.
1916 అక్టోబర్ నాటికి దేశవ్యాప్తంగా 500లకు పైగా హోంరూల్ శాఖలు ఏర్పడ్డాయి. అనిబిసెంట్ కామన్ వీల్, న్యూ ఇండియా అనే పత్రికలను నడిపి, అనేక వ్యాసాలను అందులో ప్రచురించి భారతీయులను ఉత్తేజ పరిచారు. దీంతో వీరిద్దరిని అరెస్టు చేసి ఈ రెండు పత్రికలను నిషేదించారు.
అనిబిసెంట్ నిస్వార్థ సేవలకు గుర్తింపుగా 1917లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, భూలాబాయ్ దేశాయి, చిత్తరంజన్ దాస్, మదన్‌మోహన్ మాలవ్య, లాలా లజపతిరాయ్ వంటి నాయకులు హోంరూల్ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.
➺ హోంరూల్ లీగ్ ముగింపుకు కారణం :
హోంరూల్ లీగ్ ఆగిపోవడానికి ప్రధాన కారణం భారత రాజ్య కార్యదర్శి అయిన ఎడ్విన్ మాంటేగు 20 అగస్టు 1917 రోజున చేసిన ప్రకటన. ఈ ప్రకటనలో 1) స్వయం పాలన, 2) బాద్యతాయుత పాలన రెండు హామీలు ఇవ్వడం జరిగింది. దీంతో హోంరూల్ లీగ్ ఆగిపోయింది. ఈ ప్రకటన తర్వాత సురేంద్రనాథ్‌బెనర్జీ ‘ఇండియన్ లిబరల్ ఫెడరేషన్’ ను స్థాపించడం జరిగింది.
➺ 1916 కాంగ్రెస్ లక్నో సమావేశం :
ఈ సమావేశానికి ఎన.సి ముజుందార్ అధ్యక్షునిగా వ్యవహరించాడు. 1907 సూరత్ కాంగ్రెస్ సమావేశంలో విడిపోయిన అతివాదులు, మితవాదులు ఈ సమావేశంలో కలిసి పోయారు. ఈ వర్గాలను కలిపిన మధ్యవర్తులు : తిలక్, అనిబిసెంట్. కాంగ్రెస్ పార్టీ, ముస్లింలీగ్ పార్టీలు లక్నో ఒప్పందం ద్వారా దగ్గరైనాయి.ఈ ఒప్పందం కుదరడానికి మధ్యవర్తులు తిలక్, అనిబిసెంట్ మహమ్మద్ ఆలీ జిన్నా. ఈ ఒప్పంద ప్రకారం రెండు పార్టీలు కలిసి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పనిచేయాలి. 1909 మింటో మార్లే సంస్కరణ చట్టం ద్వారా ఏర్పడిన ముస్లీంలకు ప్రత్యేక నియోజకవర్గాలను కాంగ్రెస్ గుర్తించింది.
0 Comments