
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ About B. R. Ambedkar in Telugu | Gk in Telugu
అంబేద్కర్ మధ్యప్రదేశ్‌లో 14 ఏప్రిల్ 1891న జన్మించాడు. అంబేడ్కర్ పూర్తి పేరు భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్. సైన్యంలో పనిచేస్తున్న అతని తండ్రి పిల్లల్ని చదువుకోమని ప్రోత్సహించాడు. రోజువారీ జీవితంలో కుల వివక్షతకు గురి కావడం అంటే ఏమిటో అంబేద్కర్ బాల్యంలోనే అనుభవించాడు. బడిలో అంబేద్కర్, ఇతర అంటరాని పిల్లలను వేరుగా కూర్చోపెట్టేవాళ్లు టీచర్లు వాళ్లపై శ్రద్ద చూపేవాళ్లు కాదు. వాళ్లకి దాహం అయితే మంచినీళ్ల కుండను తాకగూడదు కాబట్టి ఉన్నత కులానికి చెందిన ఎవరైనా పైనుంచి నీళ్లు పోయాల్సి వచ్చేది. అనేక సామాజిక, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని భారతదేశంలో కళాశాల విద్య పూర్తి చేసిన మొదటి దళితులలో అంబేద్కర్ ఒకరు.
పై చదువులకు అంబేద్కర్ అమెరికా, ఇంగ్లండ్ దేశాలకు వెళ్లాడు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత న్యాయవాద వృత్తిని చేపట్టాడు. టీచరుగా పనిచేశాడు. 1927లో దళితులు హిందూ దేవాలయాల్లో ప్రవేశం కోసం, ప్రభుత్వ తాగునీటి వనరుల నుండి నీళ్లు ఉపయోగించుకునే హక్కుల కోసం ఉద్యమాలు చేపట్టాడు. కుల వ్యవస్థపై, ప్రత్యేకంగా అంటరానితనంపై జాతీయ ఉద్యమం దృష్టి నిలపాలని, తద్వారా చారిత్రక వారసత్వంగా వస్తున్న కులవివక్ష లేని స్వతంత్ర భారతదేశం కావాలని అంబేద్కర్ ఆకాంక్షించాడు. దళితులను చైతన్య పరచడంలో అతడు చేసిన కృషిని గుర్తించి ‘భారతదేశ రాజకీయ భవిష్యత్తు’ అన్న అంశంపై 1932లో వలస ప్రభుత్వం నిర్వహించిన సమావేశానికి అతడిని ఆహ్వానించారు.
Also Read :
శాసనసభలలో దళిత అభ్యర్థులకు దళితులు వేరుగా ఓటు వేయాలని దళిత అభ్యర్థులకు దళితులు వేరుగా ఓటు వేయాలని అతడు వాదించాడు. బ్రిటిషు ప్రభుత్వం ఈ ప్రతిపాదనను అంగీకరించింది. కానీ గాంధీజీ దానిని వ్యతిరేకించాడు. చివరికి దళితులకు కొన్ని సీట్లు రిజర్వు చేసి అందరు వాళ్లకు ఓట్లు వేసేలా అంగీకారానికి వచ్చారు. దళితుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించేందుకు అంబేద్కర్ ‘ఇండిపెండెంట్ లేబర్ పార్టీ’ ని స్థాపించాడు.
1932 ప్రాంతంలో అంటరానితనానికి వ్యతిరేకంగా గాంధీజీ ఉద్యమ ప్రారంభించాడు. ‘అంటరాని’ కులాల వాళ్లకు అతడు ‘హరిజనులు’ అంటే ‘దేవుడి ప్రజలు’ అని పేరు పెట్టాడు. దేవాలయాలు, నీటి వనరులు, పాఠశాలలు వంటి వాటిల్లో ప్రవేశహక్కులు, సమాన హక్కులు కల్పించాలని ఆశించాడు. ఈ ఉద్యమాన్ని కాంగ్రెస్ పెద్ద ఎత్తున చేపట్టడంతో జాతీయ ఉద్యమంలో దళితులు లక్షల సంఖ్యలో చేరారు. 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత దేశానికి మొదటి న్యాయశాఖ మంత్రిగా పదవి చేపట్టమని అంబేద్కర్‌ను ఆహ్వనించారు. భారతదేశానికి కొత్త రాజ్యాంగాన్ని రాసే రచనా సంఘానికి అంబేద్కర్‌ని చైర్మన్‌గా రాజ్యాంగ సభ నియమించింది. అంబేద్కర్ రాసిన ముసాయిదాలో పౌరుల విస్తృత స్వేచ్ఛా స్వాతంత్రాలకు, హక్కులకు రాజ్యాంగ పరంగా హామి లభించింది. మహిళలకు విస్తృత సమాజిక, ఆర్థిక హక్కుల కోసం అంబేడ్కర్ పోరాడారు. షెడ్యూల్డు కులాలు, తెగలకు పాఠశాలలు, కళాశాలల్లో, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సభను అంబేద్కర్ ఒప్పించగలిగాడు. 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారతరత్నను అంబేద్కర్ మరణాంతరం ప్రకటించింది.
0 Comments