
లోక్‌సభ అధికారాలు - విధులు జీకే ప్రశ్నలు - జవాబులు
Powers and Functions of Lok Sabha Gk Questions in Telugu with Answers
☛ Question No.1
భారత పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు ?
ఎ) రాష్ట్రపతి
బి) ఉపరాష్ట్రతి
సి) లోక్‌సభ స్పీకర్
డి) ప్రధానమంత్రి
జవాబు : సి) లోక్‌సభ స్పీకర్
☛ Question No.2
లోక్‌సభ సభ్యుని పదవీకాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ?
ఎ) 5 సంవత్సరాలు
బి) 6 సంవత్సరాలు
సి) 4 సంవత్సరాలు
డి) 8 సంవత్సరాలు
జవాబు : ఎ) 5 సంవత్సరాలు
☛ Question No.3
వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించే ముందు లోక్‌సభలోని ఏ కమిటీ పరిశీలిస్తుంది ?
ఎ) పబ్లిక్ అకౌంట్స్ కమిటీ
బి) అంచనాల కమిటీ
సి) పబ్లిక్ అండర్ టేకింగ్‌పై కమిటీ
డి) పిటిషన్లపై కమిటీ
జవాబు : బి) అంచనాల కమిటీ
☛ Question No.4
ఒక సాధారణ బిల్లుపై లోక్‌సభ మరియు రాజ్యసభ మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే ఏమవుతుంది ?
ఎ) రాష్ట్రపతి నిర్ణయిస్తారు
బి) బిల్లు తీర్మాణం కోసం సంయుక్త కమిటీకి పంపబడుతుంది
సి) ప్రతిష్టంభన పరిష్కరించడానికి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేస్తారు
డి) బిల్లు రద్దు చేయబడుతుంది
జవాబు : సి) ప్రతిష్టంభన పరిష్కరించడానికి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేస్తారు
☛ Question No.5
ఈ క్రిందివాటిలో ద్రవ్యబిల్లుకు సంబంధించి సరైన దానిని గుర్తించండి ?
ఎ) ద్రవ్య బిల్లులు లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెడతారు
బి) మనీ బిల్లులను రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెడతారు
సి) ద్రవ్యబిల్లులను లోక్‌సభ లేదా రాజ్యసభలో ప్రవేశపెడతారు
డి) ద్రవ్యబిల్లులు ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి ఆమోదం అవసరం
జవాబు : ఎ) ద్రవ్య బిల్లులు లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెడతారు
☛ Question No.6
స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగకముందు లోక్‌సభ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు ?
ఎ) ప్రధానమంత్రి
బి) ప్రతిపక్ష నాయకుడు
సి) ప్రొటెం స్పీకర్
డి) రాష్ట్రపతి
జవాబు : సి) ప్రొటెం స్పీకర్
☛ Question No.7
లోక్‌సభ సభ్యుడు కావడానికి ఎన్ని సంవత్సరాల వయస్సు ఉండాలి ?
ఎ) 21 సంవత్సరాలు
బి) 25 సంవత్సరాలు
సి) 30 సంవత్సరాలు
డి) 35 సంవత్సరాలు
జవాబు : బి) 25 సంవత్సరాలు
Also Read :
☛ Question No.8
లోక్‌సభ పదవీకాలం పూర్తి కాకముందే రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది ?
ఎ) భారత రాష్ట్రపతి
బి) ప్రధానమంత్రి
సి) లోకసభ స్పీకర్
డి) సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
జవాబు : ఎ) భారత రాష్ట్రపతి
☛ Question No.9
ఒక సాధారణ శాసనబిల్లుపై లోక్‌సభ మరియు రాజ్యసభ మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన సందర్భంలో రాష్ట్రపతి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు ?
ఎ) బిల్లును పూర్తిగా రద్దు చేయవచ్చు
బి) ఉభయ సభలను సమావేశం ఏర్పాటు చేయవచ్చు
సి) మధ్యవర్తిత్వం కోసం ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు రిఫర్ చేయవచ్చు
డి) బిల్లును విటో చేసి పున:పరిశీలన కోసం తిరిగి పంపవచ్చు
జవాబు : బి) ఉభయ సభలను సమావేశం ఏర్పాటు చేయవచ్చు
☛ Question No.10
లోక్‌సభలో ‘ప్రశ్నల సమయం’ అనే పదం దేనిని సూచిస్తుంది ?
ఎ) ప్రశ్నలను లేవనెత్తడానికి సభ్యులకు సమయం కేటాయించబడింది
బి) ముఖ్యమైన బిల్లులపై చర్చ జరిగే సమయం
సి) ప్రధాని ప్రశ్నలకు సమాధానాలు చెప్పే సమయం
డి) రాష్ట్రపతిని ప్రశ్నించే సెషన్
జవాబు : ఎ) ప్రశ్నలను లేవనెత్తడానికి సభ్యులకు సమయం కేటాయించబడింది
☛ Question No.11
పార్టీ ఫిరాయింపుల కారణంగా లోక్‌సభ సభ్యుడిని అనర్హులుగా ప్రకటించే అధికారం ఎవరికి ఉంటుంది ?
ఎ) లోక్‌సభ స్పీకర్
బి) భారత రాష్ట్రపతి
సి) ఎన్నికల సంఘం
డి) ప్రధానమంత్రి
జవాబు : ఎ) లోక్‌సభ స్పీకర్
☛ Question No.12
భారత పార్లమెంటులో ఒక బిల్లు ద్రవ్య బిల్లు అవునా .. కాదా అని ఎవరు నిర్ణయిస్తారు ?
ఎ) భారత రాష్ట్రపతి
బి) లోక్‌సభ స్పీకర్
సి) ప్రధానమంత్రి
డి) రాజ్యసభ చైర్మన్
జవాబు : బి) లోక్‌సభ స్పీకర్
☛ Question No.13
పార్లమెంటు ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించడం లేదా తిరస్కరించే విధానాన్ని ఏమంటారు ?
ఎ) వీటో అధికారం
బి) పాకేట్ విటో అధికారం
సి) రాజ్యాంగ విటో అధికారం
డి) ఎగ్జిక్యూటీవ్ విటో అధికారం
జవాబు : ఎ) వీటో అధికారం
☛ Question No.14
భారత పార్లమెంటు రెండు సమావేశాలకు మధ్య గరిష్టంగా ఎంత కాలం ఉంటుంది ?
ఎ) 3 నెలలు
బి) 4 నెలలు
సి) 6 నెలలు
డి) ఒక సంవత్సరం
జవాబు : సి) 6 నెలలు
☛ Question No.15
కేంద్ర బడ్జెట్‌ను ఏ సభలో ప్రవేశపెడతారు ?
ఎ) లోక్‌సభ
బి) రాజ్యసభ
సి) ఎ మరియు బి
డి) ఏవీకావు
జవాబు : ఎ) లోక్‌సభ
0 Comments