
శ్రీ కృష్ణదేవరాయలు
శ్రీ కృష్ణదేవరాయలు 1509 నుండి 1529 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. బహమనీ సుల్తానులు, గజపతులకు వ్యతిరేకంగా విజయనగర సామ్రాజ్యాన్ని విజయవంతంగా పాలించిన గొప్ప యోధుడు. ఇతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కర్ణాటక, ఆంధ్ర , తమిళనాడు ప్రాంతాలలోని నాయకులను అణచివేశాడు. ప్రత్యేకంగా దక్షిణ ప్రాంతం, కృష్ణా నది తూర్పు తీర ఓడరేవులపై నియంత్రణ సాధించాడు. ఇదే సమయంలో పశ్చిమ తీరంలో గోవాలో పోర్చుగీసువారు ఓడరేవుల వద్ద స్థావరాలు ఏర్పరచుకొని నియంత్రణ సాధించారు. శ్రీ కృష్ణదేవరాయలు వీరితో స్నేహపూర్వక సంబంధాలు నెలకొల్పాడు. ప్రతి సంవత్సరం విజయదశమి సందర్భంగా సైనిక ప్రదర్శన నిర్వహించేవారు.
➺ ఆలయాల నిర్మాణం :
శ్రీ కృష్ణదేవరాయలు అనే వైష్ణవాలయాలతో పాటు శివాలయాలను నిర్మించాడు. వ్యాసరాయలు ఇతని గురువుగా ఉండేవాడు. ఇతను శ్రీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పరమ భక్తుడు. తిరుమలకు వెళ్లి అనేక దానాలు చేయడమే కాకుండా తన కుమారునికి తిరుమల దేవరాయలు అని, కుమార్తెకు తిరుమాంబ అని పేరు పెట్టాడు. కప్పట్రాళ్ల వద్ద చెన్నకేశవస్వామి ఆలయాన్ని నిర్మించాడు. విజయనగరంలో కృష్ణాలయం, హజరారామాలయం కట్టించాడు. తిరుపతి, శ్రీకాళహస్తి, కంచి, సింహాచలం, అహోబిలం ఆలయాలకు గోపురాలు మండపాలు నిర్మించాడు. పోర్చుగీసు యాత్రికుడైన డొమింగో పేస్ విజయనగర సామ్రాజ్యాన్ని రోమ్‌తో పోల్చాడు.
Also Read :
➺ సాహిత్యానికి పెద్దపీట :
శ్రీ కృష్ణదేవరాయలు స్వయంగా కవి. ఇతడికి సంగీత, సాహిత్య, సమరాంగణ సార్వభౌముడు అనే బిరుదు ఉంది. ఇతడు సంస్కృతంలో జాంబవతీ కళ్యాణం, మదాలస చరితం, సత్యవధూపరిణయం, సకలకథాసారి సంగ్రహం, జ్ఞానచింతామణి, రసమంజరి వంటి గ్రంథాలను లిఖించాడు. తెలుగులో అముక్తమాల్య (గంగాదేవి కథ) ను రచించాడు. దేశభాషలందు తెలుగు లెస్స అనే మాటలు శ్రీ కృష్ణదేవరాయలు కలం నుండి వచ్చినవే. శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానానికి ‘భువన విజయం’ అనే పేరు ఉండేది. ఇందులో
- అల్లసాని పెద్దన
- నంది తిమ్మన
- ధూర్జటీ
- మాదయ్యగారి మల్లన
- అయ్యలరాజు రామభద్రుడు
- పింగళి సూరన
- రామరాజభూషణుడు
- తెనాలి రామకృష్ణుడు
వంటి 8 మంది కవులు కొలువుతిరేవారు. ఈ 8 మంది కవులు ‘అష్టదిగ్గజాలు’ గా ప్రసిద్ది చెందారు.
➺ అష్టదిగ్గజాలు రచించిన రచనలు :
- అల్లసాని పెద్దన - స్వారోచిత మనుసంభవం (మనుచరిత్ర)
- నంది తిమ్మన - పారిజాతాపహరణం
- మాదయ్యగారి మల్లన - రాజశేఖర చరిత్ర
- ధూర్జటీ - శ్రీ కాళహస్తి మహత్యం
- అయ్యలరాజు రామభద్రుడు - రామాభ్యుదయం
- పింగళి సూరన - రాఘవ పాండవీయం
- రామరాజ భూషణుడు - కావ్యాలంకార సంగ్రహం, వసు చరిత్రం, హరిశ్చంద్రోపాఖ్యానం
- తెనాలి రామకృష్ణ - ఉద్భటారాధ్య చరిత్రం, పాండురంగ మహాత్యం, ఘటికాచల మహాత్యం
శ్రీ కృష్ణదేవరాయలు వారసులైన అచ్యుతదేవరాయ, ఆళియ రామరాయల కాలంలో విజయనగర రాజుల ప్రాబల్యం మరింతగా పెరిగింది. వీరు బహమనీ సుల్తానుల రాజ్య వ్యవహరాలలో జోక్యం చేసుకున్నారు. వీరి నిరంతర జోక్యం ఫలితంగా ఆందోళన చెందిన ఐదుగురు బహమనీ సుల్తానులు 1565లో ఏకమై రక్కసి తంగడి యుద్దం లేదా తళ్లికోట యుద్దంలో రామరాయలను ఓడించి విజయనగర పట్టణాన్ని దోచుకొని సర్వనాశనం చేశారు. అనంతరం వచ్చిన వారసులు రాజధానిని తిరుపతి సమీపంలోని చంద్రగిరికి తరలించారు. కానీ పూర్వ వైభవాన్ని సాధించలేకపోయారు. కొంత భాగాన్ని సుల్తానులు ఆక్రమించుకోగా మిగిలిన భూభాగాలపై నాయకులు స్వతంత్ర రాజులుగా ప్రకటించుకున్నారు.
Relates Posts:
0 Comments