
బానిస వంశం (ఢిల్లీ సుల్తానులు)
Slave Dynasty in Telugu | Indian History in Telugu | Gk in Telugu | Slave Dynasty Rulers, time, history in Telugu
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
ఢిల్లీ సుల్తానులు భారతదేశాన్ని 1206 నుండి 1526 సంవత్సరాల వరకు పరిపాలించారు. మహ్మద్‌ఘోరి మరణానంతరం 1206 సంవత్సరంలో కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సుమారు మూడు శతాబ్దాల కాలం పాటు ఢిల్లీ కేంద్రంగా బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి వంశాలు భారతదేశాన్ని పరిపాలించాయి. భారతదేశాన్ని పరిపాలించిన మొదటి ముస్లీం రాజవంశం.
క్రీ.శ.1206 నుండి 1526 వరకు ఢిల్లీని 5 రాజవంశాలు పరిపాలించాయి.
1) బానిస వంశం (1206-1290)
2) ఖిల్జీ వంశం (1290-1320)
3) తుగ్లక్ వంశం (1320-1414)
4) సయ్యద్ వంశం (1414-1451)
5) లోడీ వంశం (1451-1526)
బానిస వంశం
కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశాన్ని 1206 సంవత్సరంలో స్థాపించాడు. మహ్మద్‌ఘోరి మరణాంతరం స్వాతంత్రంగా 1210 వరకు భారతదేశాన్ని పరిపాలించాడు. బానిస వంశంలో కుతుబుద్దిన్‌తో పాటు ఇల్‌టుట్‌మిష్, రజియా సుల్తానా, ఘియాజుద్దీన్ బాల్పన్ రాజులు పరిపాలించారు. బానిస వంశాన్ని మామ్లూక్ వంశం అని కూడా పిలుస్తారు. బానిస వంశం భారతదేశాన్ని 1206 నుండి 1290 వరకు పరిపాలించారు.
➠ కుతుబుద్దీన్ ఐబక్ (1206-1210) :
మహ్మద్ ఘోరీ చక్రవర్తికి సేనానిగా పనిచేసిన కుతుబుద్దీన్ ఐబక్ తన శక్తి యుక్తులతో భారతదేశం ఘోరీ ప్రతినిధిగా నియమితుడయ్యాడు. మహ్మద్ ఘోరి మరణాంతరం క్రీ.శ.1206 సంవత్సరంలో ఐబక్ స్వతంత్ర ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన అలీమర్ధాన్‌ను ఓడించి ఆయన స్థానంలో మహ్మద్ షేరాన్‌ను గవర్నర్‌గా నియమించాడు. ఘజనీ పాలకుడైన తాజ్‌ఉద్దీన్ యల్‌డజ్ ఢిల్లీపై దండేత్తినప్పుడు అతన్ని ఐబక్ ఓడించాడు. ఇతను లాహోర్‌ను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. భారతదేశంపై ముస్లిం దండయాత్రకు చిహ్నంగా ఢిల్లీలో కుతుబ్‌మినార్‌ను నిర్మించాడు. ఢిల్లీ ఆక్రమణకు గుర్తుగా ఢిల్లీలో కువ్వత్ ఉల్ ఇస్లామ్ మసీదును నిర్మించాడు. ఇతనికి లాక్ బక్ష్, సిఫాసలార్ అనే బిరుదులున్నాయి. కుతుబుద్దీన్ ఐబక్ చౌగాన్ (పోలో) ఆటాడుతూ గుర్రం మీద నుండి పడిపోయి 1210 లో మరణించాడు. ఇతని మరణాంతరం ఇతని కుమారుడు ఆరాంషా ఢిల్లీ సింహసనాన్ని అధిష్టించాడు.
Also Read :
➠ ఇల్‌టుట్ మిష్ (1211-1236) :
కుతుబుద్దీన్ ఐబక్ మరణాంతరం సింహాసాన్ని అధిష్టించిన ఆరాంషాను గద్దెదించి 1211 లో ఢిల్లీ సింహసనాన్ని అధిష్టించాడు. కుతుబుద్దీన్ ఐబక్ కుమార్తెను ఇల్‌టుట్‌మిష్ వివాహం చేసుకున్నాడు. ఇతడు తురుష్కులలో ఇల్బారీ తెగకు చెందినవాడు. ఇతను ఢిల్లీని శాశ్వత రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఇతను ఘజనీ రాజు తాజ్‌ఉద్దీన్ యల్‌డజ్‌ను, ముల్తాన్ రాజు నాసిరుద్దీన్ కుబాచాలను ఓడించి సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఇతను ‘ఇక్తా’ అనే సైనిక పద్దతిని ప్రవేశపెట్టాడు. కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించిన కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఇతని కాలంలో టంకా(వెండి నాణేలు), జిటాల్ (రాగినాణేలు) ముద్రించాడు. ఉజ్జయిని మహంకాళీ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అజ్మీర్‌లో కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించిన అర్హదిన్ కాంజోంప్టా మసీదును సుందరంగా తీర్చిదిద్దాడు. ఇతను 1236లో మరణించాడు.
➠ రజియా సుల్తానా (1236-1240) :
రజియా సుల్తానా ఇల్‌టుట్ మిష్ మరణాంతరం ఢిల్లీ సింహసాన్ని అధిష్టించడం ద్వారా భారతదేశాన్ని పరిపాలించిన తొలి, ఏకైక ముస్లిం మహిళగా కీర్తి సాధించింది. ఈమె ఇల్‌టుట్‌మిష్ యొక్క కూతురు. ఈమె శక్తియుక్తులను తెలుసుకున్న ఇల్‌టుట్ మిష్ తన ఇద్దరు కుమారులను కాదని రజియా సుల్తానాను తన వారసురాలిగా ప్రకటించాడు. దీంతో ఒక మహిళ పాలకురాలు కావడం జీర్ణించుకోలేని సామంతులు, సర్దార్‌లు ఈమెపై అనేక తిరుగుబాట్లు చేశారు. వీటిని రజియా సుల్తానా సమర్థవంతంగా అణచివేసింది. ఈమె కాలంలో మాలిక్ జమాలుద్దీన్ యాకూత్ అనే అబిసీనియా దేశస్థుడు అశ్వధళాధిపతిగా నియమితుడయ్యాడు. ఈ నియామకాన్ని వ్యతిరేకించిన ముస్లీంలు, సర్దారులు అల్‌తునియాతో చేతులు కలిపి రజియా సుల్తానాను ఓడించి జైలులో బంధించారు. కారాగారం నుండి తప్పించుకున్న రజియా సుల్తానాను 1240లో ఖైతాల్ అనే ప్రాంతంలో హత్య చేయడం జరిగింది.
➠ ఘియాజుద్దీన్ బాల్బన్ (1266-1287) :
బాల్బన్ ఇల్‌టుట్‌మిష్ యొక్క బానిసగా పనిచేశాడు. ఇతను బానిస రాజులలో గొప్పవాడు. ఇతని మొదటి పేరు బహాఉద్దీన్. ఇల్‌టుట్ మిష్ కుమార్తెను బాల్బన్ వివాహం చేసుకొని చిహల్‌గనీలో సభ్యుడయ్యాడు. నాసిరుద్దీన్ మరణాంతరం 1266లో సింహాసనమెక్కిన బాల్బన్ ‘ఘియాన్ ఉద్దీన్’ అనే బిరుదును ధరించాడు. భగవంతుని నీడ అనే బిరుదుని ధరించాడు. మంగోలుల దండయాత్రను సమర్థవంతంగా తిప్పికొట్టి పర్షియా రాచరిక విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఇల్‌టుట్‌మిష్ కాలంలో ప్రారంభించిన చిహల్ గనీని పూర్తిగా మూయించాడు. రాజరికం దైవదత్తమనే సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు, ఇతనిని మధ్యయుగ భారతదేశ ఉక్కుమనిషి అని పిలుస్తారు. గూఢచారి విధానాన్ని, పర్షియా రాజరిక విధానాన్ని, చాంబర్లీన్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఇస్లాం మత సర్వసమానత్వం నుండి వైదొలగినాడు. బెంగాల్ గవర్నర్ టుగ్రిల్‌ఖాన్‌ను అణిచివేశాడు. రాజుకు సాష్టాంగ నమస్కారం చేసే ‘సిజ్జా’ పద్దతిని, సుల్తాన్ పదాలను ముద్దుపెట్టుకునే ‘పైబోస్’ పద్దతులను ప్రవేశపెట్టాడు. నౌరోజ్ అనే పండుగను ప్రవేశపెట్టాడు. సైనిక వ్యవస్థలో వృద్దాప్య పెన్షన్ పద్దతిని ప్రవేశపెట్టాడు. అడవులను నరికించి వ్యవసాయ భూములగా మార్చాడు. ఇతని మరణాంతరం ఇతను మనమడు అయిన కైకుబాద్ సింహసనాన్ని అధిష్టించాడు.
➠ కైకుబాద్ (1286-1990) :
ఘియాజుద్దీన్ బాల్బన్ మరణాంతరం ఢిల్లీ సింహసనాన్ని అధిష్టించాడు. ఇతడు ఘియాజుద్దీన్ బాల్బన్ యొక్క మనుమడు. ఇతని సేనాపతిగా పనిచేసిన జలాలుద్దీన్ ఖిల్జీ ఇతన్ని అంతం చేసి ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు.
Also Read :
జవాబు : కుతుబుద్దీన్ ఐబక్
జవాబు : రజియా సుల్తానా
జవాబు : తురుష్కులలో ఇల్బారీ తెగ
జవాబు : ఇల్‌టుట్‌మిష్
జవాబు : కైకుబాద్
జవాబు : రాజుకు సాష్టాంగ నమస్కారం చేయడం
జవాబు : మహమ్మద్ ఘోరి
జవాబు : క్రీ.శ 1206
జవాబు : రాజు యొక్క పాదాలను ముద్దాడటం
జవాబు : ఘియాజుద్దీన్ బాల్బన్
0 Comments