Indian History in Telugu | పానిపట్టు యుద్దాలు | Panipat Wars in Telugu |

Indian History in Telugu | పానిపట్టు యుద్దాలు | Panipat Wars in Telugu |

పానిపట్టు యుద్దాలు    

History in Telugu | Battles of Panipat 


Indian History in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Indian History  Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, APPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే Indian History in Telugu పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది. 

    పానిపట్టు యుద్దాలు ఉత్తరభారతదేశంలోని హర్యానాలోని పానిపట్‌ వద్ద జరిగాయి. భారత చరిత్రలో మూడు పానిపట్టు యుద్దాలు జరిగాయి. మొదటిది 1526 బాబర్‌ మరియు ఇబ్రహీలోడి మధ్య, రెండవది 1556 లో అక్భర్‌ మరియు హేము మధ్య మరియు మూడవది 1761లో ఆఫ్ఘన్ సామ్రాజ్యం మరియు మరాఠా సామ్రాజ్యం మధ్య జరిగాయి. ఈ మూడు యుద్దాలలో మొదటిది మొగలుల పరిపాలనకు ఆరంభం కాగా, రెండవది మొగలులు భారతదేశంలో తమ పట్టు నిలుపుకునేందుకు జరిగింది. మూడవ యుద్దం  పతనమయ్యేందుకు కారణం అయ్యింది. 

➺ మొదటి పానిపట్టు యుద్దం (1526) :

మొదటి పానిపట్టు యుద్దం మొఘల్‌ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్‌ మరియు ఇబ్రహీం లోడిల మధ్య 1526లో జరిగింది. ఈ యుద్దంలో బాబర్‌ అధునాతన యుద్ద పద్దతులను ఉపయోగించి ఇబ్రహీం లోడిపై విజయం సాధించాడు. ఈ యుద్దంలో విజయం సాధించడం ద్వారా బాబర్‌ భారతదేశంలో మొఘల్‌ సామ్రాజ్య స్థాపనకు నాందిగా నిలించింది. 

➺ రెండో పానిపట్టు యుద్దం (1556) :

రెండో పానిపట్టు యుద్దం మొఘల్‌ వారసుడైన అక్బర్‌ సంరక్షుడిగా ఉన్న బైరంఖాన్‌కు, ఆప్ఘనిస్తాన్‌కు చెందిన హిందూ సైన్యాధ్యక్షుడు హేముకు మధ్య జరిగింది. ఇందులో విజయం మొఘల్‌ నాయకుడు బైరంఖాన్‌ను వరించింది. దీంతో మొఘలులు అధికారంపై పట్టు నిలుపుకున్నారు.  


Also Read :


➺ మూడో పానిపట్టు యుద్దం (1761) :

మూడో పానిపట్‌ యుద్దం మహరాష్ట్రకు చెందిన రాజులకు ఆప్ఘనిస్తాన్‌ రాజైన అహ్మద్‌షా అబ్దాలీల మధ్య 1761 సంవత్సరంలో జరిగింది. మూడో పీష్వా తమ్ముడైన రఘునాథరావు అహ్మద్‌ షా అబ్దాలీ రాజ్యంలో భాగంగా ఉన్న పంజాబ్‌ను ఆక్రమించాడు. అక్కడ నుండి అతని రాజప్రతినిధిని తరిమివేయడం ఈ యుద్దానికి ప్రధాన కారణం. దీంతో అబ్దాలీ తన సైన్యంతో మహారాష్ట్రులపైకి దండేత్తి వచ్చాడు. మహారాష్ట్ర సైన్యాధ్యక్షునిగా సదాశివరావు వ్యవహరించాడు. ఇతనిడిని బావో సాహెబ్‌ అని కూడా పిలుస్తారు. ఇతడు పీష్వాకు దగ్గరి బందువు. భావో సమర్థుడైనా, అహంకారి. భరత్‌పూర్‌ను పాలించే జాట్‌ నాయకులు సూరజ్‌మల్‌, ఇతర సేనానాయకులు ప్రత్యక్ష యుద్దం కాకుండా ‘గెరిల్లా’ యుద్దం చేయమని ఇచ్చిన సలహాను పెడచెవిన పెట్టాడు. దీంతో సూరజ్‌మల్‌ తన సైన్యంతో వెనుతిరిగి వెళ్లిపోయాడు. అబ్దాలీ రోహిల్లాలు, ఔద్‌ నవాబు సహకారం పొందగలిగాడు. అబ్దాలీ ఆహార ధాన్యలను అడ్డగించడంతో మహారాష్ట్ర సైన్యం ఆకలితో అలమటించే పరిస్థితి వచ్చింది. సుమారు రెండున్నర నెలల పాటు సైన్యాలు ముఖాముఖి గా పోరాడాయి. చివరికి శత్రువులపై మహారాష్ట్రులు దాడి చేసారు. ఈ యుద్దంలో మహారాష్ట్రులు ఓడిపోయారు. సదాశివరావు, పీష్వా కుమారుడు విశ్వాసరావు యుద్దభూమిలో మరణించారు. సుమారు 2 లక్షల మహారాష్ట్రకు చెందిన వారు మరణించారు. మహాదాజి సింధియా కాలికి గాయమై యుద్దభూమి నుండి వెళ్లిపోయాడు. ఈ ఓటమితో కుంగిపోయిన పీష్వా అయిదు నెలల అనంతరం పుణేలో మరణించాడు. 

ఇవి కూడా చదవండి :


Also Read :

Post a Comment

0 Comments