ఇండియా జీయోగ్రఫీ - దక్కన్ పీఠభూమి
Indian Geography in Telugu | Deccan Plateau in Telugu | General Knowledge in Telugu
పశ్చిమ కనుమలు
పశ్చిమ కనుమలు యొక్క సరాసరి ఎత్తు 900 మీటర్ల నుండి 1600 మీటర్ల వరకు ఉంటాయి. వీటి యొక్క ఎత్తు ఉత్తరం దిశ నుండి దక్షిణ దిశకు వెళ్లే కొద్ది ఎత్తు పెరుగుతుంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి ప్రాంతాల్లో వీటి యొక్క ఎత్తు సుమారు 200 మీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. పశ్చిమ కనుమల్లో అత్యంత ఎత్తైన శిఖరం కేరళ రాష్ట్రంలోని అన్నామలై కొండల్లో గల అనైముడి/ఏనుగు కొండలు శిఖరం. దీని యొక్క ఎత్తు 2695 మీటర్లు ఉంటుంది. దీనిని దక్షిణ భారతదేశ ఎవరెస్టు అని కూడా పిలుస్తారు. ఈ పశ్చిమ కనుమలు వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.
- మహారాష్ట్ర, గోవా - సహ్యాద్రి కొండలు,
- కర్ణాటక - బాబా బుడాన్ కొండలు, కుద్రేముఖ్ కొండలు, బ్రహ్మగిరి కొండలు, వరాహగిరి కొండలు, రత్నగిరి కొండలు, కూర్గ్ కొండలు
- తమిళనాడు, కేరళ - నీలగిరి కొండలు, కార్ధమం కొండలు, యాలకుల కొండలు
➺ నీలగిరి పర్వతాలు :
నీలగిరి పర్వతాలు ప్రధానంగా తమిళనాడు రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి. ఇందులో దొడబెట్ట (2637 మీటర్లు) అతిపెద్ద శిఖరం. ఇక్కడ వేసవిలో చల్లని ఆహ్లదాన్ని ఇచ్చే ఊటి ఉంటుంది. భారతదేశంలో మొట్టమొదటి సారిగా 1986 లో ఏర్పాటు చేసిన బయోస్పియర్ రిజర్వ్‌ను ఈ కొండల్లో ఏర్పాటు చేశారు. సైలెంట్ వ్యాలీ, బందీపూర్ నేషనల్ పార్కు, సత్యమంగళం అడవులు ఈ నీలగిరి పర్వతాలలో నెలకొని ఉన్నాయి.
Also Read :
తూర్పు కనుమలు
ఉత్తర ఒడిశా నుండి దక్షిణ తమిళనాడు వరకు సుమారు 1200 కి.మీ పొడవు, 150 కి.మీ వరకు వెడల్పుతో తూర్పుకనుమలు విస్తరించి ఉన్నాయి. తూర్పు కనుమలు ఖాండోలైట్, చార్నోకైట్ వంటి పురాతన శిలలతో ఏర్పడ్డాయి. పశ్చిమ కనుమల కంటే తూర్పుకనుమలు తక్కువ ఎత్తులో ఉండి, ద్వీపకల్ప నదులు వీటిని ఖండిస్తూ ప్రవహిస్తున్నాయి. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం అరమొకొండ (1680మీ). దీనినే జిందగడ / సీతమ్మకొండ అని పిలుస్తారు.
- తూర్పు శ్రేణులు
- కడప శ్రేణులు
- తమిళనాడు శ్రేణులు
తూర్పు కనుమలను 3 భాగాలుగా విభజించడం జరిగింది.
1) తూర్పు శ్రేణులు :
మహానది, గోదావరి నది మధ్య ఉన్న ప్రాంతం తూర్పు శ్రేణులు విస్తరించి ఉన్నాయి. మొత్తం తూర్పు కనుమల్లో పర్వత లక్షణాలు ఉన్న శ్రేణులు ఇవి మాత్రమే. ఇందులో మాడుగల కొండలు, మలయ కొండలు కలిసి ఉన్నాయి.
తూర్పు శ్రేణుల్లో విస్తరించి ఉన్న కొండలు
కైలాస శ్రేణి, యారాడ శ్రేణులు, అమ్రాబాద్ గుట్టలు, మొగల్రాజపుర కొండలు, కొండపల్లి కొండలు, ఇమర గిరులు, కోరాపుట్ కొండలు, జయపూర్ కొండలు, మయూర్‌భంజ్, మేఘసాని కొండలు
2) కడప శ్రేణులు :
కడప శ్రేణులు కృష్ణా మరియు పాలార్ నదుల మధ్య విస్తరించి ఉన్నాయి. ఇందులో బైరేని కొండ అత్యంత ఎత్తైనవి. ఇవేకాకుండా వెలికొండలు, ఎర్రమల కొండలు, పాలకొండలు, శేషాచల కొండలు ఇందులో ఇమిడి ఉన్నాయి.
3) తమిళనాడు దక్షిణ శ్రేణులు :
ఇవి పాలార్ నది నుండి వైపర్ నది వరకు విస్తరించి ఉన్నాయి. ఈ శ్రేణులు కావేరి, వైగై, వైపర్ నదులను ఖండిస్తూ ప్రవహిస్తుంటాయి.
0 Comments