
ఖిల్జీ వంశం (ఢిల్లీ సుల్తానులు)
Khilji Dynasty in Telugu | Indian History in Telugu | Gk in Telugu | Khilji Dynasty Rulers, time, history in Telugu
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
ఢిల్లీ సుల్తానులు భారతదేశాన్ని 1206 నుండి 1526 సంవత్సరాల వరకు పరిపాలించారు. మహ్మద్‌ఘోరి మరణానంతరం 1206 సంవత్సరంలో కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సుమారు మూడు శతాబ్దాల కాలం పాటు ఢిల్లీ కేంద్రంగా బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి వంశాలు భారతదేశాన్ని పరిపాలించాయి. భారతదేశాన్ని పరిపాలించిన మొదటి ముస్లీం రాజవంశం.
క్రీ.శ.1206 నుండి 1526 వరకు ఢిల్లీని 5 రాజవంశాలు పరిపాలించాయి.
1) బానిస వంశం 2) ఖిల్జీ వంశం 3) తుగ్లక్ వంశం 4) సయ్యద్ వంశం
5) లోడీ వంశం
ఖిల్జీ వంశం (1290-1320)
➠ జలాలుద్దీన్ ఖిల్జీ (1290-96) :
1206-1290 వరకు పరిపాలించిన బానిస వంశ చివరి రాజైన కైకుబాద్ ను అంతం చేసి ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు. వీరి వంశం అప్ఘనిస్తాన్‌లోని హోలోమండ్ దగ్గర ఉన్న ఖిల్జీ ప్రాంతం అని ఫకృద్దీన్ తన రచనల్లో పేర్కొన్నాడు. అందుకే వీరి వంశానికి ఖిల్జీ అనే పేరు వచ్చింది. ఫిరోజ్‌షా ఢిల్లీ సుల్తాన్ అయ్యే నాటికి 70 సంవత్సరాల వయస్సు ఉండేవాడు. ఇతడు ఉదారవాది.ఇతడు తన కుమార్తెను అల్లా ఉద్దీన్ ఖిల్జీకి ఇచ్చి వివాహం చేసాడు. ఇతడు రాజ్య విస్తరణపై దృష్టి పెట్టకుండా రాజ్యంలో శాంతిభద్రతలు కాపాడాలనుకున్నాడు. దీనికోసం సమర్థులైన మాలిక్ ఫకృద్దిన్, సిరాజుద్దీన్ వారిని అధికారులుగా నియమించాడు. కారా రాష్ట్ర గవర్నర్ ఇతనిపై తిరుగుబాటు చేయగా ఫిరోజ్ షా అతడ్ని అణచివేసి కారాకు తన అల్లుడైన అల్లాఉద్దీన్ ఖిల్జీని గవర్నర్‌గా నియమించాడు. క్రీ.శ 1292లో ఢిల్లీపై మంగోలులు దాడి చేయగా ఫిరోజ్‌షా వారిని ఓడించాడు. ఆ యుద్దంలో బంధీలుగా చిక్కినవారితో ఇస్లాం మతాన్ని స్వీకరించేలా చేశాడు. వీరినే నాయ ముస్లీంలుగా పిలుస్తారు. వీరి నాయకుడు ఉల్లుగ్. ఉల్లుగ్‌కి తన కుమార్తెనిచ్చి వివాహం జరిపించాడు. థగ్గులు అనే దారిదోపిడి దొంగలను నిర్మూలించాడు. ఎస్.ఆర్.శర్మ అనే చరిత్రకారుడు జలాలుద్దీన్ ఫిరోజాను ‘దయాగుణాల రాజు’ గా పేర్కొన్నాడు. అల్లాఉద్దీన్ ఖిల్జీ యాదవ రాజ్యంపై విజయం సాధించినందుకు అభినందించడానికి వెళుతుండగా ఇతను హత్యకు గురయ్యాడు.
2) అల్లాఉద్దీన్ ఖిల్జీ (1296-1316) :
ఇతని అసలు పేరు అలీ గుర్షాన్స్. జలాలుద్దీన్ కాలంలో గవర్నర్‌గా పనిచేసిన ఇతను జలాలుద్దీన్ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఇతను 1293 యాదవ రాజ్యంపై దండెత్తి యాదవ రాజు రామచంద్ర దేవుడిని ఓడించి అపార ధనరాశులను కొల్లగొట్టాడు. తనను అభినందించడానికి వస్తున్న జలాలుద్దీన్ ఖిల్జీని హత్యచేయించి 1296లో ఢిల్లీ సుల్తానుల సింహసాన్ని అధిష్టించాడు. ఖిల్జీ వంశస్థులలో గొప్ప రాజుగా పేరుపొందాడు. ఇతనికి యామిన్ ఉల్ ఖిలాఫత్ నాసిర్, అమీర్ ఉల్ ముమూనిస్, రెండవ అలెగ్జాండర్ అనే బిరుదున్నాయి. దక్షిణ భారతదేశంపై దండెత్తిన మొదటి ముస్లీం రాజు. ఇతని కాలంలో మతపోషణకు దానం ఇచ్చిన భూములు తిరిగి తీసుకున్నాడు. సరాయ్ అదీల్ అనే మార్కెట్‌ను స్థాపించాడు. తూనికలు, కొలతలతో సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఇతడు పారశీక కవులైన అమీర్ హసన్, అమీర్ ఖుస్రూలను పోషించాడు. అమీర్ ఖుస్రూ ‘తారీఖి-ఇ-అలై అనే గ్రంథాన్ని రచించాడు. అమీర్ ఖుస్రూ ఈ గ్రంథంలో అల్లాఉద్దీన్ విజయాలను విశదీకరించాడు. గుర్రాలను జాగీరుదార్లు మోసం చేయకుండా ఉండేందుకు గుర్రాలమీద ముద్రలు వేయించేవాడు. పదవిని సూచించే పేర్లను పెట్టే పద్దతి ప్రవేశపెట్టాడు. 1311లో అల్లాఉద్దీన్ ఖిల్జీ ఢిల్లీలో కుతుబ్ మినార్ సమీపంలో అలాయ్ కోట నిర్మించాడు. దీనికి 7 ద్వారాలు ఉన్నాయి. జమాత్‌ఖానా మసీదును అల్లాఉద్దీన్ ఖిల్జీ నిర్మించాడు. ఇతను 1316లో మరణించాడు.
Also Read :
ఉత్తర భారతదేశం - దండయాత్రలు :
ఇతను గుజరాత్, రణతంభోర్, చిత్తోడ్, మాల్వా వంటి ప్రాంతాలపై దండెత్తి ఆ రాజ్యాలను స్వాధీనం చేసుకున్నాడు. గుజరాత్ పాలకుడైన కర్ణదేవుడిని ఓడించి అతని భార్య కమలాదేవీని తన భార్యగా చేసుకున్నాడు. రణతంభోర్ రాజ్యంపై దండెత్తి హంవీందేవుడిని ఓడించాడు. చిత్తోడ్ రాజ్యంపై దాడి చేశాడు. చిత్తోడ్ రాజు రాణా రతన్‌సింగ్ భార్య పద్మావతిని పొందాలనే ఉద్దేశ్యంతో ఈ దండయాత్ర చేసినట్లు చరిత్రకారులు చెబుతారు. రతన్‌సింగ్ మరణించడంతో రాణి పద్మిని అంత:పుర స్త్రీలతో కలిసి అగ్నిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ మొత్తం కథను మాలిక్ మహమ్మద్ జయసి అనే కవి పద్మావత్ అనే గ్రంథంగా రాశాడు. చిత్తోడ్‌ను ఆక్రమించిన అల్లాఉద్దీన్ ఖిల్జీ దానికి ఖజీరాబాద్ అనే పేరు పెట్టాడు.
దక్షిణ భారతదేశం - దండయాత్రలు :
అల్లాఉద్దీన్ ఖిల్జీ తన సేనాని అయిన మాలిక్ కపూర్ నాయకత్వంలో దక్షిణ భారతదేశంపై దండెత్తి యాదవ, కాకతీయ, హోయసాల, పాండ్య రాజ్యాలను ఓడించి కప్పం వసూలు చేశాడు. దేవగిరిని పరిపాలిస్తున్న యాదవ రాజు రామచంద్ర దేవుడిని ఓడించి కప్పం వసూలు చేశాడు. ఓరుగల్లును పాలిస్తున్న కాకతీయ చక్రవర్తి రెండో ప్రతాపరుద్రుడిని ఓడించి కప్పం వసూలు చేశాడు. హోయసాల రాజు మూడో భల్లాలుడిని ఓడించాడు. పాండ్యరాజు అయిన వీరపాండ్యుడిని ఓడించి అతని సోదరుడు సుందర పాండ్యుడిని రాజును చేసి అపార ధనరాళులను పొందాడు.
➠ ముబారక్ ఖిల్జీ (1316-1320) :
ఇతను ఖలీపా అని పేరుపెట్టుకున్న మొదటి ఢిల్లీ సుల్తాన్ ముబారక్ ఖిల్జీ. ఇతను తనను తానుగా ఖలీఫా అని ప్రకటించుకున్నాడు. ముబారక్ కుతుబ్‌ఉద్దీన్ అనే బిరుదును ధరించి కుతుబుద్దీన్ ముబారక్‌గా పేరుపొందాడు. ఖుస్రూఖాన్ అనే వ్యక్తి ముబారక్ ఖిల్జీని అంతం చేసి కేవలం 100 రోజులు మాత్రమే పరిపాలించాడు. ఢిల్లీ సింహాసనంపై కూర్చున్న ఏకైక హిందువు ఖుస్రూఖాన్. ఇతని సేనాపతి, ముబారక్ వారసుడైన ఘాజీమాలిక్ ఖుస్రూఖాన్‌ను చంపి 1320లో సింహాసనం అధిష్టించాడు.
Also Read :
0 Comments