Modern Indian History (Simon Commission) in Telugu | సైమన్‌ కమీషన్‌ | Indian History in Telugu

Modern Indian History (Simon Commission) in Telugu | సైమన్‌ కమీషన్‌

సైమన్‌ కమీషన్‌ 
History in Telugu | Indian History in Telugu | Gk in Telugu 

 Indian History in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Indian History  Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, APPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే Indian History in Telugu పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

    జాన్‌ సైమన్‌ అధ్యక్షతన బ్రిటిష్‌ ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. భారత ప్రభుత్వ చట్టాన్ని సమీక్షించడానికి 1919 ఏర్పాటు చేశారు.  అప్పటి బ్రిటన్‌ ప్రధాని పనిచేసిన ‘బాల్విన్‌’ ఈ కమీషన్‌ను 1927లో నవంబర్‌లో నియమించారు. ఈ కమీషన్‌లో సభ్యులందరు బ్రిటిష్‌వారే ఉండడం వల్ల భారతీయులు సైమన్‌ కమీషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. మొదట ఈ కమీషన్‌ బొంబైలో పర్యటించింది. ఇండియాలో ఈ కమిషన్‌ రెండుసార్లు పర్యటించింది.

ఈ సైమన్‌ కమీషన్‌ను మద్రాసులో వ్యతిరేకించినందుకు టంగుటూరి ప్రకాశం పంతులుకు ‘ఆంధ్రకేసరి’, పంజాబ్‌లో వ్యతిరేకించినందుకు లాలా లజపతిరాయ్‌కి ‘పంజాబ్‌ కేసరి’ అనే బిరుదులు లభించాయి. సైమన్‌ కమీషన్‌ తన నివేదికను 1930లో సమర్పించింది. 

➺ కమీషన్‌ సిఫార్సులు :

  • భారత్‌లో సమాఖ్య ప్రభుత్వం ఏర్పాటు చేయడం 
  • మత నియోజకవర్గాల కొనసాగింపు 
  • రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి బాద్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు 
  • కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటు 
  • ప్రభుత్వ నిర్వహణలో భారతీయులకు స్వయంప్రతిపత్తిని కల్పించడం 
  • హైకోర్టులపై కేంద్రానికి పాలనపరమైన నియంత్రణ కల్పించడం 
  • భాషా ప్రాతిపాదికపై ఒరిస్సా, సింధ్‌ రాష్ట్రాల ఏర్పాటు 

Also Read :


➺ నెహ్రూ రిపోర్ట్‌ - 1928

మోతీలాల్‌ నెహ్రూ అధ్యక్షతన అఖిలభారత కాంగ్రెస్‌ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనిలో నలుగురు సభ్యులు ఉన్నారు. ఇది అతి తక్కువ కాలంలోనే స్వయంప్రతిపత్తితో కూడిన రాజ్యాంగాన్ని రూపొందించి బ్రిటిష్‌ ప్రభుత్వానికి సమర్పించింది. సైమన్‌గో బ్యాక్‌ ఉద్యమంతో కోపోద్రిక్తుడైన భారత రాజ్య కార్యదర్శి బెర్నెల్‌ హెడ్‌ భారతీయుల రాజ్యాంగాన్ని రూపొందించుకోగలరా.. అని విసిరిన సవాల్‌ను స్వీకరిస్తూ జాతీయ నాయకులు నెహ్రూ కమిటీని నియమించారు. 

➺ నెహ్రూ రిపోర్టు ముఖ్యాంశాలు 

  • శాసనసభకు కార్యనిర్వహణశాఖ బాద్యత వహించడం 
  • భాషా రాష్ట్రాలు, స్వయంప్రతిపత్తి రాష్ట్రాలతో కలిపి సమాఖ్య వ్యవస్థగా ఏర్పాటు కావడం 
  • ప్రాథమిక హక్కుల రూపకల్పన 
  • శాసనమండలిలో మైనార్టీలకు పది సంవత్సరాల పాటు రిజర్వేషన్‌
  • అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఇవ్వడం 


Also Read :

Post a Comment

0 Comments