Modern Indian History Gk Questions in Telugu | Gandhian Era Gk Questions with Answers in Telugu Part - 2 | telugutechbadi

Modern Indian History Gk Questions in Telugu

ఆధునిక భారతదేశ చరిత్ర (గాంధీయుగం) జీకే ప్రశ్నలు - జవాబులు Part - 2

Modern Indian History Gk Questions in Telugu (Gandhi Era) | Gk Quiz Test in Telugu | Gk MCQ Questions in Telugu 

☛ Question No.1
సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలు ఏవి ?
1) ప్రభుత్వ పదవులను, బిరుదుల్ని త్యజించాలి
2) ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలన్నీ, న్యాయస్థానాలను, విదేశీ వస్తువుల్ని, విదేశీ  వస్త్రాలని బహిష్కరించాలి
3) 1921లో ఇంగ్లాండ్‌ యువరాజు భారత పర్యటనను బహిష్కరించాలి
4) శాసనసభలను బహిష్కరించాలి
ఎ) 1, 2 మరియు 3
బి) 1 మరియు 2
సి) 1, 2, 3 మరియు 4
డి) 2 మరియు 3 సరైనవి

జవాబు : సి) 1, 2, 3 మరియు 4

☛ Question No.2
సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉద్యమాన్ని నడిపించిన నాయకులను జతపరచండి ?
1) బెంగాల్‌
2) పంజాబ్‌
3) మహారాష్ట్ర
4) మద్రాసు
ఎ) చిత్తరంజన్‌ దాస్‌, జేఎం సేన్‌ గుప్తా
బి) లాలాలజపతిరాయ్‌
సి) జైరామ్‌ దాస్‌ దౌలత్‌, స్వామి వివేకానంద
డి) రాజగోపాలచారి, రామస్వామి
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
సి) 1-బి, 2-ఎ, 3-డి, 4-డి
డి) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ

జవాబు : ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి

☛ Question No.3
చౌరీ చౌరా సంఘటనకు సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి ?
1) ఉత్తర ప్రదేశ్‌లోని గోరక్‌పూర్‌ జిల్లాలో ఈ గ్రామం ఉంది
2) సుమారు 30వేల మంది రైతులు, నిరసన కారులు, స్వచ్ఛందకారులు, మధ్య అమ్మకాలను, పెరిగిన ఆహార ధరలకు వ్యతిరేకంగా పెద్ద ఊరేగింపు చేయగా వారిపై పోలీసులు అకారణంగా కాల్పులు జరిపారు
3) పోలీసులు జరిపిన కాల్పుల్లో అంబికాబాయి చౌదరి మరియు భగవాన్‌ అహీర్‌ లాంటి నాయకులు తీవ్ర గాయాలు పాలు కావడంతో కోపంతో ప్రజలు అక్కడి పోలీస్‌స్టేషన్‌ పై దాడి చేసి నిప్పు అంటించగా 22 మంది పోలీసులు సజీవ దహనం అయ్యారు
ఎ) 1 మాత్రమే
బి) 2 మరియు 3
సి) 1, 2 మరియు 3
డి) 3 మాత్రమే

జవాబు : సి) 1, 2 మరియు 3

☛ Question No.4
చౌరీ చౌరా సంఘటన ఏ రోజున జరిగింది ?
ఎ) 05 ఫిబ్రవరి 1922
బి) 07 ఫిబ్రవరి 1925
సి) 09 ఏప్రిల్‌ 1933
డి) 11 మార్చి 1944 ‌

జవాబు : ఎ) 05 ఫిబ్రవరి 1922

☛ Question No.5
చౌరి చౌరా పోలీసుల సంజీవ దహానం తర్వాత గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్లుగా ఏ రోజున ప్రకటించాడు ?
ఎ) 05 ఫిబ్రవరి 1922
బి) 07 ఫిబ్రవరి 1922
సి) 09 ఫిబ్రవరి 1922
డి) 12 ఫిబ్రవరి 1922

జవాబు : డి) 12 ఫిబ్రవరి 1922

☛ Question No.6
ఈ క్రింది అంశాలలో సరైన అంశాలను గుర్తించండి ?
1) బార్ధోలిలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడాన్ని సమర్థించింది
2) సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజి ఏకపక్షంగా నిలిపివేయడాన్ని సిఆర్‌ దాస్‌, మోతిలాల్‌ నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్‌, లాలాలజపతిరాయ్‌ వంటి నాయకులు కూడా సమర్థించారు.
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) రెండూ కావు

జవాబు : ఎ) 1 మాత్రమే

☛ Question No.7
గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేసిన తర్వాత తను ఎదుర్కొన్న పరిణామాలకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి ?
1) గాంధీజ నాయకత్వంపై వచ్చిన విమర్శలను అవకాశంగా తీసుకొని 1922 మార్చి 10న ప్రభుత్వం రాజాద్రోహం కింద గాంధీజిని అరెస్టు చేసింది.
2) సిఎన్‌ బ్రూమ్‌ ఫీల్డ్‌ అనే న్యాయమూర్తి గాంధీజీకి 6 సంవత్సరాల జైలు శిక్ష విధించి పునాలోని ఎర్రవాడ జైలులో ఉంచారు
3) గాంధీజీ పూర్తి కాలపు శిక్షను అనుభవించి 05 ఫిబ్రవరి 1928న జైలు నుండి విడుదల అయ్యాడు.
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1, 2 మరియు 3
డి) 1 మరియు 2

జవాబు :డి) 1 మరియు 2




Also Read :


☛ Question No.8
గాంధీజీ రచించిన ‘ ది గ్రేట్‌ ట్రయల్‌’ అనే గ్రంథం సంబంధించి ఏ విషయం గురించి తెలుపుతుంది ?
ఎ) సహాయ నిరాకరణ ఉద్యమం మొదలుకు కారణాలు
బి) సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేయడానికి కారణాలు
సి) గాంధీజీ అరెస్టు మరియు విచారణ గురించి విషయాలు
డి) గాంధీజి యొక్క జైలు అనుభవాలు

జవాబు : సి) గాంధీజీ అరెస్టు మరియు విచారణ గురించి విషయాలు

☛ Question No.9
1922లో గాంధీజీ అరెస్టు అనంతరం అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ లక్నోలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను సూచించడానికి ఎవరి నేతృత్వంలో శాసనోల్లంఘన కమిటీని నియమించింది ?
ఎ) మోతిలాల్‌ నెహ్రూ
బి) రాజగోపాలచారి
సి) హకీమ్‌ అజ్మల్‌ ఖాన్‌
డి) కస్తూరి రంగన్‌

జవాబు : సి) హకీమ్‌ అజ్మల్‌ ఖాన్‌

☛ Question No.10
స్వరాజ్య / కాంగ్రెస్‌ ఖిలాపత్‌ స్వరాజ్య పార్టీ ఆవిర్భవించిన రోజు ఏది ?
ఎ) 23 నవంబర్‌ 1925
బి) 01 డిసెంబర్‌ 1926
సి) 25 డిసెంబర్‌ 1928
డి) 31 డిసెంబర్‌ 1923

జవాబు : డి) 31 డిసెంబర్‌ 1923

☛ Question No.11
ఈ క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి ?
1) 1922లో గయాలు కాంగ్రెస్‌ పార్టీ చీలిక తర్వాత చిత్తరంజన్‌ దాస్‌ ఐఎన్‌సి అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు.
2) కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత మార్పు కోరే పక్షంతో కలిసి చిత్తరంజన్‌ దాస్‌ అధ్యక్షుడిగా మోతిలాల్‌ నెహ్రూ కార్యదర్శిగా స్వరాజ్య పార్టీ స్థాపన జరిగింది
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) రెండూ కావు

జవాబు : సి) 1 మరియు 2

☛ Question No.12
1923లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఈ కిందివాటిలో తప్పు అంశాన్ని గుర్తించండి ?
ఎ) 1919 రాజ్యాంగ చట్టం ద్వారా 1923 ఎన్నికల్లో ఎన్నికలు నిర్వహించబడినవి
బి) 1923లో మౌలానా అబుల్‌ కలాం అజాద్‌ అధ్యక్షతన ఢిల్లీ లో జరిగి ఐఎన్‌సి ప్రత్యేక సమావేశంలో మార్పు కోరే వర్గానికి మరియు మార్పు కోరని వర్గానికి మధ్య అంగీకారం జరిగింది.
సి) మార్పు కోరే వర్గానికి మార్పు కోరని వర్గానికి అంగీకారం కుదిరినప్పటికి శాసన సభలకు పోటీ చేయడానికి మాత్రము స్వరాజ్య పర్టీకి కాంగ్రెస్‌ అనుమతిని ఇవ్వలేదు.
డి) ఈ ఎన్నికలలో కేంద్ర శాసనసభలోని 141 సీట్లకు గాను 42 సీట్లు స్వరాజ్య పార్టీ కైవసం చేసుకుంది.

జవాబు : సి) మార్పు కోరే వర్గానికి మార్పు కోరని వర్గానికి అంగీకారం కుదిరినప్పటికి శాసన సభలకు పోటీ చేయడానికి మాత్రము స్వరాజ్య పర్టీకి కాంగ్రెస్‌ అనుమతిని ఇవ్వలేదు.

☛ Question No.13
కేంద్ర శాసనసభలో మొదటి భారతీయ ప్రతిపక్ష నాయకుడు ఎవరు ?
ఎ) విటల్‌ బాయి పటేల్‌
బి) మోతిలాల్‌ నెహ్రూ
సి) మహమ్మద్‌ అలీ జిన్నా
డి) శేషగిరి అయ్యర్‌

జవాబు : బి) మోతిలాల్‌ నెహ్రూ

☛ Question No.14
1923-24 మధ్యకాలంలో మున్సిపాలిటీలకు స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులు పదవులను సరైన విధంగా జతపరచండి ?
1) జవహర్‌ లాల్‌ నెహ్రూ
2) బాబు రాజేంద్రప్రసాద్‌
3) చిత్తరంజన్‌దాస్‌
4) వల్లభాయ్‌ పటేల్‌
ఎ) అహ్మదబాద్‌ మున్సిపాలిటీ అధ్యక్షుడు
బి) కలకత్తా మేయర్‌
సి) పాట్నా మున్సిపాలిటీ అధ్యక్షుడు
డి) అలహాబాద్‌ మున్సిపాలిటీ అధ్యక్షుడు
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-ఎ, 2-సి, 3-బి, 4-సి
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
డి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి

జవాబు : సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ

☛ Question No.15
మద్రాస్‌ ప్రావిన్స్‌ పార్టీకి సంబందించిన సరైన అంశాన్ని గుర్తించండి ?
1) సత్యమూర్తి మరియు శ్రీనివాస్‌ అయ్యర్‌ ఆధ్వర్యంలో 1923లో ఏర్పడిరది 

2) సత్యమూర్తి మొదటి అధ్యక్షుడిగా ఈ పార్టీకి వ్యవహరించాడు
3) 1923 మరియు 1934 ఎన్నికల్లో పోటీ చేసి మద్రాస్‌ ప్రావిన్స్‌ లోమెజారీటీ స్థానాలు పొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది
ఎ) 1 మరియు 2
బి) 1, 2 మరియు 3
సి) 1 మరియు 4
డి) 1, 3 మరియు 4

జవాబు : డి) 1, 3 మరియు 4



Also Read

1) Modern Indian History (Gandhi Era) Gk Questions with Answers in telugu

Post a Comment

0 Comments