మూడో పానిపట్టు యుద్దం ఎప్పుడు జరిగింది ? | Indian History in Telugu

మూడో పానిపట్టు యుద్దం ఎప్పుడు జరిగింది ? | Indian History in Telugu

మూడో పానిపట్టు యుద్దం 

మూడో పానిపట్టు యుద్దం ఎప్పుడు జరిగింది ? 

ఎ) 1751

బి) 1762

సి) 1763

డి) 1961

జవాబు : డి) 1961

మూడో పానిపట్‌ యుద్దం మహరాష్ట్రకు చెందిన రాజులకు ఆప్ఘనిస్తాన్‌ రాజైన అహ్మద్‌షా అబ్దాలీల మధ్య 1761 సంవత్సరంలో జరిగింది. మూడో పీష్వా తమ్ముడైన రఘునాథరావు అహ్మద్‌ షా అబ్దాలీ రాజ్యంలో భాగంగా ఉన్న పంజాబ్‌ను ఆక్రమించాడు. అక్కడ నుండి అతని రాజప్రతినిధిని తరిమివేయడం ఈ యుద్దానికి ప్రధాన కారణం. దీంతో అబ్దాలీ తన సైన్యంతో మహారాష్ట్రులపైకి దండేత్తి వచ్చాడు. మహారాష్ట్ర సైన్యాధ్యక్షునిగా సదాశివరావు వ్యవహరించాడు. ఇతనిడిని  బావో సాహెబ్‌ అని కూడా పిలుస్తారు. ఇతడు పీష్వాకు దగ్గరి బందువు. భావో సమర్థుడైనా, అహంకారి. భరత్‌పూర్‌ను పాలించే జాట్‌ నాయకులు సూరజ్‌మల్‌, ఇతర సేనానాయకులు ప్రత్యక్ష యుద్దం కాకుండా ‘గెరిల్లా’ యుద్దం చేయమని ఇచ్చిన సలహాను పెడచెవిన పెట్టాడు. దీంతో సూరజ్‌మల్‌ తన సైన్యంతో వెనుతిరిగి వెళ్లిపోయాడు. అబ్దాలీ రోహిల్లాలు, ఔద్‌ నవాబు సహకారం పొందగలిగాడు. అబ్దాలీ ఆహార ధాన్యలను అడ్డగించడంతో మహారాష్ట్ర సైన్యం ఆకలితో అలమటించే పరిస్థితి వచ్చింది. సుమారు రెండున్నర నెలల పాటు సైన్యాలు ముఖాముఖి గా పోరాడాయి. చివరికి శత్రువులపై మహారాష్ట్రులు దాడి చేసారు. ఈ యుద్దంలో మహారాష్ట్రులు ఓడిపోయారు. సదాశివరావు, పీష్వా కుమారుడు విశ్వాసరావు యుద్దభూమిలో మరణించారు. సుమారు 2 లక్షల మహారాష్ట్రకు చెందిన వారు మరణించారు. మహాదాజి సింధియా కాలికి గాయమై యుద్దభూమి నుండి వెళ్లిపోయాడు. ఈ ఓటమితో కుంగిపోయిన పీష్వా అయిదు నెలల అనంతరం పుణేలో మరణించాడు. 


Also Read :


Post a Comment

0 Comments