
కర్ణాటక యుద్దాలు
➺ మొదటి కర్ణాటక యుద్ధం (1745-48) :
మొదటి కర్ణాటక యుద్దం బ్రిటీష్ సైన్యం మరియు ఫ్రెంచి సైన్యం మధ్య జరిగింది. యూరప్‌లో ఆస్ట్రియా వారసత్వ యుద్ద ప్రభావంతో భారతదేశంలో బ్రిటీష్ వారికి, ఫ్రెంచ్‌వారికి మధ్య యుద్దం మొదలు అయ్యింది. బార్నెట్ నాయకత్వంలోని ఆంగ్లేయ నౌకాదళం ఫ్రెంచ్ పడవలను స్వాధీనం చేసుకుంది. ప్రతిగా డూప్లే నాయకత్వంలోని ఫ్రెంచ్ సైన్యం మద్రాసును ఆక్రమించింది. ఆంగ్లేయులు తమను ఫ్రెంచ్‌వారి నుండి రక్షించాల్సిందిగా కర్ణాటక నవాబు అన్వరుద్దీన్‌ను కోరారు. అయితే నవాబు ఆజ్ఞలను ఫ్రెంచ్‌వారు ఉల్లంఘించారు. దీంతో ఫ్రెంచ్‌వారికి, అన్వరుద్దీన్ మధ్య మద్రాసు సమీపంలోని శాంథోమ్ వద్ద యుద్దం జరిగింది. ఈ యుద్దంలో నవాబు ఓడిపోయాడు.
Also Read :
➺ రెండో కర్ణాటక యుద్దం (1749-54) :
వారసత్వ యుద్ద సమయంలో ఫ్రెంచ్‌వారు హైదరాబాద్‌లో ముజఫర్ జంగ్‌కు, కర్ణాటకలో చందాసాహెబ్‌కు మద్దతు పలికారు. ఆంగ్లేయులు హైదరాబాద్‌లో నాజర్ జంగ్‌కు, కర్ణాటకలో అన్వరుద్దీన్ తర్వాత అతడి కుమారుడు మహ్మద్ ఆలీకి మద్దతిచ్చారు. 1749 లో ఫ్రెంచ్‌వారు హైదరాబాద్, కర్ణాటకల్లో తమ మద్దతుదారులు సింహాసనం అధిష్టించేలా చేశారు. కానీ బ్రిటీషు వారు రాబర్ట్ క్లైవ్ ఆధ్వర్యంలో ఆర్కాట్‌ను స్వాధీనం చేసుకున్నారు. చందాసాహెబ్‌ను చంపడంతో కర్ణాటక సింహాసనం మహ్మద్ అలీ వశమైంది.
➺ మూడో కర్ణాటక యుద్దం (1758-63) :
ఐరోపాలో 1756 లో సప్తవర్ష సంగ్రామం ప్రారంభమైంది. 1760లో జరిగిన వందవాస యుద్దంలో ఫ్రెంచ్ గవర్నర్ డి లాలీ ఆంగ్ల జనరల్ ఐర్‌కూట్ చేతిలో ఓడిపోయాడు. ఫ్రెంచ్ వారి స్థానంలో బ్రిటిష్‌వారు నిజాం సంరక్షణ బాద్యతలు చేపట్టారు. 1763లో ఆంగ్లేయులు ఫ్రెంచ్‌వారి మధ్య సంధి కుదిరింది.
ఇవి కూడా చదవండి :
- ఆంగ్లో - మరాఠా యుద్దాలు
- ఆంగ్లో - మైసూర్ యుద్దాలు
- ఆంగ్లో - సిక్కు యుద్దాలు
- పానిపట్టు యుద్దాలు
0 Comments