
బడ్జెట్ అంటే ఏమిటీ ? బడ్జెట్‌ను ఎలా తయారు చేస్తారు What is Budget ? | General Knowledge in Telugu | Indian Economy in Telugu
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
➺ బడ్జెట్ అంటే ఏమిటీ ?
స్థూలంగా ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను తెలియజేసే పట్టికనే బడ్జెట్‌గా భావించవచ్చు. ప్రజల నుండి పన్నుల రూపేణా వసూలు చేసిన ధనాన్ని వారికోసం ఎలా వినియోగించబోతుందో ఈ బడ్జెట్ ద్వారా తెలియజేస్తారు.
➺ బడ్జెట్‌ను ఎలా తయారు చేస్తారు ?
➠ బడ్జెట్ రకాలు :
- సంతులిత బడ్జెట్
ప్రభుత్వం యొక్క వ్యయం మరియు ఆదాయం సమానమైనప్పుడు దానిని సంతులిత బడ్జెట్ అంటారు.
- లోటు బడ్జెట్
ప్రభుత్వ వ్యయం కంటే ఆదాయం తక్కువైప్పుడు దానికి లోటు బడ్జెట్ అంటారు.
- మిగులు బడ్జెట్
ప్రభుత్వ వ్యయం కంటే ఆదాయం ఎక్కువైప్పుడు దానిని మిగులు బడ్జెట్ అంటారు.
➺ బడ్జెట్ - లోటు భావనలు :
- రెవెన్యూలోటు
ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వచ్చే రెవెన్యూ ఆదాయం కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు ఆదాయలోటు ఏర్పడుతుంది. దీనినే రెవెన్యూ లోటు అంటారు. అప్పులు, ఇతర మార్గాల ద్వారా ఈ లోటును పూడుస్తారు.
- విత్తలోటు
ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ రుణేతర వసూళ్లను మించిపోవడాన్ని విత్తలోటు అంటారు. బడ్జెట్ లోటుకు మార్కెట్ రుణాలను, ఇతర అప్పులను కలిపితే కూడా విత్తలోటు తెలుస్తుంది. ప్రభుత్వ వ్యయం నుండి రెవెన్యూ వసూళ్లు, రుణాల వసూళ్లు, ఇతర వసూళ్లు తీసివేస్తే విత్తలోటు తెలుస్తుంది.
- ప్రాథమిక లోటు
విత్తలోటు నుండి వడ్డీ చెల్లింపులను తీసివేయగా వచ్చేది ప్రాథమిక లోటు.
- ప్రభావిత రెవెన్యూ లోటు
రెవెన్యూ లోటు నుండి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు మూలధన ఆస్తుల నిర్మాణం కోసం ఇచ్చిన నిధులను తీసివేస్తే వచ్చేది ప్రభావిత లోటు చెప్పవచ్చు.
➺ బడ్జెట్‌లో స్థూలంగా రెండు రకాలు ఉంటాయి.
1) ప్రభుత్వ వ్యయం
- రెవెన్యూ వ్యయం
ప్రభుత్వ నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, బదిలీలపై చేసే ఖర్చును రెవెన్యూ వ్యయంగా పేర్కొంటారు. ఇది ప్రభుత్వానికి ఆస్తులను సృష్టించదు.
- ములధన వ్యయం
అభివృద్ది సంబంధిత వ్యయం, రక్షణకు సంబంధించిన మూలధన వ్యయం, రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఇచ్చే రుణాలను మూలధన వ్యయం అంటారు.
2) ప్రభుత్వ వసూళ్లు
- రెవెన్యూ వసూళ్లు
పన్నులు, సుంకాలు ద్వారా వసూలయ్యే ఆదాయమే రెవెన్యూ వసూల్లు. ఎగుమతి, దిగుమతి సుంకాలు, ఎక్సైజ్ డ్యూటీ, కార్పోరేట్ ట్యాక్స్, ఇతరత్రా పన్నుల రూపంలో వచ్చే డబ్బంతా ఈ ఖాతాలోకే చేరుతుంది. ప్రభుత్వ పెట్టుబడులపై వడ్డీలు, డివిడెండ్ల రూపంలో వచ్చే ఆదాయం, ప్రభుత్వ సేవలపై వసూలు చేసే చార్జీలు ఈ కేటగిరి కిందికి వస్తాయి.
- రెవెన్యూ వసూళ్లు రెండు రకాలు
i) పన్నుయేతర వసూళ్లు
ప్రభుత్వం ఇచ్చిన రుణాలపై వసూలు చేసుకునే వడ్డీ, ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్జించిన లాభాల నుండి ప్రభుత్వానికి వచ్చే డివిడెండ్లను పన్నుయేతర రెవెన్యూ వసూళ్లు అంటారు.
ii) పన్ను వసూళ్లు
a) ప్రత్యక్ష పన్నులు
ప్రభుత్వానికి మనం నేరుగా చెల్లించే పన్నులు ఇవి. ఆదాయపన్ను, సంపద పన్ను, ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ వంటికి ఈ కోవలోకి వస్తాయి. ఈ పన్నులను సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ పర్యవేక్షిస్తుంది.
b) పరోక్ష పన్నులు
నేరుగా మనం చెల్లించకుండా వివిధ వస్తువులు, సేవలపై ప్రభుత్వం వేసే పన్నులను పరోక్ష పన్నులు అంటారు. జీఎస్టీ, వ్యాట్, సేల్స్‌ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ వంటికి పరోక్ష పన్నుల కేటగిరిలోకి వస్తాయి. ఈ పన్నులు సదరు వస్తువులు, సేవలను అందించే కంపెనీల ద్వారా ప్రభుత్వానికి చేరుతాయి.
Also Read :
➠ మూలధన వసూళ్లు
ఇందులో రుణాల వసూళ్లు, మార్కెట్ రుణాలు, ఇతర అప్పులు, ఇతర వసూళ్లు ఉంటాయి.
➺ సంచిత నిధి :
అన్ని రకాల వసూళ్లు, ఆదాయాలు ఋణాల ద్వారా వచ్చిన సొమ్ము ఈ నిధి కింద జమ అవుతుంది. ఈ నిధి నుండి ఖర్చు చేయడానికి పార్లమెంట్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో రెండు పద్దులుంటాయి. 1. రెవెన్యూ వసూళ్లు` రెవెన్యూ వ్యయం 2. మూలధన వసూళ్లు`మూలధన వ్యయం
➺ మూలధన బడ్జెట్ :
మూలధన, వ్యయ పట్టికగా చెప్పుకోవచ్చు. వార్షిక బడ్జెట్‌లో మూలధన బడ్జెట్‌తో పాటు రెవెన్యూ బడ్జెట్ కూడా ఉంటుంది. ప్రభుత్వానికి మూలధన ఖాతాలో వసూలయ్యే ఆదాయం, ఖర్చులు మూలధన బడ్జెట్‌లో ఉంటాయి. ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ వసూళ్లు, ఖర్చులకు సంబందించిన వివరాలు రెవెన్యూ బడ్జెట్‌లో ఉంటాయి.
➺ రెవెన్యూ పద్దు :
ఉద్యోగుల జీతభత్యాలు, రక్షణ, పోలీసు వ్యవస్థల నిర్వహణ, ఎన్నికలు, కళలు, క్రీడలు, కుటుంబ సంక్షేమం, వ్యవసాయ రంగాలకు వెచ్చించే నిధులు, వడ్డీలు, ఋణచెల్లింపులు ఈ పద్దులోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ప్రణాళికేతర గ్రాంటులు కూడా ఈ ఖాతాలోనే ఉంటాయి.
➺ క్యాపిటల్ పద్దు (ప్రణాళిక వ్యయం) :
ప్రభుత్వం ఆదాయ వనరులను, ఆస్తులను సృష్టించుకునేందుకు చేసే వ్యయం ఇది.
➺ ప్రభుత్వ ఖాతా :
సంచిత నిధిలో జమయ్యే వసూళ్లు మినహా ప్రభుత్వం వద్దకు వచ్చే ఇతర అన్ని రకాల నిధులు ఈ ఖాతాలో జమ అవుతాయి. ఆర్‌బిఐ నుండి, పిఎఫ్ నుంచి తీసుకునే ఋణాలను ఈ ఖాతా కింద ఖర్చు చేస్తారు. ఈ సొమ్మును మళ్లీ చెల్లించాల్సి ఉంటుంది.
➺ సెస్‌లు :
మనం చెల్లించే పన్నులకు అదనంగా కొంత శాతం మేర విధించే ప్రత్యేక పన్నులు/చార్జీలను సెస్‌లుగా చెప్పవచ్చు. ఎడ్యూకేషన్ సెస్, కృషికళ్యాణ్ సెస్, స్వచ్ఛభారత్ సెస్, పెట్రోల్ డిజిల్‌పై సెస్ వంటివి ఈ కోవలోకి వస్తాయి. సాధారణంగా కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. అదే సెస్‌లుగా వసూలు చేసే మొత్తం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే చెందుతుంది.
➺ సర్ చార్జీలు :
అత్యంత విలాసవంతమైన, ఖరీదైన వస్తువులు, సేవలపై అదనంగా విధించే చార్జీలను సర్ చార్జీలు అంటారు. దేశంలో పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం ప్రభుత్వాలు ధనిక కేటగిరిల్లోని వారు వినియోగించే ఖరీదైన వస్తువులు, సేవలపై సర్ చార్జీలను విధిస్తూ ఉంటాయి. ఉదాహరణకు విలాసవంతమైన కార్లు, ఖరీదైన బైకులు, దిగుమతి చేసుకునే వాహనాలు వంటివి. దీనికితోడు అత్యధిక ఆదాయం ఉండేవారి నుండి వసూలు చేసే ఆదాయయ పన్నుపైనా సర్ చార్జీలు ఉన్నాయి.
➺ డిజిన్వేస్టిమెంట్ :
ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాలను అమ్మడం, లేదా పూర్తిగా విక్రయించడం లేదా స్టాక్‌మార్కెట్లో వాటిని లిస్ట్ చేయడం ద్వారా ప్రభుత్వాలు నిధులను సమకూర్చుకోవడాన్ని పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వేస్ట్‌మెంట్) అంటారు.
➺ ఓటాన్‌అకౌంట్ :
బడ్జెట్ ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరం పూర్తి నిడివికి సంబందించి ఉంటుంది. అనగా ఏప్రిల్ 1వ తేది నుండి వచ్చే సంవత్సరం మార్చి 31వరకు ఉంటుంది. కానీ కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు పదవీకాలం ఈ మద్యకాలంలో ముగిస్తే పూర్తిస్థాయి బడ్జెన్‌ను ప్రవేశపెట్టడం కుదరదు. సదరు ప్రభుత్వం ఉండే పదవికాలానికి మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. దీనినే ఓటాన్‌అకౌంట్ అంటారు. ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
0 Comments