
అహ్మదాబాద్ మిల్లు సత్యాగ్రహం | Ahmedabad Mill Strike
Modern Indian History in Telugu | History in Telugu
Gk in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. Gk Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Centran Investigation Agencies etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే General Knowledge పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.
అహ్మదాబాద్ మిల్లు సత్యాగ్రహం 1918 లో జరిగింది. గాంధీజీ అహ్మదాబాద్‌లోని మిల్లు కార్మికుల తరపున వారికి న్యాయం జరిగేలా, వారి కోరికలు నెరవేరడం కోసం అహ్మదాబాద్ మిల్లు సత్యాగ్రహం చేపట్టాడు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా కార్మికులకు మిల్లు యాజమాన్యం బోనస్‌లు ఇవ్వడం ఆపివేసింది. అంతేకాకుండా 1917లో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు కార్మికులు అహ్మదాబాద్ విడిచి తమ సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. మిల్లు యజమానులు కార్మికులను తిరిగి రప్పించడానికి కార్మికుల యొక్క వేతనాన్ని 75% పెంచుతారు. కానీ ప్లేగువ్యాధి తగ్గుముఖం పట్టాక మిల్లు యజమానులు పెంచిన వేతనం కాకుండా ప్లేగువ్యాధికి ముందు ఇచ్చిన వేతనాన్నే ఇవ్వడం ఆరంభించారు. దీంతో కార్మికులకు, యజమానులకు మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. అనసూయబెన్ సారాబాయ్, అంబాలాల్ సారాబాయ్ పిలుపుమేరకు గాంధీజీ మిల్లు కార్మికులకు అనుకూలంగా, యజమానులకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని చేపట్టి 1918లో అహ్మదాబాద్‌లో కార్మికులతో కలిసి ‘టెక్స్‌టైల్ లేబర్ యూనియన్’ అనే సంఘాన్ని స్థాపించాడు. ఈ ఉద్యమంలో భాగంగా గాంధీజీ 26 మార్చి 1918న మొదటిసారిగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు. గాంధీజీ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా మిల్లు యజమానులు దిగివచ్చి కార్మికుల వేతనాలను 35% పెంచి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కార్మికులకు మరియు యజమానులకు మధ్య చర్చలకు ‘‘ఆనందశంకర ధృవ’ మధ్యవర్తిగా వ్యవహరించాడు.
0 Comments