
భారతదేశం జీయోగ్రఫీ
India Geography in Telugu || General Knowledge in Telugu
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
భారతదేశ భూభాగాన్ని 6 రకాల భౌగోళిక స్వరూపాలుగా విభజించవచ్చు అవి.
- హిమాలయాలు
- గంగా - సింధూనది మైదానాలు
- ద్వీపకల్ప పీఠభూమి
- తీరప్రాంత మైదానాలు
- ఎడారి ప్రాంతం
- దీవులు
1) హిమాలయాలు :
హిమాలయాలు భారతదేశంలో తూర్పున దాదాపు 2400 కిలోమీటర్లు ఆవరించి ఉన్నాయి. పశ్చిమ ప్రాంతంలో 500 కిలోమీటర్లు, మధ్య,తూర్పు భాగంలో 200 కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. ఇవి లోతైన లోయలు, విశాలమైన పీఠభూములతో వేరుచేయబడి ఉన్నాయి. అన్నిటికంటే ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణిని ఉన్నత హిమాలయాలు లేదా హిమాద్రి అంటారు. ఈ శ్రేణి అవిచ్చిన్నంగా ఉంటూ పర్వతాల సగటు ఎత్తు సముద్రమట్టం నుండి సుమారు 6100 మీటర్లు ఉంటుంది. హిమాద్రి శ్రేణి మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ ఉండే హిమానీనదులు కరగడం వల్ల వార్షిక చక్రం ద్వారా జీవనదులకు నీటిని అందిస్తుంటాయి.
దక్షిణాన ఉన్న శివాలిక్ శ్రేణి మరియు ఉత్తరాన ఉన్న ఉన్నత హిమాలయాలు మధ్యన సమాంతరంగా ఉన్న పర్వతశ్రేణులను మధ్య హిమాలయాలు, హిమాచల్ లేన నిమ్న హిమాలయాలు అంటారు.
2) గంగా - సింధూ నది మైదానం :
గంగా - సింధూ నది మైదానాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు
పశ్చిమ భాగం
పశ్చిమభాగంలో సింధూనది దాని ఉపనదులు అయిన జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్జెజ్‌లతో ఏర్పడుతుంది. సింధూనది పరీవాహక ప్రాంతం అధికంగా పాకిస్తాన్ దేశంలో ఉంటుంది. భారతదేశంలో పంజాబ్, హర్యానా మైదానాలలో ఉంది.
మధ్యభాగం
ఈ మధ్యభాగంలో గంగా గుర్తింపు పొందింది. ఇది ‘ఘగ్గర్’ నది నుండి ‘తీస్తా ’ నది వరకు విస్తరించి ఉంది. ఇది ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలోనూ కొంత భాగం హర్యానా జార్ఘండ్, పశ్చిమబెంగాల్‌లలో ఉంది. ఇక్కడ గంగా, యమున వాటి ఉపనదులు సోన్, కోసి నదులు ప్రవహిస్తాయి.
తూర్పుభాగం
హిమాలయ నదులు కిందకి ప్రవహించే క్రమంలో రాళ్లు, గులకరాళ్లువంటి వాటిని శివాలిక్ పర్వతాల అడుగు భాగంలో నిక్షేపణ చేస్తాయి. ఈ భూస్వరూపాన్ని ‘భాబర్’ అంటారు. ఇది బాగా సచ్చిద్రంగా ఉండి చిన్న నదులు, వాగులు దీని కిందనుండి ప్రవహించి కింది ప్రాంతంలో మళ్లీ బయటకు వస్తాయి. దీనివల్ల చిత్తడి నేలలు ఏర్పడతాయి. దీనినే ఇక్కడ ‘టెరాయి’ ప్రాంతం అంటారు.
Also Read :
3) ద్వీపకల్ప పీఠభూమి :
భారతదేశానికి మూడువైపుల సముద్రాలు ఉంటాయి కావున భారతదేశాన్ని దీపకల్ప పీఠభూమి అంటారు. దీపకల్ప పీఠభూమిని మధ్యఉన్నత (మాల్వా పీఠభూమి) భూములు, దక్కన్ పీఠభూమి అని రెండు రకాలుగా విభజించవచ్చు.
4) ఎడారి ప్రాంతం :
అరావళి పర్వతాల వర్షచ్ఛాయా ప్రాంతంలో థార్ ఎడారి విస్తరించి ఉంది. ఎడారిలో ఎత్తు, పల్లాలతో ఇసుక మైదానాలు, అక్కడక్కడ శిలామయమైన బోడిగుట్టలు ఉంటాయి. ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక నది ‘లూని’ నది.
5) తీర మైదానాలు :
ద్వీపకల్ప పీఠభూమి దక్షిణ భాగంలో పశ్చిమాల అరేబియా మహాసముద్రం వెంట, తూర్పున బంగాళాఖాతం వెంట సన్నటి తీరప్రాంత మైదానాలు విస్తరించి ఉన్నాయి.
6) దీవులు :
భారతదేశంలో రెండు ద్వీప సమూహాలతో నిండి ఉంది. బంగాళాఖాతంలోని అండమాన్, నికోబార్ దీవులు అరేబియా సముంద్రంలోని లక్షద్వీప్ దీవులు, మయన్మార్ కొండలు అర్కన్‌యోమా నుండి మొదలుకొని సముద్రంలో మునిగిన పర్వతాలలో సముద్రం నుండి పైకివచ్చిన శిఖర ప్రాంతాలే అండమాన్, నికోబార్ దీవులు.
0 Comments