
భారత రక్షక దళాలు
India Gk in Telugu | General Knowledge in Telugu | Gk in Telugu
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
దీనిని 1978లో ఏర్పాటు చేశారు. కోస్ట్‌గార్డులు భారతదేశంలోని సువిశాల తీరరేఖని రక్షిస్తుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దీని మోటో వయంరక్షం (మేము కాపాడుతాం)
➺ బోర్డర్ సెక్యూరిటి ఫోర్స్ (బిఎస్‌ఎఫ్) :
దీనిని 1965 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. భారతదేశంలో ఉన్న అంతర్జాతీయ సరిహద్దును రక్షించడం దీని యొక్క ప్రధాన విధి. అవసరమైనప్పుడు దేశ సైన్యానికి సహాయంగా ఉంటుంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు.
➺ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ :
దీనిని 1939లో ఏర్పాటు చేశారు. కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల యొక్క పోలీసులకు సహాయసహకారాలు అందించడం దీని యొక్క ప్రధాన విధి. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు.
➺ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం :
దీనిని 1969లో ఏర్పాటు చేశారు. భారతదేశంలోని వివిధ పారిశ్రామిక సంస్థలు, పబ్లిక్ రంగ యూనిట్లకు ఈ భద్రతా దళం రక్షణ కల్పిస్తుంది. దీని యొక్క ప్రధాన కార్యాలయాన్ని న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు.
➺ ఇండ్లో - టిబెటన్ బోర్డర్ పోలీస్ :
దీనిని 1962లో ఏర్పాటు చేశారు. ఇది ఇండియా - టిబెట్ దేశాల సరిహద్దు ప్రాంతాన్ని నిరంతరం కాపాడడం ప్రధాన ధ్యేయం. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు.
Also Read :
➺ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) :
1887లో సెంట్రల్ స్పెషల్ బ్రాంచ్ పేరుతో ఏర్పాటు చేసిన దళాన్ని 1920లో ఇంటెలిజెన్స్ బ్యూరోగా మార్చారు. దేశ భద్రతకు అవసరమైన గూఢచార సమాచారాన్ని సేకరించడం, ప్రభుత్వానికి ముందే సూచనలు అందిస్తుంది.
➺ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ (సీబీఐ) :
దీనిని 1963లో ఏర్పాటు చేశారు. ప్రజాసేవకులు, అధికార దుర్వినియోగం, మోసాలు, వివిధ నేరాల విషయంలో దర్యాప్తు చేయడం దీని యొక్క ప్రధాన విధి.
➺ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ :
సంఘటన జరిగిన అతి తక్కువ సమయంలో చేరుకోవడం, వెంటనే స్పందించడం దీని యొక్క ప్రధాన విధి.
➺ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ :
దీనిని 1985లో ఏర్పాటు చేశారు. ఇందులో పనిచేసేవారు పూర్తిగా నల్లవేషధారణలో ఉంటారు. వీరిని బ్లాక్ క్యాట్ కమాండోలు అని కూడా పిలుస్తారు.
➺ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో :
దీనిని 1986లో ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో వివిధ నేరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, వివిధ దర్యాప్తు సంస్థలకు సహాయం చేయడం దీని ధ్యేయం.
➺ టెరిటోరియల్ ఆర్మీ :
దీనిని 1949 లో ఏర్పాటు చేశారు. అత్యవసర రక్షణ విషయంలో ఈ దళం రక్షక దళాలకు తోడుగా ఉండి పనిచేస్తుంది.
➺ రాష్ట్రీయ రైఫిల్స్ :
ఇది దేశంలో తీవ్రవాద నిరోధించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
➺ నేషనల్ కాడెట్‌కార్ప్స్ :
దీనిని 1948లో ఏర్పాటు చేశారు. దేశంలో యువతీయువలకు సైనిక శిక్షనిస్తుంది.హృదయ్ నాధ్ కుంజ్రు కమిటీ సిఫార్సుల ఆధారంగా దీన్ని స్థాపించారు.
➺ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) :
దీనిని 2008 ముంబాయి నగరంలో తీవ్రవాద దాడులు జరిగిన తర్వాత భారత ప్రభుత్వం ఎన్‌ఐఏ ఏర్పాటు చేసింది.
0 Comments