
తెలంగాణ ఉద్యమ చరిత్ర (1956-1968) జీకే ప్రశ్నలు - జవాబులు Part -2
Telangana Movement History MCQ Gk Questions with Answers in Telugu
☛ Question No.1
ఈ క్రిందివాటిలో సరైనవి గుర్తించండి ?
1) ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1957 డిసెంబర్ 7న కేంద్రం ‘‘ది పబ్లిక్ ఎంప్లాయిమెంట్ యాక్ట్ 1957’’ ను తీసుకువచ్చింది
2) ఈ చట్టం దేశంలో ఉద్యోగరంగానికి సంబంధించిన పలు చట్టాలను రద్దు చేస్తూ జారీ చేయబడినది.
3) కేంద్ర ప్రభుత్వం ‘‘ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ రూల్`1959’’ ను ప్రవేశపెట్టారు
ఎ) 1, 2 మరియు 3
బి) 1 మరియు 3 మాత్రమే
సి) 1 మరియు 2 మాత్రమే
డి) 2 మరియు 3 మాత్రమే
జవాబు : సి) 1 మరియు 2 మాత్రమే
☛ Question No.2
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ రూల్స్ - 1959కు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి ?
ఎ) దీని ప్రకారం 15 సంవత్సరాలు నివసిస్తే స్థానికత వర్తిస్తుంది
బి) సచివాలయం శాఖాధిపతి కార్యాలయాల్లో ప్రతి మూడు ఉద్యోగాలలో రెండో ఉద్యోగానికి స్థానికత పాటించాలి
సి) స్థానికత నియమాలు తెలంగాణ ప్రాంతంలోని నాన్ గెజిటెడ్, స్థానిక సంస్థలలో ఉన్న ఉద్యోగాల నియామకాలు మాత్రమే వర్తిసాయి.
డి) ఈ చట్టం ద్వారా రూపొందించిన నియమాలు మొదటగా 10 సంవత్సరాలు కాలపరిమితిలో అమల్లోకి వచ్చాయి.
జవాబు : డి) ఈ చట్టం ద్వారా రూపొందించిన నియమాలు మొదటగా 10 సంవత్సరాలు కాలపరిమితిలో అమల్లోకి వచ్చాయి.
☛ Question No.3
1968లో ఈ క్రింది ఏ టిఆర్‌సి మాజీ చైర్మన్ స్థానికేతర్లను తెలంగాణ ప్రాంత ఉద్యోగాలలో భర్తీ చేయడాన్ని సమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరింది ఎవరు ?
ఎ) హయగ్రీవ చారి
బి) చొక్కారావు
సి) కోదాటి రాజమల్లు
డి) అచ్చుత్ రెడ్డి
జవాబు : డి) అచ్చుత్ రెడ్డి
☛ Question No.4
తెలంగాణ పరిరక్షణల ఉల్లంఘనపై 1958 మార్చి 8న హైదరాబాద్‌లో ఎవరి అధ్యక్షతన తెలంగాణ మహాసభ సమావేశం జరిగింది ?
ఎ) హరిచంద్ర హోడ
బి) ఎస్. వెంకటస్వామి
సి) మాడపాటి హనుమంతరావురావు
డి) గోపాల్‌రావు ఎక్బోటే
జవాబు : బి) ఎస్. వెంకటస్వామి
☛ Question No.5
1960లో రాజ్యసభ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన అన్యాయాల గురించి ప్రస్తావించిన ఈ క్రింది వ్యక్తులు ఎవరు ?
1) వి.కే థాగే
2) హరిచంద్ర హోదా
3) బొజ్జం నరసింహులు
4) వరకాంత గోపాల్ రెడ్డి
ఎ) పైవన్నీ
బి) 1, 2 మరియు 3
సి) 1 మరియు 2 మాత్రమే
డి) 2 మరియు 3
జవాబు : సి) 1 మరియు 2 మాత్రమే
☛ Question No.6
తెలంగా1967-68 లో ఓయూ వైస్ చాన్స్‌లర్లను తొలగించడంతో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఈ క్రింది ఎవరి నాయకత్వంలో సమ్మె జరిగింది ?
ఏ) పిన్నమనేని నరసింహరావు
బి) జైపాల్ రెడ్డి
సి) వెంకట్ రెడ్డి
డి) మల్లిఖార్జున్
జవాబు : ఏ) జైపాల్ రెడ్డి
☛ Question No.7
ఈ క్రింది వారిలో ఎవరు హైదరాబాద్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్‌కు కార్యదర్శిగా పనిచేశారు ?
ఎ) కె.ఆర్ అనూస్
బి) సురేంద్రనాథ్
సి) ఎస్.ఎల్.ఎన్ చారీ
డి) మహదేవ్ సింగ్
జవాబు : బి) సురేంద్రనాథ్
Also Read :
☛ Question No.8
ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) 1964-65లో కె.ఆర్ అమోస్ హైదరాబాద్ ఎన్జీవోస్ యూనియన్‌ను తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ యూనియన్‌గా మార్చారు
2) దీనికి వ్యవస్థాపక అధ్యక్షుడు - కె.ఆర్ అమోస్
3) దీనికి అసోసియేటీవ్ ప్రెసిడెంట్‌గా ఎస్.ఎల్.ఎన్ చారి చేశారు
ఎ) 1, 2, 3
బి) 1 మరియు 2
సి) 2 మరియు 3
డి) 1 మరియు 3
జవాబు : 1, 2, 3
☛ Question No.9
తెలంగాణ రక్షణ ఉద్యమం మొదట ఎక్కడ ప్రారంభమైంది ?
ఎ) వరంగల్
బి) కరీంనగర్
సి) పాల్వంచ
డి) హైదరాబాద్
జవాబు : సి) పాల్వంచ
☛ Question No.10
తెలంగాణ ప్రాంతీయ కమిటీ, తెలంగాణ మిగులు నిధుల నుండి ఉపాధ్యాయుల భర్తీ చేపట్టాలని ప్రభుత్వానికి ఏ సంవత్సరంలో నివేదించింది ?
ఎ) 1962
బి) 1963
సి) 1964
డి) 1965
జవాబు : సి) 1964
☛ Question No.11
ఈ క్రిందివాటిలో సరైన వాటిని గుర్తించండి ?
1) 1968లో ప్రజాప్రతినిధుల సమావేశంలో లచ్చన్న ఆంధ్రప్రాంతంలో సూపర్ న్యూమరి ఉద్యోగాలను ఏర్పాటు చేసి ముల్కీ నియమాలకు విరుద్దంగా ఉన్న వారిని వెనక్కు పంపాలని సూచించాడు
2) ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రితో సహా అందరూ అంగీకరించారు
3) దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అప్పటి ఆంధ్ర రాష్ట్ర సభ్యుడు - నీలం సంజీవరెడ్డి
ఎ) 1 మరియు 2
బి) 2 మరియు 3
సి) 2 మాత్రమే
డి) 1, 2 మరియు 3
జవాబు : ఎ) 1 మరియు 2
☛ Question No.12
ఈ క్రిందవాటిలో సరైనవి గుర్తించండి ?
1) 1960లో ప్రాంతీయ సంఘ అధ్యక్షుడు అచ్యుత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణకు జరిగిన అన్యాయాలపైన ప్రకటన చేసిన ప్రభుత్వాన్ని విమర్శించారు.
2) తెలంగాణకు జరిగిన అన్యాయాలను అర్థం చేసుకొని దామోదర్ సంజీవయ్య ప్రభుత్వం 1961లో శ్వేతపత్రము విడుదల చేసింది
ఎ) 1 మరియు 2
బి) 2 మాత్రమే
సి) 1 మాత్రమే
డి) రెండూ కావు
జవాబు : ఎ) 1 మరియు 2
☛ Question No.13
ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉర్దూ స్థానంలో తెలుగును అధికార భాషగా ప్రకటించారు ?
ఎ) 1965
బి) 1966
సి) 1967
డి) 1968
జవాబు : బి) 1966
☛ Question No.14
1969 ఉద్యమ కారణాలను గుర్తించండి ?
1) రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ఉద్యోగులందరిని తొలగించడం, దీనిలో ఎక్కువమంది తెలంగాణ వాళ్లు ఉండడం
2) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ నివాస అర్హత నిబంధనలను మరొక ఐదేళ్లు పొడగించకపోవడం
3) ఉపాధ్యాయులలో, విద్యార్థులలో అ సంతృప్తి
ఎ) 1, 2 మరియు 3
బి) 1 మరియు 3 మాత్రమే
సి) 1 మరియు 2 మాత్రమే
డి) 2 మరియు 3 మాత్రమే
జవాబు : ఎ) 1, 2 మరియు 3
☛ Question No.15
కొలిశెట్టి రామదాసు తెలంగాణ ప్రాంతీయ సమితిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?
ఎ) 1966
బి) 1967
సి) 1968
డి) 1969
జవాబు : సి) 1968
0 Comments