
రాజ్యసభ ప్రత్యేక అధికారాలు జీకే ప్రశ్నలు - జవాబులు
Powers of Rajya Sabha Gk Questions in Telugu with Answers
☛ Question No.1
భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాజ్యసభ ప్రత్యేక అధికారాలతో వ్యవహరిస్తుంది ?
ఎ) ఆర్టికల్ 80
బి) ఆర్టికల్ 100
సి) ఆర్టికల్ 352
డి) ఆర్టికల్ 370
జవాబు : ఎ) ఆర్టికల్ 80
☛ Question No.2
ఒక వ్యక్తి రాజ్యసభ సభ్యునిగా ఉండాలంటే కనీస వయస్సు ఎంత ఉండాలి ?
ఎ) 25 సంవత్సరాలు
బి) 30 సంవత్సరాలు
సి) 35 సంవత్సరాలు
డి) 40 సంవత్సరాలు
జవాబు : బి) 30 సంవత్సరాలు
☛ Question No.3
రాజ్యసభకు సంబంధించిన విషయాలలో ప్రత్యేక అధికారాలు ఏవి ?
ఎ) మనీబిల్లులు
బి) రాష్ట్ర శాసనాలు
సి) రాజ్యాంగ సవరణ
డి) పైవన్నీ
జవాబు :డి) పైవన్నీ
☛ Question No.4
రాజ్యసభ సభ్యులు ఎలా ఎన్నికవుతారు ?
ఎ) ప్రజల ద్వారా ప్రత్యక్ష ఎన్నికలు
బి) రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ ద్వారా ఎన్నుకోబడతారు
సి) రాష్ట్రపతిచే నామినేట్ చేయబడుతారు
డి) బి మరియు సి
జవాబు : డి) బి మరియు సి
☛ Question No.5
అఖిల భారత సర్వీసులలో రాజ్యసభ పాత్రకు సంబంధించి ఈ క్రిందివాటిలో ఏది నిజం ?
ఎ) ఇది సొంతంగా అఖిల భారత సేవలను సృష్టిస్తుంది
బి) ఆల్ ఇండియా సర్వీసెస్ ఏర్పాటులో దీని పాత్ర ఉండదు
సి) ఇది సూచనలు మాత్రమే ఇవ్వగలదు మరియు తుది నిర్ణయం లోక్‌సభ తీసుకుంటుంది
డి) ఇది అఖిల భారత సేవలను సృష్టిస్తుంది కానీ రాష్ట్రపతి ఆమోదంతో మాత్రమే
జవాబు : సి) ఇది సూచనలు మాత్రమే ఇవ్వగలదు మరియు తుది నిర్ణయం లోక్‌సభ తీసుకుంటుంది
☛ Question No.6
రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ?
ఎ) 4 సంవత్సరాలు
బి) 5 సంవత్సరాలు
సి) 6 సంవత్సరాలు
డి) 8 సంవత్సరాలు
జవాబు : సి) 6 సంవత్సరాలు
☛ Question No.7
ఈ క్రిందివాటిలో రాజ్యసభకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి ?
ఎ) ఇది భారతదేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్య వహిస్తుంది
బి) దీని సభ్యులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలచే ఎన్నుకోబడతారు
సి) ఇది శాశ్వత సభ మరియు రద్దుకు లోబడి ఉండదు
డి) ఇది భారత ఉపరాష్ట్రపతిని తొలగించే ప్రక్రియను ప్రారంభిస్తుంది
జవాబు : బి) దీని సభ్యులు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలచే ఎన్నుకోబడతారు
Also Read :
☛ Question No.8
రాష్ట్ర జాబితాలోని ఒక అంశంపై చట్టాలను కల్గి ఉండటం అవసరమని ప్రకటించే అధికారం రాజ్యసభకు ఉంటుంది. దీనిని ఏమని పిలుస్తారు ?
ఎ) అవశేష అధికారాలు
బి) ఉమ్మడి జాబితా
సి) అత్యవసర అధికారాలు
డి) ఆల్‌ఇండియా సర్వీసెస్
జవాబు : సి) అత్యవసర అధికారాలు
☛ Question No.9
ఒక సాధారణ శాసనబిల్లుపై లోక్‌సభ మరియు రాజ్యసభ మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన సందర్భంలో రాష్ట్రపతి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు ?
ఎ) బిల్లును పూర్తిగా రద్దు చేయవచ్చు
బి) ఉభయ సభలను సమావేశం ఏర్పాటు చేయవచ్చు
సి) మధ్యవర్తిత్వం కోసం ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు రిఫర్ చేయవచ్చు
డి) బిల్లును విటో చేసి పున:పరిశీలన కోసం తిరిగి పంపవచ్చు
జవాబు :బి) ఉభయ సభలను సమావేశం ఏర్పాటు చేయవచ్చు
☛ Question No.10
ఒక రాష్ట్రంలో రాజ్యాంగం యంత్రాంగం వైఫల్యం కారణంగా అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాజ్యసభ పాత్ర ఏమిటీ ?
ఎ) రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయవచ్చు
బి) ఇది రాష్ట్ర శాసనసభను రద్దు చేయగలదు
సి) రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయవచ్చు
డి) అలాంటి విషయాల్లో రాజ్యసభ పాత్ర ఉండదు
జవాబు : సి) రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయవచ్చు
☛ Question No.11
మనీ బిల్లుపై ఉభయ సభల మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడినప్పుడు రాష్ట్రపతి ఎవరి సలహా తీసుకోవచ్చు ?
ఎ) ప్రధానమంత్రి
బి) లోక్‌సభ స్పీకర్
సి) రాజ్యసభ
డి) కేంద్ర ఆర్థిక మంత్రి
జవాబు : ఎ) ప్రధానమంత్రి
☛ Question No.12
రాజ్యసభ సమావేశాన్ని నిర్వహించడానికి అవసరమై కోరం ఏమిటీ ?
ఎ) మొత్తం సభ్యులలో మూడింట ఒక వంతు
బి) మొత్తం సభ్యులలో సగం
సి) మొత్తం సభ్యులలో మూడింట రెండు వంతులు
డి) మొత్తం సభ్యులలో మెజారిటీ
జవాబు : ఎ) మొత్తం సభ్యులలో మూడిరట ఒక వంతు
☛ Question No.13
భారత రాజ్యాంగం సూచించిన రాజ్యసభ గరిష్ట సభ్యులు ఎంత మంది ?
ఎ) 200
బి) 250
సి) 300
డి) రాజ్యసభకు గరిష్ట సంఖ్య లేదు
జవాబు : బి) 250
☛ Question No.14
ఈ క్రిందవాటిలో ఏ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు ?
ఎ) మనీబిల్లు
బి) ఆర్థిక బిల్లు
సి) సాధారణ బిల్లు
డి) ఎ మరియు బి
జవాబు :సి) సాధారణ బిల్లు
☛ Question No.15
బిల్లుపై ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ఉభయ సభల ఉమ్మడి సమావేశం సందర్భంలో అసమ్మతి ఉంటే ఎవరి నిర్ణయం తుది నిర్ణయంగా ఉంటుంది ?
ఎ) లోక్‌సభ
బి) రాజ్యసభ
సి) ఉపరాష్ట్రపతి
డి) రాష్ట్రపతి
జవాబు : ఎ) లోక్‌సభ
0 Comments