
విజయనగర సామ్రాజ్యం - తళ్లికోట యుద్దం
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
దక్కన్ సుల్తాన్‌లు అయిన అలీ ఆదిల్‌షా, హుస్సెన్ నిజాంషా, ఇబ్రహీం కుతుబ్‌షా, అలీ బరీద్‌లు కూటమిగా ఏర్పడి క్రీ.శ 1565లో విజయనగర సామ్రాజ్యంపై దండెత్తారు. దీనికి తళ్లికోట లేదా రాక్షస తంగడి యుద్దం అని పేరు వచ్చింది. ఇందులో దక్కన్ సుల్తాన్‌ల చేతిలో విజయనగర రాజులు ఓటమిపాలయ్యారు.
ఈ తళ్లికోట యుద్దం చరిత్రలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ యుద్దం రాక్షసి, తంగడి అనే రెండు గ్రామాల మధ్య జరిగిందని పేర్కొనగా తళ్లికోట వద్ద జరిగిందని మరికొందరి వాదన. ఈ తళ్లికోట యుద్దంలో రామరాయలు సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించాడు. ఎడమవైపున తిరుమల రాయలు, అలీ ఆదిల్ షాను ఎదుర్కొనేలా, మధ్యన రామరాయలు హుస్సెన్ నిజజాంషాతో పోరాడేలా, కుడివైపున వెంకటాద్రిరాయలు ఇబ్రహీం కుతుబ్‌షా, అలీ బరీద్‌లను ఎదుర్కొనే విధంగా యుద్దవ్యూహరచ చేశాడు. కానీ దక్కన్ సుల్తానులు ఆధునిక ఫిరంగులను ఉపయోగించడంతో విజయనగర సైనికులు వీటిని తట్టుకోలేకపోయారు. హుస్సెన్ నిజాం షా సైన్యం రామరాయలను బంధించి హుస్సెన్ నిజాం షా అతన్ని వధించాడు. దీంతో విజయనగర రాజ్యం చిన్నాభిన్నమైంది. ఈ యుద్దంలో వెంకటాద్రి రాయలు కూడా మరణించాడు. తిరుమల రాయలు, సదాశివ రాయలు యుద్దభూమి నుండి పారిపోయారు.
Also Read :
➺ ఓటమికి గల కారణాలు :
గతంలో ఆదిల్‌షా వద్ద నుండి పారిపోయి వచ్చి రామరాయలు ఆశ్రయం పొందిన జిలాని సోదరులు ఈ యుద్దంలో విజయనగర సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేశారు. వీరిని రామరాయలు సైన్యాధ్యక్షులుగా నియమించడం జరిగింది. వీరు కీలక సమయంలో యుద్దక్షేత్రాన్ని వదలి వెళ్లిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. విజయనగర సైన్యాధిపతులు ముగ్గురూ వయసుమీరిన వారు కావడం, శిక్షణలేని యూరోపియన్ కూలీ సిపాయిలు ఉండడంతో ఈ యుద్దంలో విజయనగర సైన్యం ఓటమి చవిచూసింది.
➺ యుద్ధానంతర పరిస్థితులు :
- ఈ తళ్లికోట యుద్దం తర్వాత సుల్తాన్‌ల సైన్యం విజయనగరాన్ని పూర్తిగా నాశనం చేసింది.
- దీంతో తిరుమల దేవరాయలు సదాశివరాయలను విజయనగర సామ్రాజ్య ఖాజానాను తీసుకొని పెనుకొండకు పారిపోయారు.
- పెనుకొండలో సదాశివరాయలను సింహసనంపై ఉంచి తిరుమ దేవరాయలు అనధికార రాజ్యపాలన చేశాడు.
- ఈ యుద్దం అనంతరం దక్షిణభారతదేశంలో చిట్టచివరి హిందూ మహాసామ్రాజ్యానికి తెరపడినట్లయింది.
- అయితే గెలిచిన దక్కన్ సుల్తానుల మధ్య కూడా శాశ్వత శాంతి ఏర్పడలేదు. దీంతో తమలోతాము కలహించుకోవడంతో వారు బలహీనపడి చివరికి మొగలులకు, బ్రిటిష్‌వారికి లొంగిపోయారు.
Related Posts:
0 Comments