
లోక్‌సభ
లోక్‌సభను తాత్కాలిక సభ, దిగువ సభ, ప్రజల సభ, ప్రత్యక్ష సభ, ప్రజాప్రతినిధుల సభ అని పిలుస్తారు. మొదటి సారిగా 17 ఏప్రిల్ 1952 న లోక్‌సభ ఏర్పాటైంది. మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేయబడిన లోక్‌సభలో మొత్తం 525 సభ్యులున్నారు. 1973 రాజ్యాంగ సవరణ ద్వారా లోక్‌సభ సీట్లను 525 నుండి 545కు పెంచడం జరిగింది. లోక్‌సభలో ప్రస్తుతం (545 రాష్ట్రాలనుండి 543 + 2 ఆంగ్లో ఇండియన్స్) ఉన్నారు. లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్‌లను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. మొట్టమొదటి సారిగా లోకసభకు 25 అక్టోబర్ 1951 నుండి 21 ఫిబ్రవరి 1952 వరకు ఎన్నికలు జరిగాయి. తొలి లోక్‌సభలో అధికార పార్టీ నాయకులుగా జవహర్‌లాల్ నెహ్రూ వ్యవహరించాడు. లోక్‌సభలో ఒక పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలంటే కనీసం 10 శాతం స్థానాల్లో విజయం సాధించాలి.
➠ లోక్‌సభకు సభ్యుడు కావాలంటే ఉండాల్సిన అర్హతలు
- భారతీయ పౌరుడై ఉండాలి
- కనీసం 25 సంవత్సరాలు ఉండాలి
- పార్లమెంట్ నిర్ణయించిన అర్హతలు ఉండాలి
- లాభసాటి పదవిలో ఉండరాదు
➠ లోక్‌సభ కాలపరిమితి :
సాధారణంగా లోక్‌సభ కాలపరిమితి 5 సంవత్సరాలు (42 సవరణ ద్వారా 6 సంవత్సరాలకు పెంచారు. మరల 44వ సవరణ ద్వారా 5 సంవత్సరాలకు తగ్గించారు) ఉంటుంది. జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు లోక్‌సభ కాలాన్ని ఒక సంవత్సరం పొడగించవచ్చు. అయితే అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత 6 నెలలు మించి లోక్‌సభ కాలపరిమితి పొడిగించరాదు. రాజకీయ అనిశ్చితి ఉన్నప్పుడు 5 సంవత్సరాల కంటే ముందే లోక్‌సభను రద్దు చేయవచ్చు. ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని కేంద్రమంత్రిమండలి లిఖిత పూర్వక సూచనపై రాష్ట్రపతి లోక్‌సభను గడువు పూర్తికాకముందే రద్దు చేయవచ్చు.
➠ లోక్‌సభ ప్రత్యేకాధికారాలు :
- లోక్‌సభలోనే కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలి. లోక్‌సభదే అంతిమ అధికారం ఉంటుంది.
- సాధారణ బిల్లుల విషయంలో రాజ్యసభ, లోక్‌సభల మధ్య సమాన అధికారాలు కల్గి ఉన్నప్పటికి సభ్యుల సంఖ్యరిత్యా లోక్‌సభదే పైచేయి.
- ద్రవ్యబిల్లును లోక్‌సభలోనే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.
- వాయిదా తీర్మాణాన్ని, అవిశ్వాస తీర్మాణాన్ని, విశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి.
- జాతీయ అత్యవసర పరిస్థితిని, రద్దుచేసే అత్యవసర పరిస్థితిని లోక్‌సభలోనే ప్రతిపాదించి ఆమోదించాలి.
- అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని తొలగించాలంటే లోక్‌సభ మాత్రమే అవిశ్వాస తీర్మాణం ద్వారా తొలగించే అధికారం ఉంటుంది.
- కేంద్రమంత్రిమండలి లోక్‌సభకు మాత్రమే సమిష్టిగా బాద్యత వహిస్తుంది.
- లోక్‌సభ కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట అంశాలపై చట్టాలను తయారు చేస్తుంది.
- అవిశ్వాస తీర్మాణం ద్వారా మంత్రిమండలిని తొలగించే అధికారం లోక్‌సభకు ఉంటుంది.
- ప్రభుత్వం చేసే ఋణాలకు పరిమితి విధిస్తుంది.
- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్, యుపిఎస్సీ చైర్మన్‌లను తొలగింపు విషయంలో లోక్‌సభకు అధికారం ఉంటుంది.
- రాజ్యాంగ సవరణను ప్రతిపాదించే అధికారం లోక్‌సభకు ఉంటుంది.
Also Read :
➠ ప్రొటెస్పీకర్ :
లోక్‌సభ సాధారణ ఎన్నికల తర్వాత జరిగే మొదటి సమావేశానికి తాత్కాలికంగా స్పీకర్‌గా వ్యవహరిస్తాడు. ఇతనిని రాష్ట్రపతి నియమిస్తారు. సభలో సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించడం సాంప్రదాయం. ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. నూతన స్పీకర్ ఎన్నికైన వెంటనే ప్రొటెం స్పీకర్ పదవి రద్దవుతుంది.
➠ లోక్‌సభ స్పీకర్ :
- లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు తమలో ఒకరిని లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నుకుంటారు. (లోక్‌సభకు జి.వి మౌలాంకర్ మొదటి స్పీకర్‌గా పనిచేశాడు)
- లోక్‌సభ సభ్యుడు మాత్రమే స్పీకర్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది.
- సాధారణంగా స్పీకర్ యొక్క పదవీకాలం 5 సంవత్సరాలు ఉంటుంది. కొన్ని సందర్భాలలో కొత్త స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు స్పీకర్‌గా వ్యవహరిస్తాడు.
- ఒక వ్యక్తి స్పీకర్‌గా ఎన్నిసార్లు అయినా ఎన్నిక కావడానికి అర్హుడు అవుతాడు.
- పదవీ దుర్వినియోగం, రాజ్యాంగ ఉల్లంఘన వంటి కారణాలతో లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను 14 రోజుల ముందస్తు నోటీసుతో సాధారణ మెజార్టీతో తొలగించవచ్చు.
- స్పీకర్ తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్‌కు అందించాలి.
➠ లోక్‌సభ స్పీకర్ అధికారాలు :
- లోక్‌సభ రద్దు అయినప్పటికీ స్పీకర్ పదవి రద్దు అవదు.
- పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం లోక్‌సభ స్పీకర్‌కు వర్తించదు
- లోక్‌సభ స్పీకర్ అనుమతి లేకుండా లోక్‌సభ సభ్యుడిని అరెస్టు చేయరాదు.
- స్పీకర్ ఒక బిల్లును ఆర్థిక బిల్లు అవునా, కాదా అని నిర్ణయించే అధికారం ఉంటుంది.
- ఏదేని బిల్లు విషయంలో ఓటింగ్ సమం అయినప్పుడు నిర్ణయాత్మక ఓటు (కాస్టింగ్ ఓటు) వేసే అధికారం ఉంటుంది.
- పార్లమెంట్ ఉభయ సభల సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు.
- లోక్‌సభ ఆమోదించిన బిల్లులను రాజ్యసభకు పంపుతాడు
- స్పీకర్ అనుమతి లేనిదే ఎలాంటి బిల్లులు సభలో ప్రవేశపెట్టరాదు. అధికార, ప్రతిపక్ష సభ్యులెవరూ ప్రసంగించరాదు.
- పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అనుసరించి సభ్యులను అనర్హులుగా ప్రకటించే అధికారం, చట్టాన్ని అమలు పరిచే అధికారం ఉంటుంది.
- సభాహక్కుల సంరక్షకునిగా, లోక్‌సభ సభ్యుల హక్కుల పరిరక్షకునిగా స్పీకర్ వ్యవహరిస్తాడు.
- రాష్ట్రపతి రాజీనామాను అధికారంగా ప్రకటిస్తాడు.
➠ డిప్యూటీ స్పీకర్ :
లోక్‌సభ సభ్యులు మెజార్టీ ప్రాతిపాదికన డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. అయితే మన దేశంలో డిప్యూటీ స్పీకర్ పదవిని సాంప్రదాయంగా ప్రతిపక్షాలకు ఇచ్చే ఆచారం 1996 నుండి ప్రారంభమైంది. స్పీకర్ సభకు రాని సందర్భంలో డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు.
➠ అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉన్న రాష్ట్రాలు
- ఉత్తరప్రదేశ్ - 80
- మహారాష్ట్ర - 48
- పశ్చిమ బెంగాల్ - 42
- బీహార్ - 40
➠ లోక్‌సభలో ఒకే ఒక సభ్యుడున్న రాష్ట్రాలు
- మిజోరాం
- నాగాలాండ్
- సిక్కిం
➠ దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గాలు :
- మల్కాజ్‌గిరి (తెలంగాణ)
- ఘజియాబాద్ (ఉత్తరప్రదేశ్)
- బెంగళూర్ నార్త్ (కర్ణాటక)
➠ అతిచిన్న పార్లమెంట్ నియోజకవర్గాలు
- లక్షద్వీప్
- డామన్‌డయ్యూ
- లడక్
0 Comments