
శాసనోల్లంఘన ఉద్యమం Civil Disobedience Movement in Telugu | Dandi March | Indian History in Telugu | History in Telugu | Gk in Telugu
1929లో లాహోర్‌లో జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యం సాధించాలనే తీర్మాణం చేయబడిరది. ఆ సమావేశంలో నెహ్రూ ‘‘పూర్ణ స్వరాజ్’’ లక్ష్యమని ప్రకటించాడు. 1930 ఫిబ్రవరిలో సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో బ్రిటీష్ వారు ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక ఉప్పు చట్టాలని ఉల్లంఘించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు 1930లో గాంధీజీ బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్‌కకు 11 ప్రతిపాదనలను తెలియజేస్తు లేఖ వ్రాశాడు. వీటిని తీర్చకపోతే శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభిస్తానని హెచ్చరించాడు.
➺ 11 ప్రతిపాదనలు :
- 50 శాతం భూమి శిస్తు తగ్గించాలి
- ఉప్పుపై పన్ను రద్దు చేయాలి
- సముద్ర తీర నౌకా రవాణాకు భారతీయులకు అవకాశం కల్పించాలి
- రూపాయి మారకపు నిష్పత్తిని తగ్గించాలి
- దేశీయ జౌళి పరిశ్రమకు రక్షణ కల్పించాలి
- 50 శాతం సైనిక వ్యయాన్ని తగ్గించాలి
- మత్తు పదార్థాలను పూర్తిగా నిషేదించాలి
- పౌర పాలనా వ్యయంలో 50 శాతం తగ్గింపు
- రాజకీయ ఖైదీలందరిని విడుదల చేయాలి
- కేంద్ర ఇంటిలిజెన్స్ విభాగాన్ని సంస్కరించాలి
- స్వీయరక్షణ కోసం పౌరులు ఆయుధాలు ధరించడానికి అనుమతి ఇవ్వాలి
Also Read :
11 ప్రతిపాదనలతో కూడిన లేఖను వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ తిరస్కరించారు. దీంతో 1930 మార్చి 12న సబర్మతి ఆశ్రమం నుండి బయలు దేరి కాలినడకన గుజరాత్ తీర ప్రాంత పట్టణమైన దండిని చేరవలెనని గాంధీజీ నిర్ణయం తీసుకున్నాడు.
ఉప్పు సత్యాగ్రహం / దండి యాత్ర
ఉప్పు సత్యాగ్రహాన్ని దండియాత్ర అని కూడా పిలుస్తారు. ఇది 12 మార్చి 1930న ప్రారంభమైంది. భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఇదొక ముఖ్యమైన సంఘటనగా నిలిచింది. ఇది బ్రిటిష్ వారి పన్ను విధానాలకు వ్యతిరేకంగా కొనసాగించిన ఉద్యమం. గాంధీ అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమం నుండి గుజరాత్‌లోని దండి గ్రామానికి దండి యాత్ర మొదలు పెట్టాడు. ఈ యాత్ర 24 రోజుల పాటు 240 మైళ్లు (390 కి.మీ) ప్రయాణించి దండి గ్రామానిక చేరుకొని పన్ను కట్టకుండా ఉప్పును తయారు చేశారు. 06 ఏప్రిల్ 1930న గాంధీ ఉప్పు చట్టాలను ఉల్లంఘించాడు. ఇది భారతీయులు బ్రిటిష్ పన్ను విధానాలకు వ్యతిరేకంగా పనిచేయుటకు దోహదపడినది.
➺ గాంధీ - ఇర్విన్ ఒప్పందం :
1931లో గాంధీ మరియు వైస్రాయ్ ఇర్విన్ మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో గాంధీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేయడానికి ఒప్పుకున్నాడు. లండన్‌లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశాలకు హజరుకావడానికి గాంధీ ఒప్పుకున్నాడు. కాంగ్రెస్ కార్యకర్తలను జైళ్లు నుండి విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఎలాంటి పన్ను లేకుండా ఉప్పు తయారుచేసుకునే అవకాశం కల్పించింది.
0 Comments