
తెలంగాణ ఉద్యమ చరిత్ర (1956-1968) జీకే ప్రశ్నలు - జవాబులు Part -1
Telangana Movement History MCQ Gk Questions with Answers in Telugu
☛ Question No.1
ఈ క్రిందివాటిలో పెద్దమనుషుల ఒప్పందంకు సంబంధించి సరైన వ్యాక్యాలను గుర్తించండి ?
1) ఢిల్లీ లోని హైదరాబాద్ హౌజ్‌లో 20 ఫిబ్రవరి 1956న ఆంధ్ర మరియు తెలంగాణ నాయకుల మధ్య పెద్దమనుషుల ఒప్పందం జరిగింది.
2) విశాలాంధ్ర ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రజల భయాలను పోగొట్టడానికి, వారికి రక్షణలు కల్పించే ఉద్దేశ్యంతో పెద్దమనుషుల ఒప్పందం జరిగింది.
3) ఇది అప్పటి హోంమంత్రి వై.బి చౌవాన్ సమక్షంలో జరిగింది.
ఎ) 1, 2 మరియు 3
బి) 1 మరియు 3 మాత్రమే
సి) 1 మరియు 2 మాత్రమే
డి) 2 మరియు 3 మాత్రమే
జవాబు : సి) 1 మరియు 2 మాత్రమే
గోవింద వల్లభ్‌పంత్ ఆధ్వర్యంలో జరిగింది.
☛ Question No.2
ఈ క్రిందివాటిలో పెద్దమనుషుల ఒప్పందానికి హజరుకాని వ్యక్తిని గుర్తించండి ?
ఎ) జే.వి నర్సింగరావు
బి) అల్లూరి సత్యనారాయణరాజు
సి) ప్రకాశం పంతులు
డి) బెజవాడ గోపాలరెడ్డి
జవాబు : సి) ప్రకాశం పంతులు
☛ Question No.3
ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) పెద్దమనుషుల ఒప్పందంలో కుదిరిన అంశాలపై 8 మంది సంతకాలు చేశారు
2) ఈ ఒప్పందంలో సంతకం చేసిన వారందరూ కాంగ్రెస్ పార్టీకి చెందినవారే ఉన్నారు
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) రెండూ కావూ
జవాబు : సి) 1 మరియు 2
☛ Question No.4
పెద్దమనుషుల ఒప్పందంలో లేని ఈ క్రింది అంశం ఏది ?
ఎ) తెలంగాణ మద్యపాన నిషేదాన్ని తెలంగాణ ప్రాంత విధాన సభ సభ్యులు నిర్ణయించిన ప్రకారం కొనసాగిస్తారు.
బి) రాబోయే కాలంలోని ఉద్యోగాలలో తెలంగాణ ప్రాంతానికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి.
సి) తెలంగాణలో అప్పటికి ఉన్న విద్యా సౌకర్యాలను తెలంగాణ విద్యార్థులకు మాత్రమే కేటాయించాలి
డి) ప్రభుత్వ సర్వీసు నియామకానికి సంబంధించి ఉద్యోగుల్లో తెలంగాణ వారికి తెలుగు నిర్భందం చేయరాదు
జవాబు : బి) రాబోయే కాలంలోని ఉద్యోగాలలో తెలంగాణ ప్రాంతానికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి.
☛ Question No.5
పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ప్రాంతీయ మండలిలో ఎంతమంది సభ్యులు ఉండాలి ?
ఎ) 15
బి) 20
సి) 35
డి) 25
జవాబు : బి) 20
Also Read :
☛ Question No.6
ఈ క్రిందవాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం మంత్రివర్గంలో ఆంధ్రప్రాంతం వారు 60%, తెలంగాణ ప్రాంతం వారు 40% ఉండాలి
2) ఈ ఒప్పందం ప్రకారం 1961 వరకు తెలంగాణకు ప్రత్యేక కాంగ్రెస్ కమిటీ ఉండాలి
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) రెండూ కావు
జవాబు : ఎ) 1 మాత్రమే
☛ Question No.7
పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ఏర్పడిన తెలంగాణ ప్రాంతీయ మండలి ఒక.. ?
ఎ) రాజ్యాంగ సంస్థ
బి) చట్టబద్ద సంస్థ
సి) రాజ్యాంగేతర సంస్థ
డి) సలహా సంఘం
జవాబు : బి) చట్టబద్ద సంస్థ
☛ Question No.8
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్లును రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ ఏ రోజున ఆమోదించడం జరిగింది ?
ఎ) 20 ఫిబ్రవరి 1956
బి) 10 అగస్టు 1956
సి) 01 నవంబర్ 1956
డి) 31 అగస్టు 1956
జవాబు : డి) 31 అగస్టు 1956
☛ Question No.9
01 నవంబర్ 1956న ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి ?
ఎ) తొలి గవర్నర్ - సి.ఎం త్రివేది
బి) తొలి ప్రతిపక్ష నేత - పుచ్చలపల్లి సుందరయ్య
సి) శాసనమండలి తొలి చైర్మన్ - కొండా లక్ష్మణ్ బాపూజీ
డి) తొలి ముఖ్యమంత్రి - నీలం సంజీవరెడ్డి
జవాబు : సి) శాసనమండలి తొలి చైర్మన్ - కొండా లక్ష్మణ్ బాపూజీ
శాసనమండలి తొలి చైర్మన్-`మాడపాటి హన్మంతరావు
☛ Question No.10
తెలంగాణ ప్రాంతీయ కమిటీకి సంబంధించి ఈ క్రిందవాటిలో సరైన వ్యాక్యాన్ని గుర్తించండి ?
1) దీనిని మొదటగా ప్రాంతీయ మండలిగా ఏర్పాటు చేసి తర్వాత తెలంగాణ ప్రాంతీయ కమిటీగా మార్చి అధికారాలను కుదించారు
2) 01 ఫిబ్రవరి 1958న భారత రాష్ట్రపతి జారీచేసిన ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీ ఆర్డర్ 1958 ఉత్తర్వుల ద్వారా ఏర్పడినది.
3) తెలంగాణ ప్రాంతీయ కమిటీ తెలంగాణ ఆర్థిక విద్యాపర అంశాల రక్షణకు ఏర్పాటు చేసిన చట్టబధ్ద సంస్థ
ఎ) 1, 2 మరియు 3
బి) 1 మరియు 2 మాత్రమే
సి) 2 మరియు 3 మాత్రమే
డి) 1 మరియు 3 మాత్రమే
జవాబు : ఎ) 1, 2 మరియు 3
☛ Question No.11
ఈ క్రిందివాటిలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తెలంగాణ ప్రాంతీయ సంఘం ఏర్పడిరది ?
ఎ) 1వ రాజ్యాంగ సవరణ
బి) 3వ రాజ్యాంగ సవరణ
సి) 5వ రాజ్యాంగ సవరణ
డి) 7వ రాజ్యాంగ సవరణ
జవాబు : డి) 7వ రాజ్యాంగ సవరణ
☛ Question No.12
తెలంగాణ రీజనల్ కమిటీకి జరిగిన మొదటి చైర్మన్ ఎన్నికలో అచ్యుత్ రెడ్డి ఈ క్రింది ఎవరిపై గెలుపు సాధించాడు ?
ఎ) బి.వి గురుమూర్తి
బి) రావి నారాయణరెడ్డి
సి) చెన్నారెడ్డి
డి) హయగ్రీవ చారి
జవాబు : బి) రావి నారాయణరెడ్డి
☛ Question No.13
తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధికారాలలో లేని అంశాన్ని గుర్తించండి ?
ఎ) తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ భూముల అమ్మకాలకు కమిటీ ఆమోదం అవసరం
బి) ప్రాంతీయ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే ముందు ఈ కమిటీ ఆమోదాన్ని పొందాలి
సి) ద్రవ్య బిల్లు కూడా ప్రాంతీయ కమిటీ పరిధిలోకి వస్తుంది
డి) మధ్యపాన నిషేద విషయాన్ని పరిశీలించి సలహాలు ఇస్తుంది
జవాబు : సి) ద్రవ్య బిల్లు కూడా ప్రాంతీయ కమిటీ పరిధిలోకి వస్తుంది
☛ Question No.14
తెలంగాణ ప్రాంతీయ కమిటీ, తెలంగాణ మిగులు నిధుల నుండి ఉపాధ్యాయుల భర్తీ చేపట్టాలని ప్రభుత్వానికి ఏ సంవత్సరంలో నివేదించింది ?
ఎ) 1962
బి) 1963
సి) 1964
డి) 1965
జవాబు : సి) 1964
☛ Question No.15
తెలంగాణ ప్రాంతీయ కమిటీ చేపట్టిన ఈ క్రింది కార్యక్రమాలలో సరైనవి గుర్తించండి ?
1) అమీర్‌పేటలో గల ప్రకృతి చికిత్స ఆసుపత్రికి ప్రాంతీయ కమిటీ గ్రాంటులను మంజూరు చేసింది
2) ఉస్మానియా యూనివర్సిటీ మూడు కోట్ల నిధుల గ్రాంటును మంజూరు చేసింది
ఎ) 1 మరియు 2
బి) 1 మాత్రమే
సి) 2 మాత్రమే
డి) రెండూ కాదు
జవాబు : ఎ) 1 మరియు 2
☛ Question No.16
తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధ్యక్షులను వరసు క్రమంలో అమర్చండి ?
1) కోదాటి రాజమల్లు
2) జే. చుక్కారావ్
3) హయగ్రీవచారి
4) అచ్చుత్ రెడ్డి
ఎ) 1, 2, 3, 4
బి) 4, 3, 2, 1
సి) 4, 3, 1, 2
డి) 4, 2, 3, 1
జవాబు : బి) 4, 3, 2, 1
☛ Question No.15
తెలంగాణ ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికైన తొలి ఉప ముఖ్యమంత్రి ఎవరు ?
ఎ) జేవి నర్సింగారావు
బి) కె.వి రంగారెడ్డి
సి) మర్రి చెన్నారెడ్డి
డి) కొండా లక్ష్మణ్ బాపూజీ
జవాబు : బి) కె.వి రంగారెడ్డి
0 Comments